కాలిఫోర్నియా: 1960వ దశకంలో రేసింగ్‌లో పాల్గొంటుండగా మంటల్లో చిక్కుకొని తుక్కుగా మారిన ఫెరారీ కారు తాజాగా వేలంలో రూ.15 కోట్ల(1.8 మిలియన్ డాలర్లు) ధర పలికింది. ఈ ‘ఫెరారీ 500 మాండియార్ స్పైడర్ సిరీస్–1’ కారును 1954లో తయారు చేశారు. ప్రముఖ ఇటాలియన్ రేసర్ అల్బర్టో అస్కరీ 1952, 1953లో ఫార్ములా వన్ వరల్డ్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో సాధించిన విజయాలకు గుర్తుగా ఫెరారీ సంస్థ దీన్ని తయారు చేసింది.
రేసింగ్ డ్రైవర్ ఫ్రాంకో కోర్టెస్ 1954లో కారును కొనుగోలు చేశాడు. అనంతరం 1958లో ఇది అమెరికాకు చేరుకుంది. 1960లలో ఓ రేసులో ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయింది. 1978 వరకూ పలువురి చేతులు మారుతూ వచి్చంది. పూర్తిగా ధ్వంసమైన స్థితిలో ఉన్న ఈ కారును ఓ వ్యక్తి కొనుగోలు చేసి, దాదాపు 45 ఏళ్లపాటు అలాగే కాపాడుతూ వచ్చాడు. ఇటీవల ఆర్‌ఎం సోథ్‌బీ సంస్థ ఈ కారును వేలం వేసింది. ఏకంగా రూ.15 కోట్లు పలికింది. కారును బాగుచేసి, మళ్లీ రేసింగ్ ట్రాక్‌పై తీసుకొస్తానని దాన్ని కొనుక్కున్న వ్యక్తి చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment