Burned car
-
తుక్కు రేసింగ్ కారుకు వేలంలో రూ.15 కోట్లు
కాలిఫోర్నియా: 1960వ దశకంలో రేసింగ్‌లో పాల్గొంటుండగా మంటల్లో చిక్కుకొని తుక్కుగా మారిన ఫెరారీ కారు తాజాగా వేలంలో రూ.15 కోట్ల(1.8 మిలియన్ డాలర్లు) ధర పలికింది. ఈ ‘ఫెరారీ 500 మాండియార్ స్పైడర్ సిరీస్–1’ కారును 1954లో తయారు చేశారు. ప్రముఖ ఇటాలియన్ రేసర్ అల్బర్టో అస్కరీ 1952, 1953లో ఫార్ములా వన్ వరల్డ్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో సాధించిన విజయాలకు గుర్తుగా ఫెరారీ సంస్థ దీన్ని తయారు చేసింది. రేసింగ్ డ్రైవర్ ఫ్రాంకో కోర్టెస్ 1954లో కారును కొనుగోలు చేశాడు. అనంతరం 1958లో ఇది అమెరికాకు చేరుకుంది. 1960లలో ఓ రేసులో ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయింది. 1978 వరకూ పలువురి చేతులు మారుతూ వచి్చంది. పూర్తిగా ధ్వంసమైన స్థితిలో ఉన్న ఈ కారును ఓ వ్యక్తి కొనుగోలు చేసి, దాదాపు 45 ఏళ్లపాటు అలాగే కాపాడుతూ వచ్చాడు. ఇటీవల ఆర్ఎం సోథ్‌బీ సంస్థ ఈ కారును వేలం వేసింది. ఏకంగా రూ.15 కోట్లు పలికింది. కారును బాగుచేసి, మళ్లీ రేసింగ్ ట్రాక్‌పై తీసుకొస్తానని దాన్ని కొనుక్కున్న వ్యక్తి చెప్పాడు. -
తిరుమల ఘాట్‌రోడ్డులో రన్నింగ్ కారు మంటలు
సాక్షి, చిత్తూరు: తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో మంటలు ఎగసిపడ్డాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో కారు అక్కడికక్కడే దగ్ధం అయింది. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా చివరి మలుపులో ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ అప్రమత్తమవడంతో భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడ్డ వారిని కర్నూలుకు చెందిన మహేశ్వర్‌రెడ్డి, సుజాతగా గుర్తించారు. -
శశికళతో మాట్లాడాడని.. కారుపై పెట్రోలు పోసి
సాక్షి ప్రతినిధి, చెన్నై: శశికళతో ఫోన్లో మాట్లాడారని అన్నాడీఎంకే నేత కారును గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ సంఘటన రామనాథపురం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన శశికళ ఇటీవల మళ్లీ ఉత్సాహం చూపుతున్నారు. అన్నాడీఎంకే నేతలతో టచ్‌లో ఉంటున్నారు. అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రామనాథపురం జిల్లా అన్నాడీఎంకే ఎంజీఆర్ యువజన విభాగం కార్యదర్శిగా కొన్నాళ్లు పనిచేసిన విన్సెంట్ రాజాతో శశికళ ఇటీవల మాట్లాడారు. ఈ ఆడియా సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీంతో అన్నాడీఎంకే అధిష్టానం విన్సెంట్ రాజాను పార్టీ నుంచి బహిష్కరించి ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేసింది. కాగా విన్సెంట్ రాజాకు పరమకుడి సమీపంలోని మేలక్కావనూరు గ్రామంలో కాంక్రీట్ మిక్సింగ్ కంపెనీ ఉంది. ఇక్కడి సెక్యూరిటీ గార్డు ఆదివారం రాత్రి విధులకు రాలేదు. కంపెనీ ప్రాంగణంలో కారును పార్క్ చేసి అక్కడి గదిలో విన్సెంట్ రాజా నిద్రించాడు. సోమవారం తెల్లవారుజాము 2.45 గంటల సమయంలో పెద్దగా శబ్దం రావడంతో బయటకు వచ్చి చూశారు. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు కారుపై పెట్రోలు పోసి తగలబెడుతున్నారు. విన్సెంట్‌ను చూడగానే పారిపోయారు. విన్సెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: దారుణం: దెయ్యం పట్టిందని కొడుకును కొట్టి చంపిన తల్లి -
చెలరేగిన మంటలు
-
చెలరేగిన మంటలు: కారు దగ్ధం
సాక్షి, వైఎస్సార్ కడప: జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుండుపల్లె మండలం భాగంపల్లి వద్ద ఓ కారులో దట్టమైన మంటలు చెలరేగాయి. భారీ మంటలకు కారు పూర్తిగా దగ్ధమైంది. చిత్తూరు నుంచి వైఎస్సార్ కడపకి వస్తుంటే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్నవారు మంటలను గుర్తించి వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగి మంటల నుంచి తప్పించుకున్నారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఒక్కసారిగా దట్టమైన మంటలు చెలరేగడంతో తీవ్ర భయాందోళనకు గురైనట్లు కారులో ప్రయాణిస్తున్న వారు తెలిపారు. -
విశాఖపట్నం: మంటలు చెలరేగి కారు దగ్ధం
-
నడిరోడ్డుపై ఇండిగో కారు దగ్ధం..
సాక్షి, విశాఖపట్నం : పెందుర్తిలో సోమవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపం సమీపంలోని పెట్రోల్ బంక్ కూడలి వద్ద కారులో అనూహ్యంగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎయిర్ పోర్ట్ నుండి సింహాచలం వైపు వెళ్తున్న టాటా ఇండిగో కారు మంటలతో పూర్తిగా పూర్తిగా దగ్ధమైంది. కారులో మంటలు చూసి డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదం సమయంలో డ్రైవర్ తో పాటు కారులో నలుగురు ప్యాసింజర్లు ప్రయాణిస్తున్నారు. అయితే వారెవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
కారులోనే చితిమంట..!
బొమ్మలసత్రం(నంద్యాల): తండ్రి అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన తల్లి కూడా అస్వస్థతకు గురైంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి కారులో తిరిగొస్తున్న కుమారుడికి మృత్యువు లారీ రూపంలో ఎదురుపడింది. కష్టాలతో ప్రయాణం చేస్తున్న ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అసలేం జరిగింది.. నంద్యాల రూరల్ సీఐ దివాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని టెక్కె నాగులకట్ట వీధికి చెందిన దేశాయి రవికుమార్, ఉమాదేవి కుమారుడు శివకుమార్ (35)కు పుట్టుకతోనే పోలియో సోకడంతో రెండు కాళ్లూ పనిచేయవు. దివ్యాంగుడైనప్పటికీ బాగా చదువుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ ఉద్యోగం సాధించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివకుమార్ తండ్రి సోమవారం, తల్లి ఉమా దేవి మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. స్నేహితుల సహాయంతో తల్లిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి.. బుధవారం వేకువజామున శివకుమార్ నంద్యాలకు బయలు దేరారు. స్నేహితుడు కాశీ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. నంద్యాల శివారులోని శాంతిరామ్ ఆసుపత్రి వద్ద కారు ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో కారు లారీని ఢీకొట్టి ఇరుక్కుపోయింది. దీన్ని గమనించని లారీ డ్రైవర్ కారును దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. కారులో మంటలు చెలరేగడంతో ముగ్గురు స్నేహితులు బయటకు దూకి తమ ప్రాణాలను దక్కించుకున్నారు. శివకుమార్‌ను రక్షించేందుకు వారు విఫలయత్నం చేశారు. శివకుమార్ నిస్సహాయ స్థితిలో కారులోనే సజీవ దహనమయ్యాడు. మరో వాహనదారుడు లారీని ఓవర్టేక్ చేసి చెప్పేవరకు డ్రైవర్ గమనించక పోవడం గమనార్హం. -
షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్ధం
షాబాద్: రోడ్డుపై వెళ్తున్న ఓ కారు షార్ట్‌సర్క్యూట్‌తో కాలిపోయింది. ఈ సంఘటన మండల పరిధిలోని సీతారాంపూర్ సమీపంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయ ంలో చోటుచేసుకుంది. వివరాలు.. చేవెళ్ల మండలం న్యాలట గ్రామానికి చెందిన నాగేశ్, అనిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనిత సోదరులకు రాఖీలు కట్టేందుకు ఆదివారం కుటుంబ సమేతంగా మారుతీ 800 కారులో షాద్‌నగర్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో షాబాద్ మండలం సీతారంపూర్ సమీపంలో కారు ఇంజిన్‌లోంచి పొగలు వచ్చాయి. గమనించిన దంపతులు వెంటనే తమ పిల్లలతో కలిసి కిందికి దిగారు. క్షణాల్లోనే మంటలు వ్యాపించి కారు కాలిపోయింది. చేవెళ్ల నుంచి ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పింది. ఎస్ఐ చంద్రకాంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.