రోడ్డుపై వెళ్తున్న ఓ కారు షార్ట్‌సర్క్యూట్‌తో కాలిపోయింది. ఈ సంఘటన మండల పరిధిలోని సీతారాంపూర్ సమీపంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయలో చోటుచేసుకుంది.
షాబాద్: రోడ్డుపై వెళ్తున్న ఓ కారు షార్ట్‌సర్క్యూట్‌తో కాలిపోయింది. ఈ సంఘటన మండల పరిధిలోని సీతారాంపూర్ సమీపంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయ ంలో చోటుచేసుకుంది. వివరాలు.. చేవెళ్ల మండలం న్యాలట గ్రామానికి చెందిన నాగేశ్, అనిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనిత సోదరులకు రాఖీలు కట్టేందుకు ఆదివారం కుటుంబ సమేతంగా మారుతీ 800 కారులో షాద్‌నగర్ వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో షాబాద్ మండలం సీతారంపూర్ సమీపంలో కారు ఇంజిన్‌లోంచి పొగలు వచ్చాయి. గమనించిన దంపతులు వెంటనే తమ పిల్లలతో కలిసి కిందికి దిగారు. క్షణాల్లోనే మంటలు వ్యాపించి కారు కాలిపోయింది. చేవెళ్ల నుంచి ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పింది. ఎస్‌ఐ చంద్రకాంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.