సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు ఎప్పటికప్పుడు ఖరీదైన, విలాసవంతమైన కార్లను కొనుగోలు చేస్తారనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జొమాటో సిఈవో, వ్యవస్థాపకుడు 'దీపిందర్ గోయల్' ఇటీవల అత్యంత ఖరీదైన 'ఫెరారీ రోమా' కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే సోషల్ మీడియాలో వెల్లడైన కొన్ని ఫోటోల ప్రకారం, ఈయన కొనుగోలు చేసిన కారు హర్యానాలోని గురుగ్రామ్ రోడ్లపై తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ కారు ధర సుమారు రూ. 4.3 కోట్లు (ఆన్-రోడ్ ప్రైస్). ఇది రెడ్ కలర్‌లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. చిత్రమేమంటే జొమాటో యాప్ కూడా ఇదే కలర్‌లో ఉండటం గమనార్హం.
ఫెరారీ కంపెనీ 2021లో రోమా కారుని ప్రారంభించింది. అయితే ఇది భారతదేశంలో కొంతమంది ధనవంతుల వద్ద మాత్రమే ఉంది. దీనికి కారణం ఈ కారు ధర ఎక్కువగా ఉండటమే. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్‌ఎల్‌లతో స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లను పొందుతుంది. అంతే కాకుండా క్వాడ్-ఎగ్జాస్ట్ సెటప్, ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ స్పాయిలర్ కూడా ఇందులో ఉన్నాయి.
(ఇదీ చదవండి: బజాజ్ ప్రేమికుల కోసం చేతక్ ప్రీమియం ఎడిషన్.. ధర, రేంజ్ వివరాలు)
ఫెరారీ రోమా క్యాబిన్, డ్రైవర్, కో డ్రైవర్ సీటు కూడా భిన్నంగా ఉంటాయి. సెంటర్ కన్సోల్‌లో 8.4 ఇంచెస్ టాబ్లెట్-స్టైల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 16 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బటన్‌లతో కూడిన కొత్త స్టీరింగ్ వీల్ కూడా ఇందులో అమర్చబడి ఉంటాయి.
ఫెరారీ రోమా 3.9 లీటర్ ట్విన్‌టర్బో వి8 ఇంజన్ కలిగి 690 బిహెచ్‌పి పవర్, 760 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ వద్ద ఫెరారీ రోమాతో పాటు లంబోర్ఘిని ఉరస్, పోర్షే 911 కారెరా వంటి సూపర్ కార్లు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment