
సాక్షి, విశాఖపట్నం : పెందుర్తిలో సోమవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపం సమీపంలోని పెట్రోల్ బంక్ కూడలి వద్ద కారులో అనూహ్యంగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎయిర్ పోర్ట్ నుండి సింహాచలం వైపు వెళ్తున్న టాటా ఇండిగో కారు మంటలతో పూర్తిగా పూర్తిగా దగ్ధమైంది. కారులో మంటలు చూసి డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదం సమయంలో డ్రైవర్ తో పాటు కారులో నలుగురు ప్యాసింజర్లు ప్రయాణిస్తున్నారు. అయితే వారెవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Comments
Please login to add a commentAdd a comment