ప్రముఖ ఫుడ్ డెలివరి సంస్థ జొమాటో (Zomato) సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారిపోయారు. ఫ్రెండ్‌షిప్ డే (Friendship Day) సందర్భంగా సాధారణ డెలివరీ బాయ్ లాగా రెడ్ టీ షర్ట్ ధరించి బైక్‌పై ఫుడ్ డెలివరీలు చేశారు.
దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జొమాటో టీ షర్ట్ వేసుకున్న దీపిందర్ గోయల్ ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా పలువురు కస్టమర్లకు, డెలివరీ పార్ట్‌నర్స్‌కు, రెస్టారెంట్ పార్ట్‌నర్స్‌కు ఫుడ్ పార్సిల్స్, ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు అందించేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై బయలుదేరారు.
ఇదీ చదవండి: ..అలా 15 కేజీలు బరువు తగ్గాను: ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన ఫుడ్ డెలివరీ యాప్ సీఈవో
'రెస్టారెంట్లు, వినియోగదారులతోపాటు డెలివరీ పార్ట్‌నర్స్‌కు ఆహారం, ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లను అందించేందుకు వెళ్తున్నా. ఇది నాకు ప్రత్యేకమైన ఆదివారం' అంటూ దీపిందర్ గోయాల్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిపై యూజర్లు తమకు తోచిన విధంగా స్పందించారు. అంతా బాగుంది కానీ, ఆర్డర్లపై ఫ్రెండ్‌షిప్ డే చార్జ్‌లేవీ విధించరు కదా అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు.
Going to deliver some food and friendship bands to our delivery partners, restaurant partners and customers. Best Sunday ever!! pic.twitter.com/WzRgsxKeMX
— Deepinder Goyal (@deepigoyal) August 6, 2023
Comments
Please login to add a commentAdd a comment