
సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులో ఘెర ప్రమాదం చోటు చేసుకుంది. ఘట్ రోడ్డులో ఆరవ మలుపు వద్ద టెంపో బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ టెంపోలో కర్ణాటకలోని కోలార్ ప్రాంతానికి చెందిన భక్తులకు ప్రయాణిస్తున్నట్లు అధికారుల తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లే ఈప్రమాదం జరిగినట్లు కొందరు భక్తుల చెబుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అతను మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు.
ఈ ఘటనలో గాయపడిన భక్తులను సమీపంలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ఐతే క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో రుయా నుంచి బర్డ్ ఆస్పత్రికి తరలించారు. భక్తులకు మరింత మెరుగైన వైద్యం అందేలా ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల ఘాట్ రోడ్డులో వరుసగా ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం బాధకరమని, సత్వరమే దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వాహనాల వేగ నియంత్రణకు సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరారు ధర్మారెడ్డి.
(చదవండి: చంద్ర పుష్కరణి బావిలో జారిపడ్డ భక్తురాలు)