2024 సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి ప్రపంచంలోని చాలా దేశ ప్రజలతో పాటు భారతీయులు కూడా సిద్ధమయ్యారు. ఈ సందర్భంలో ఫుడ్, డ్రింక్స్ వంటి వాటి కోసం జొమాటో, స్విగ్గీ వంటి యాప్‌ల మీద పడ్డారు. 2023 డిసెంబర్ 31 రోజు మాత్రమే జొమాటో లెక్కకు మించిన డెలివరీలు చేసి ఏకంగా రూ. 97 లక్షల టిప్స్ పొందినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఇండియన్ జొమాటో డెలివరీ భాగస్వాములకు కస్టమర్లు ఏకంగా రూ. 97 లక్షలకు పైగా టిప్ ఇచ్చినట్లు జోమాటో సీఈవో 'దీపిందర్ గోయల్' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
2015 నుంచి 2020 వరకు కంపెనీ ఎన్ని ఆర్డర్లను స్వీకరించిందో.. ఒక్క 2023 డిసెంబర్ 31న ఒకే రోజు స్వీకరించి గతంలో నెలకొన్ని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సుమారు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్ట్నర్స్ ఈ డెలివరీలను చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: టెస్టింగ్ దశలో కొత్త ఫీచర్.. నచ్చిన ధరకే రైడ్!
దేశంలో ఎక్కువ ఆర్డర్స్ మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు, కలకత్తాకు చెందిన ఓకే వ్యక్తి 125 ఐటెమ్‌లను ఆర్డర్ చేసుకున్నాడు. ప్రజలు 1.47 లక్షల చిప్స్ ప్యాకెట్లు, 68,231 సోడా బాటిళ్లు, 2,412 ఐస్ క్యూబ్స్ ప్యాకెట్లు, 356 లైటర్లను ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Love you, India! You’ve tipped over ₹97 lakhs till now to the delivery partners serving you tonight ❤️❤️❤️
— Deepinder Goyal (@deepigoyal) December 31, 2023
Comments
Please login to add a commentAdd a comment