ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ నాలుగు ఏళ్లలో 15 కిలోలు బరువు తగ్గినట్లు ప్రకరించారు. తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.
2019లో కోవిడ్ మహమ్మారి విజృంభణకు కొన్ని నెలల ముందు నుంచే తాను పనితోపాటు ఆరోగ్యానికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించినట్లు దీపిందర్ గోయల్ రాసుకొచ్చారు. అంటే మరీ విపరీతంగా అన్నీ చేయడం కాకుండా చిన్న చిన్నగా స్థిరత్వాన్ని కొనసాగించినట్లు తెలిపారు. తాను 2019లో ఎలా ఉన్నాడో.. 2023 ఎలా మారాడో ఫొటోలను జత చేశారు.
గోయల్ తన శరీరంలోని కొవ్వును 28 శాతం నుంచి 11.5 శాతానికి తగ్గించగలిగారు. 2019లో 87 కిలోల బరువున్న ఆయన ఇప్పుడు 72 కిలోలకు తగ్గారు. అలాగే ఆరోగ్యానికి అత్యంత హానికరమైన చెడు కొలెస్ట్రాల్‌ను కూడా గణనీయంగా తగ్గించుకున్నారు. 2019లో 165 mg/dL ఉన్న చెడు కొలెస్ట్రాల్ ప్రస్తుతం 55 mg/dL కు తగ్గింది. అదేవిధంగా గుండె జబ్బుకు కారణమయ్యే ట్రైగ్లిజరైడ్స్ 185 mg/dL నుంచి 86 mg/dLకి తగ్గాయి. ఇక బ్లడ్ షుగర్ కూడా 6.2 నుంచి 4.8కి తగ్గిందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి ➤ ChatGPT Diet Plan: చాట్‌జీపీటీ డైట్ ప్లాన్.. 11 కేజీల బరువు తగ్గాడు!
కాగా దీపిందర్ గోయల్ చేసిన ఈ పోస్టు అనేక మంది యూజర్లను విశేషంగా ఆకర్షించింది. దీనిపై పలువురు ఫాలోవర్లు తమ నచ్చిన విధంగా కామెంట్లు చేశారు. దేశం మొత్తం జొమాటో నుంచి ఆర్డర్ చేస్తుంటే దాని సీఈవో మాత్రం ఇంటి ఫుడ్ తింటున్నారని ఓ యూజర్ చమత్కరించారు. ఈ అద్భుతమైన పరివర్తన వెనుక ఉన్న రహస్యం చెప్పాలని కోరుతూ ఓ ఫాలోవర్ చేసిన కామెంట్‌పై దీపిందర్ గోయల్ ప్రతిస్పందించారు. స్థిరత్వమే రహస్యంమని రిప్లై ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment