
సాక్షి, చిత్తూరు: తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో మంటలు ఎగసిపడ్డాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో కారు అక్కడికక్కడే దగ్ధం అయింది. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా చివరి మలుపులో ఈ ప్రమాదం జరిగింది.
కారు డ్రైవర్ అప్రమత్తమవడంతో భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడ్డ వారిని కర్నూలుకు చెందిన మహేశ్వర్‌రెడ్డి, సుజాతగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment