
సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బైక్ అదుపు తప్పి బస్సును ఢీకొన్ని ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. ఇక, మృతిచెందిన మహిళను గుంటూరు జిల్లాకు చెందిన జ్యోతిగా పోలీసులు గుర్తించారు.
వివరాల ప్రకారం.. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 16వ మలుపు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ బైక్ అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న జ్యోతి తీవ్రంగా గాయపడ్డింది. దీంతో, ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. జ్యోతిని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. కాగా, మృతురాలు దాసరి జ్యోతి గుంటూరు జిల్లా మాచర్లలోని ఎర్రగడ వీధికి చెందినట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment