pendurti
-
విశాఖ: మహిళపై టీడీపీ నేత యాసిడ్ దాడి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో టీడీపీ నాయకుడు రెచ్చిపోయారు. మహిళపై టీడీపీ నేత నర్సింగరావు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నర్సింగరావు.. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అనుచరుడు. ఈనెల 7వ తేదీన మధ్యాహ్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్మెయిల్? -
AP: బండారుపై తిరగబడ్డ జనం.. వెళ్లవయ్యా.. వెళ్లు!
పెందుర్తి: ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి కార్యక్రమాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేస్తే జనం ప్రతిఘటన ఎలా ఉంటుందో విశాఖ ప్రజలు టీడీపీ నేతలకు రుచి చూపించారు. వారికి గట్టిగా బుద్ధి చెప్పి, అక్కడి నుంచి పారిపోయేలా చేశారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆయనతోపాటు వచ్చిన వారికి విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ ఇప్పిలివానిపాలెంలో సోమవారం ఎదురైన భంగపాటిది. నిరుపేదలకు ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని కుట్రపూరితంగా అడ్డుకోవాలన్న వారి దుర్మార్గపు ఆలోచనకు ప్రజలు తీవ్ర స్థాయిలో బదులిచ్చారు. ప్రజలంతా తిరగబడ్డంతో ›‘40’ ఏళ్ల అనుభవం అక్కడి నుంచి పారిపోయింది. పారని ‘పచ్చ’ పాచిక ఇప్పిలివానిపాలెం సర్వే నెంబర్ 81/2లో ప్రభుత్వం నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు జగనన్న కాలనీలో ఇంటి స్థలాలు కేటాయించింది. మొత్తం 90 మంది లబ్ధిదారులు ఈ లేఅవుట్లో స్థలాలు పొందారు. వారిలో కొందరు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పునాదులు నింపేందుకు çసమీపంలోని కొండవాలు ప్రాంతం నుంచి మట్టిని సేకరిస్తున్నారు. దీన్ని రాజకీయం చేయాలన్న కుట్రతో టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బండారుకు సమాచారం ఇచ్చారు. వెంటనే బండారు సత్యనారాయణమూర్తి, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ తమ అనుచరులను వెంటేసుకుని లేఅవుట్ వద్దకు వచ్చారు. ఇక్కడి మట్టిని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు అమ్ముకుంటున్నారని, ఎవరూ తవ్వడానికి వీల్లేదని అంటూ వీరంగం వేశారు. ఇళ్ల కోసం మట్టిని తవ్వుకుంటున్నామని పేదలు చెప్పినా వినలేదు. తీవ్రస్థాయిలో అక్కడ రచ్చ చేసే ప్రయత్నం చేశారు. దీంతో చిర్రెక్కిన పేదలు టీడీపీ మూకపై తిరగబడ్డారు. మట్టిని ఎవరు అమ్ముకుంటున్నారో నిరూపించాలని నిలదీశారు. ‘మీ ప్రభుత్వ హయాంలో ఒక్క నిరుపేదకైనా ఇళ్లు ఇచ్చారా? జగన్‌బాబు (సీఎం వైఎస్ జగన్) వచ్చిన తరువాత మాకందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేసి ఇళ్లు కట్టిస్తున్నాడు. మా బతుకులు మేం బతుకుతుంటే మీరెందుకు మా బతుకుల్లో నిప్పులు పోయాలని చూస్తారు? మీ రాజకీయాల కోసం మాలాంటి వాళ్లను ఇబ్బంది పెడతారా?’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి కుట్రలు చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ‘మీరు పేదల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా? మంచి పనిని కూడా ఇలా చెడగొడతారా? మీకు సిగ్గూ శరం లేదా?’ అంటూ మహిళలు మండిపడ్డారు. పేదల ఆగ్రహావేశాలను చూసిన బండారు బృందానికి నోట మాట రాలేదు. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని పేదలు మరోసారి హెచ్చరించడంతో బండారు, పీలా తదితరులు వెనక్కి మళ్లారు. ఏం చేయాలో పాలుపోని బండారు లే అవుట్ సమీపంలో ఓ చెట్టు కిందకు వెళ్లి కాసేపు మౌనంగా ఉండిపోయారు. కాసేపటికి తర్వాత తేరుకొని, యథావిధిగా ప్రభుత్వంపై విమర్శలు చేసి ఇంటి దారి పట్టారు. బండారు, టీడీపీ నేతల దిగజారుడు రాజకీయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పసి పిల్లలతో ‘పచ్చ’ నేతల వ్యాపారం
పెందుర్తి: ‘పచ్చ’చొక్కాలు వేసుకుని రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని డాబు చేయడం వారి సాధారణ కోణం.. ఆస్పత్రుల నుంచి పసి పిల్లలను దొంగ చాటున ఎత్తుకొచ్చి నడిబజారులో విక్రయించడం వారి చీకటి కోణం. ఇటీవల గుట్టురట్టు అయిన చంటి పిల్లల విక్రయాల దందా మూలాలు పెందుర్తి టీడీపీ కార్యాలయంలోనే ఉన్నాయి. ముఠాలో పాత్రదారులు, కేసులో ప్రధాన నిందితులైన పులమరశెట్టి రమేష్, పెతకంశెట్టి మోహన్ ఇద్దరూ జీవీఎంసీ 96వ వార్డు టీడీపీ ప్రధాన కార్యదర్శులు కావడం గమనార్హం. జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితులైన వారిద్దరూ చంటి పిల్లలను ఎత్తుకొచ్చి అమ్మకాలు సాగించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రెండేళ్ల పాటు గుట్టుగా వ్యాపారం నగరంలోని ఆస్పత్రులు, ఏజెన్సీ నుంచి పిల్లలను ఎత్తుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్న ఈ దందా పెందుర్తి కేంద్రంగా రెండేళ్లుగా గుట్టుగా సాగుతుంది. జీవీఎంసీ 96వ వార్డులో తెలుగుదేశం పార్టీలో కార్యదర్శులుగా ఉన్న రమేష్, మోహన్ ఈ ముఠాకు ప్రధాన డాన్లు. స్థానిక జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో అన్నీతానై వ్యవహరిస్తున్న టీడీపీ మహిళా నాయకురాలు అండతో వారు ఎత్తుకొచ్చిన పిల్లలను కాలనీ ప్లాట్లలో ఉంచుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్కడి నుంచి పిల్లలు కావలిసిన వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠా సభ్యులకు టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీను అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ ముఠా పోలీసులకు దొరికిన రోజు కూడా నిందితులకు మద్దతుగా అరకు పోలీసులతో పీలా శ్రీను లాబీయింగ్ చేసేందుకు విఫలయత్నం చేసినట్లు సమాచారం. బయటకు నీతులు చెబుతూ లోపల ఇలాంటి అనైతిక వ్యాపారాలకు మద్దతుగా నిలవడంపై ప్రత్యర్థులు పీలాపై దుమ్మెత్తి పోస్తున్నారు. చదవండి: తక్కువ వడ్డీ పేరిట అదితి గోల్డ్ లోన్ సంస్థ ఘరానా మోసం! కిలోల బంగారంతో పరార్.. -
వైఎస్సార్సీపీలోకి జనసేన కార్యకర్తలు..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తన ఉనికిని దాదాపు కోల్పోయింది. ఆ పార్టీకి కాస్త పట్టుకున్న జీవీఎంసీ 79వ వార్డులో భారీ షాక్ తగిలింది. మొన్నటి జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన తరఫున కార్పొరేటర్ అభ్యర్దిగా పోటీ చేసిన కింటాడ ఈశ్వరరావు సహా దాదాపు 100 మంది వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సుజాతనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఈశ్వరరావు సహా జనసేన కార్యకర్తలకు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో తొలి నుంచి ఉన్న వారికి తగిన ప్రాధాన్యమిస్తూనే పార్టీలోకి వచ్చిన వారికి తగిన గౌరవం ఇస్తామన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసుకుంటూ ఆయా ప్రాంతాల అభివృద్ధికి నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ఈశ్వరరావుకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్ చేస్తున్న ప్రజాసేవను, అంకితభావాన్ని చూసి పార్టీలో చేరానన్నారు. పార్టీ సిద్ధాతాలకు అనుగుణంగా సేవలందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి అన్నంరెడ్డి అజయ్‌రాజ్, నాయకులు ఇల్లపు ప్రసాద్, కాసు అంజిరెడ్డి, సుండ్రపు అప్పారావు, సుండ్రపు శ్రీనివాస్, వినోద్, గొర్లె రామునాయుడు, ఎల్బీ నాయుడు, ఆదిరెడ్డి మురళి, చిన్ని, ఐడి బాబు పాల్గొన్నారు. -
జుత్తాడ దారుణం: గుండెలు పగిలేలా రోదన
ఎంవీపీకాలనీ (విశాఖతూర్పు)/డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): వి.జుత్తాడ మారణకాండ విషాద ఛాయలు శుక్రవారం శివాజీపాలేన్ని కమ్మేశాయి. అంత్యక్రియల పర్వాన్ని ప్రత్యక్షంగా చూసిన శివాజీపాలెమంతా కంటతడిపెట్టుకుంది. బాధితుడు బమ్మిడి విజయ కిరణ్ తాతయ్య చెల్లుబోయిన అప్పారావుది శివాజీపాలెం కావడంతో హత్యకు గురైన ఆరు మృతదేహాలకు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు మృతదేహాలను కేజీహెచ్ నుంచి శివాజీపాలెం తీసుకొచ్చారు. అప్పటికే పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లుసిద్ధం చేశారు. శుక్రవారం రాత్రి మహాప్రస్థానం వాహనాల్లో అప్పారావు ఇంటికి మృతదేహాలు చేరుకోగా కనీసం వాటిని కిందకు దించలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి అటే శ్మశానవాటికకు తరలించారు. అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్ పెందుర్తి: వి.జుత్తాడలో ఆరుగురిని హత్య చేసిన నిందితుడు బత్తిన అప్పలరాజు(48)కు 14 రోజుల రిమాండ్ విధించినట్లు పెందుర్తి సీఐ కె.అశోక్‌కుమార్ తెలిపారు. అప్పలరాజును శుక్రవారం సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా పూర్తి స్థాయి విచారణ చేసి రిమాండ్‌కు తరలించాలని ఆదేశించారన్నారు. కేజీహెచ్‌లో వైద్య పరీక్షల సమయంలో హత్యలు ఎందుకు చేశావని నిందితుడ్ని మీడియా ప్రశ్నించగా.. తన కన్న కూతుర్ని లైంగికంగా వేధించడంతో ఈ హత్యలు చేశానని బదులిచ్చాడు. చదవండి: ఆరుగురి దారుణ హత్య వెనుక కారణాలివేనా?! -
ఆరుగురి దారుణ హత్య వెనుక కారణాలివేనా?!
ఆ చిన్నారులను చూస్తే.. ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది. కాసేపు ఎత్తుకొని లాలించాలనిపిస్తుంది. కానీ అప్పలరాజు మాత్రం అత్యంత కిరాతకంగా మారిపోయాడు. పాతకక్షలు అతనిలో మానవత్వాన్ని చంపేశాయి. క్షణికావేశం అతడిని రాక్షసుడిగా మార్చేసింది. ఏం చేస్తున్నాడో విచక్షణ కోల్పోయి.. తల్లిచెంతనే నిద్రపోతున్న చిన్నారులను కిరాతకంగా హతమార్చాడు. ఆ పసికందులు ఎందుకు చనిపోతున్నామో తెలీకుండానే శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. అభం శుభం తెలియని ఆరు నెలల చిన్నారి రిషిత పైనా తన కర్కశత్వాన్ని ప్రదర్శించి.. శరీరాన్ని ముక్కలు చేసేసిన హృదయవిదారక దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించే సమయంలో అల్లారుముద్దుగా పెంచిన ఇద్దరు చిన్నారుల మృతదేహాల్ని తండ్రి విజయ్ స్వయంగా మోసుకుంటూ విలపిస్తూ... అంబులెన్స్‌లో ఎక్కించడంతో జుత్తాడ కన్నీటిసంద్రంలో మునిగిపోయింది. సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి : పాత కక్షలతో రగిలిపోతున్న ఓ మనిషి మృగమయ్యాడు.. అదునుకోసం ఎదురుచూసి పగతో కత్తి దూశాడు.. పదిహేను నిమిషాల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ఆరు నిండుప్రాణాలు బలి తీసుకుని మారణహోమం సృష్టించాడు. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులనూ కిరాతకంగా చిదిమేశాడు. గురువారం వేకువజామున నగర శివారు పెందుర్తి మండలం వి.జుత్తాడలో ఈ ఘోరం చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన బత్తిన అప్పలరాజు అనే నరహంతకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన ఇంటిలో ఎటు చూసినా రక్తపు మడుగులే కనిపిస్తున్నాయి. ప్రతీ గోడ రక్తపు మరకలతో నిండిపోయింది. ఈ ఊచకోతలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడితో సహా ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులను అత్యంత ఘోరంగా నరికి చంపడం చూసి ప్రతీ హృదయం కన్నీటి పర్యంతమైంది. రక్తపు మడుగుల్లో పడి ఉన్న మృతదేహాలను చూసి ప్రతీ గుండె విలపించింది. వివాహేతర సంబంధంతో ఐదేళ్ల కిందట ప్రారంభమైన గొడవలే ఈ హత్యలకు దారి తీశాయని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. మరో రెండు రోజుల్లో పెళ్లి సందడి మొదలవ్వాల్సిన ఇంట మరణ మృదంగం మోగడంతో వి.జుత్తాడలో విషాదం నెలకొంది. విషాద వార్త తెలుసుకొని విజయవాడలో నివసిస్తున్న చిన్నారుల తండ్రి విజయ్ రాకతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హంతకుడిని అత్యంత కఠినంగా శిక్షించాలని స్థానికులు ముక్తకంఠంతో నినదించారు. ఎటు చూసినా రక్తపు జాడలే జుత్తాడ గ్రామంలో నిందితుడు బత్తిన అప్పలరాజు చేసిన నరమేధంతో ఎటు చూసినా రక్తపు జాడలే కనిపిస్తున్నాయి. గ్రామంలో ఉంటున్న అప్పలరాజు కుమార్తెకు అదే గ్రామంలో నివాసం ఉంటున్న బమ్మిడి విజయ్‌కిరణ్‌కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కొద్ది సంవత్సరాలుగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ కుటుంబంపై పగ పెంచుకున్న అప్పలరాజు గురువారం ఉదయం కత్తితో దాడి చేసి కుటుంబ సభ్యులను ఊచకోత కోశాడు. అప్పలరాజు చేతిలో హత్యకు గురైన బమ్మిడి రమణ (63), బమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నకెళ్ళ అరుణ(40), బమ్మిడి ఉదయ్‌నందన్(2), బమ్మిడి ఉర్విష (6 నెలలు) మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. పక్కా ప్రణాళిక ప్రకారం మాటువేసి గురువారం వేకువజామున బమ్మిడి విజయ్‌కిరణ్ కుటుంబాన్ని కత్తితో వేటాడి చంపిన అప్పలరాజు వెంటనే పోలీసులకు లొంగిపోయాడు. అయితే ఈ ఘటనలో అప్పలరాజుకు అతడి కుటుంబ సభ్యుల సహకారం ఉందని బాధితుల తరఫున బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బాధితుల ఆరోపణల నేపథ్యంలో మరో ముగ్గురిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఘటనాస్థలిని సీపీ మనీష్‌కుమార్ సిన్హా సందర్శించి ప్రాథమిక విచారణ చేపట్టారు. నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని మీడియాతో మా ట్లాడుతూ వెల్లడించారు. ఏసీపీ శ్రీపాదరావు ఆధ్వర్యంలో సీఐలు కె.అశోక్‌కుమార్, రమణయ్య, రామారావు, ఎస్ఐలు శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఆస్తి తగాదాల కోణంలోనూ.. ఆరు హత్యలకు వివాహేతర సంబంధం ఒక కారణం కాగా.. స్థానికుల సమాచారం ప్రకారం ఆస్తి తగాదాలూ ఇంకో కారణమని తెలుస్తోంది. పోలీసులు సైతం ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ ఇంటి పక్కన ఉన్న స్థలం హంతకుడు అప్పలరాజుకు చెందినది కాగా.. ఎదురుగా ఉన్న ఇల్లు అప్పలరాజు సోదరుడికి చెందినది. మధ్యలో విజయ్ ఇల్లు ఉండటంతో దాన్ని అమ్మేయాలని పలుమార్లు అడిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినా దాన్ని అమ్మేందుకు విజయ్ తండ్రి రమణ నిరాకరించడం, దానికి తోడు వివాహేతర సంబంధం బయటపడటం.. అప్పలరాజులో పగని పెంచింది. దాని వల్లే ఈ మారణహోమానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మార్చురీకి మృతదేహాలు డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): జుత్తాడలో హత్యకు గురైన బమ్మిడి రమణ, అల్లు రమాదేవి, బమ్మిడి ఉషారాణి, ఉదయనందన్, రిషిత, నక్కెళ్ల అరుణ మృతదేహాలు సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మరోవైపు మధురవాడలో అనుమానాస్పదంగా అగ్నికి ఆహుతైన సుంకర బంగారునాయడు, నిర్మల, దీపక్, కశ్యప్ మృతదేహాలు కూడా గురువారం రాత్రికి కేజీహెచ్ మార్చురీకి తరలించారు. అమ్మ పుట్టిందన్న ఆనందం ఆరు నెలలకే... కాంట్రాక్టర్ విజయ్‌కిరణ్‌కు తల్లి ఆదిలక్ష్మి అంటే చాలా ఇష్టం. అమ్మ చనిపోయిన తర్వాత కుంగిపోయిన విజయ్.. తన బిడ్డగా అమ్మ పుడుతుందని భావించాడు. మొదటి, రెండో సంతానంగా కుమారులు పుట్టారు. కుటుంబ సభ్యులు భార్యకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించాలని చెప్పినా.. అమ్మ కచ్చితంగా పుడుతుందని విజయ్ నిరాకరించాడు. పూజలు, మాలధారణ చేసి మొక్కుకున్నాడు. చివరికి పూజలు ఫలించి ఆరు నెలల క్రితం చిన్నారి పుట్టింది. ఇంతలో ఘోరం జరిగిపోయింది. అమ్మ పుట్టిందన్న ఆనందం ఆరు నెలలకే ఆవిరి చేసేశాడంటూ విజయ్ విలపించిన తీరు గ్రామస్తుల్ని కంటతడి పెట్టించింది. పావుగంటలోనే పొట్టనపెట్టుకున్నాడు కేవలం పావు గంటలోనే నాలుగేళ్ల పగని తీర్చుకున్నాడు నర హంతకుడు అప్పలరాజు. ఉదయం 5 గంటల నుంచి ఆయుధంతో వేచి ఉన్న హంతకుడు అప్పలరాజు... 5.30 గంటలకు రమాదేవి తలుపు తీసిన వెంటనే.. హత్యాకాండ మొదలు పెట్టాడు. పిల్లా.. పెద్దా అనే తేడా లేకుండా విచక్షణ కోల్పోయి సైకోలా మారిపోయాడు. గేటు దగ్గర మొదలుపెట్టి.. వంటగది వరకూ సాగిన మారణహోమం పావుగంటలో ముగిసిపోయి.. ఆరుగుర్ని విగతజీవులుగా మార్చేసింది. 5.45 గంటలకు బయటికి వచ్చిన కిరాతకుడు.. అరగంట పాటు రమాదేవి మృతదేహం పక్కనే కూర్చొని 6.15 కి 100 నంబర్‌కు డయల్ చేశాడు. 100 నుంచి 108కి ఫోన్ వెళ్లగా.. హుటాహుటిన అక్కడికి వెళ్లిన 108 సిబ్బంది వెళ్లే సరికి.. అటు ఇటూ తిరుగుతూ ఎవరొస్తారో రండి అంటూ హంతకుడు కత్తితో అటు ఇటు పచార్లు చేస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాం ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ద్వారా సమాచారం అందుకున్న రాజ్యసభ సభ్యుడు వి.విజయ్‌సాయిరెడ్డి బాధితుడు విజయ్‌కిరణ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఓదార్చి ధైర్యం చెప్పారు. జరిగిన ఘటనను సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, పూర్తిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలకు ఘనంగా నివాళి అర్పించి జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. విజయ్ను ఓదార్చారు. ప్రభుత్వం తరపున సహకరిస్తామని చెప్పారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, మేయర్ గొలగాని హరివెంకటకుమారి భర్త గొలగాని శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లా యాదవ సంఘాల ప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరుగు పొరుగు వారికి వినిపించలేదా..? పల్లెల్లో వేకుకజామున 5 గంటలకే సందడి మొదలవుతుంది. కానీ గ్రామం నడిబొడ్డున జరిగిన మృత్యుఘోష ఎవరికీ వినపడలేదా అనే అనుమానాలు అందరిలోనే వ్యక్తమవుతున్నాయి. విజయ్ ఇంటి పక్కనే హంతకుడి సోదరుడి కుటుంబం నివశిస్తోంది. చుట్టుపక్కల ఇళ్లల్లో జనం ఉన్నా ఎవరికీ హాహాకారాలు వినిపించలేదా అనేది ప్రశ్నగా మారింది. హంతకుడు 5 గంటల నుంచి ఆయుధంతో మాటు వేసినా ఎవరూ గుర్తించలేదా.? హత్యలు చేసి అరగంట ఆరుబయట కూర్చున్నా ఎవరూ పట్టించుకోలేదా.? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పక్కనే ఉన్న సోదరుడి కుటుంబం ఆ సమయంలో ఏం చేస్తున్నారనే కోణంలో విచారణ చేపడుతున్నారు. చదవండి: విశాఖలో నరమేధం -
విశాఖపట్నం: మంటలు చెలరేగి కారు దగ్ధం
-
నడిరోడ్డుపై ఇండిగో కారు దగ్ధం..
సాక్షి, విశాఖపట్నం : పెందుర్తిలో సోమవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపం సమీపంలోని పెట్రోల్ బంక్ కూడలి వద్ద కారులో అనూహ్యంగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎయిర్ పోర్ట్ నుండి సింహాచలం వైపు వెళ్తున్న టాటా ఇండిగో కారు మంటలతో పూర్తిగా పూర్తిగా దగ్ధమైంది. కారులో మంటలు చూసి డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదం సమయంలో డ్రైవర్ తో పాటు కారులో నలుగురు ప్యాసింజర్లు ప్రయాణిస్తున్నారు. అయితే వారెవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
శ్రీకాంత్‌కు మంత్రి అవంతి పరామర్శ
సాక్షి, విశాఖ : శిరోముండనం బాధితుడు శ్రీకాంత్‌ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆదివారం పరామర్శించారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దళితులపై దాడులను ప్రభుత్వం సహించదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఘటన జరిగిన తీరుతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా శ్రీకాంత్ కు బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు. (చదవండి: తలబిరుసు.. లెక్కలేనితనం..) సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన లో దళితులు, బలహీన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీకాంత్‌కు లక్ష రూపాయల నగదు, సొంత ఇల్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఉన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తన సొంత నగదు రూ.50 వేలను శ్రీకాంత్‌కు అందజేశారు. ఈ ఘటనలో ఇప్పటికే నిందితులు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారని మంత్రి అవంతి తెలిపారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న నూతన్ నాయుడు భార్య మధు ప్రియతో పాటు మిగతా వారికి న్యాయస్థానం రెండువారాలు రిమాండ్ విధించింది. -
అనారోగ్యం నాటకమాడిన మధుప్రియ
సాక్షి, విశాఖపట్నం: శిరోముండనం కేసులో నిందితులకు న్యాయస్థానం రెండు వారాలు రిమాండ్ విధించింది. దీంతో నూతన్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిని పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితులను విచారించేందుకు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు శిరోముండనం వ్యవహారంలో నూతన్ నాయుడు ప్రమేయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక జ్యుడీషియల్ రిమాండ్ నుంచి తప్పించుకునేందుకు మధుప్రియ అనారోగ్యం అంటూ నాటకం ఆడారు. అయితే కేజీహెచ్ వైద్య పరీక్షల్లో ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్ నాయుడు భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన శుక్రవారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: దళిత యువకుడికి శిరోముండనం) చదవండి: (కర్రలు విరిగేటట్లు కొట్టి.. వీడియో తీశారు) -
శిరోముండనం కేసులో నిందితులకు 2 వారాల రిమాండ్
-
సీసీ టీవీ ఫుటేజ్‌లో గుండు చేసిన దృశ్యాలు
-
నూతన్ నాయుడు భార్యపై కేసు నమోదు
-
నూతన్ నాయుడు భార్యపై కేసు నమోదు
సాక్షి, విశాఖ : దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నూతన్ నాయుడు భార్యతో పాటు మిగతావారిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ విభాగం ఏసీపీ త్రినాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేపట్టాయి. (నూతన్ నాయుడు ఇంట్లో నిర్వాకం) కాగా విశాఖ నగర శివారులో బిగ్‌బాస్ కంటెస్టెంట్, జనసేన నాయకుడు నూతన్ నాయుడు ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చెప్పకుండా పని మానేశాడన్న కోపంతో కర్రి శ్రీకాంత్ అనే యువకుడిపై ఈ దారుణానికి పాల్పడ్డారు. నిన్నమధ్యాహ్నం (శుక్రవారం) రెండు గంటల సమయంలో ఇంట్లో మొబైల్ ఫోన్ పోయిందని శ్రీకాంత్‌ను పిలిపించి నూతన్ నాయుడు కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాడిచేసి కొట్టడమే కాకుండా జుట్టు తొలగించేశారు. దీంతో అతను తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో A1గా ఉన్న నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఇంట్లో సహాయకులుగా ఉన్న వరహాలు, ఇందిర, ఝూన్సీ, సౌజన్య, బాలు, రవిపై సెక్షన్ 307...342..324..323..506 r/w34ipc 3(1) b ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
నూతన్ కుమార్ నాయుడు ఇంట్లో నిర్వాకం
-
నూతన్ నాయుడు ఇంట్లో నిర్వాకం
పెందుర్తి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమాని, పరాన్నజీవి దర్శకుడు నూతన్ కుమార్ నాయుడు ఇంట్లో ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగింది. తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌కుమార్ నాయుడు భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తనకు జరిగిన అవమానంపై బాధితుడు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ► విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో గిరిప్రసాద్‌నగర్‌లోని నూతన్‌కుమార్ నాయుడు ఇంట్లో కర్రి శ్రీకాంత్ అనే యువకుడు నాలుగు నెలల క్రితం పనికి చేరాడు. వ్యక్తిగత కారణాలతో ఆగస్టులో పని మానేశాడు. అయితే శుక్రవారం శ్రీకాంత్‌కు నూతన్‌కుమార్ భార్య మధుప్రియ ఫోన్ చేసి ‘నువ్ సెల్‌ఫోన్ తీశావు.. ఇంటికిరా మాట్లాడాలి’ అని పిలిచింది. ► అక్కడకు వెళ్లిన శ్రీకాంత్‌ను నిర్బంధించి అతడిపై తప్పుడు ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సెలూన్ నిర్వాహకుడు రవిని పిలిపించి మధుప్రియ సమక్షంలో శ్రీకాంత్‌కు శిరోముండనం చేయించారు. ► తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్ పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెస్ట్ ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ విభాగం ఏసీపీ త్రినా«థ్ పెందుర్తి పీఎస్‌కు చేరుకుని బాధితుడితో మాట్లాడారు. అతడి వాంగ్మూలం మేరకు నిందితురాలు మధుప్రియ సహా నలుగురిని జరిగిన ఘటనపై విచారిస్తున్నారు. ► ఈ ఘటనలో నూతన్‌కుమార్‌నాయుడు పాత్రపై లోతుగా విచారణ చేస్తున్నారు. కాగా నూతన్ కుమార్ నాయుడు జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పెందుర్తి ఎమ్మెల్యేగా 2014లో పోటీ చేశారు. గతేడాది ఓ చానల్లో ప్రసారమైన బిగ్‌బాస్ షోలో పాత్రధారి. ఇటీవల విడుదలైన పరాన్నజీవి చిత్రానికి దర్శకుడు. విశాఖ నగర మాజీ మేయర్, ప్రస్తుత టీడీపీ నేతకు వ్యాపార భాగస్వామి అని సమాచారం. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు సన్నిహితుడు, వీరాభిమాని. ► ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు సాగుతోందని విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. ఘటనను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ చెప్పారు. తననేమైనా చేస్తారని భయంగా ఉందని, ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితుడు కర్రి శ్రీకాంత్‌కోరాడు. -
కారు చీకట్లో.. కనుమరుగైన కనుపాప
పెందుర్తి: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డకు గుక్కెడు పాలు ఇవ్వలేని దుస్థితి ఆ తల్లిది. ఇంట్లో పెద్దోళ్లతో పంతానికి వెళ్లి పొత్తిళ్లలోని చిన్నారిని చంపుకున్న శాపం ఆమెది. ఎత్తుకుని లాలించి.. పాలిచ్చి పెంచిన చేతులతోనే గొయ్యి తీసి పూడ్చిపెట్టిన కన్నీటి గాథ ఆ కన్నతల్లిది. అత్తమామలతో గొడవ పడి అర్ధరాత్రి ముక్కుపచ్చలారని చిన్నారితో గడప దాటి తిరిగి ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన దురవస్థ ఆమెది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పులగాలిపాలెంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి కరక అప్పారావు, కుసుమలత దంపతులకు సోనిక, జ్ఞానస(ఏడాదిన్నర) ఇద్దరు కుమార్తెలు. ఈ నెల 6న అప్పారావు విధులకు వెళ్లిపోయాడు. అయితే ఆ రోజు రాత్రి కుసుమలతకు అత్తమామలు అప్పలకొండ, నూకాలుకు ఇంట్లో గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుసుమలత అదే రోజు అర్ధరాత్రి దాటాక ఇంట్లో నుంచి చిన్న కుమార్తె జ్ఞానసను తీసుకుని బయటకు వెళ్లిపోయింది. అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్లాలో తెలియని కుసుమలత చినముషిడివాడ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడే ఉన్న కొండ ఎక్కింది. అక్కడే నాలుగు రోజుల పాటు రేయింబవళ్లు ఉండి ఈ నెల 10న కిందకి ఒంటరిగా వచ్చింది (అప్పటికే కుసుమలత పుట్టింటివారు ఆమె కనిపించలేదంటూ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు). కొండ సమీపంలో నివాసం ఉంటున్న వారి వద్దకు వెళ్లి ఆకలేస్తోందని చెప్పడంతో వారు భోజనం పెట్టారు. కుసుమలత పరిస్థితి చూసినవారు ఏం జరిగిందని ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. ‘పాప ఆకలికి చనిపోయింది. నేనే కొండ మీద పూడ్చిపెట్టాను’ అని చెప్పడంతో కంగారు పడ్డ స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలంలో విలపిస్తున్న జ్ఞానస తండ్రి అప్పారావు అంతా అయోమయం.. అనుమానాస్పదం.. అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన కుసుమలత నేరుగా కొండ ప్రాంతానికి వెళ్లడం మిస్టరీగా మారింది. అంతేకాకుండా ఆమె ఫోన్లో ‘ఆహారం లేకుండా ఎన్ని రోజులు ఉండగలం’ అని గూగూల్ సెర్చ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఆమె కొండ ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఎంత పంతం ఉన్నా.. చంటిపాప విషయంలో కన్నతల్లి అంత కఠినంగా ఉందా అన్నది మరో ప్రశ్న. అదే సమయంలో ఇంట్లో అత్తమామలతో గొడవ పడిన సందర్భం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని వారు ఏదైనా అన్నారా? ఆ కోపంలో చిన్నారిని ఆమె ఏదైనా చేసిందా అన్నది సందేహంగా మారింది. అయితే ఇంత జరిగినా కుసుమలత నోరు విప్పడం లేదు. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పకపోవడంతో పోలీసులకు ఎటూ పాలుపోవడం లేదు. జ్ఞానస పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే ఇందులో పురోగతి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అత్తమామలతో పెద్ద స్థాయిలో గొడవలు లేవని తెలుస్తోంది. అసలు ఆమె అలా ఎందుకు చేసిందో ఏమాత్రం అర్థం కావడం లేదని భర్త వాపోతున్నారు. రైల్వే ఉద్యోగం కావడంతో రెండు మూడు రోజులు బయటకు వెళ్తుంటానని, ఎప్పుడూ ఇలా జరగలేదని అతను చెబుతున్నారు. క్విక్ రియాక్షన్ బృందాల సహకారంతో.. జ్ఞానస చనిపోయిందని కుసుమలత చెప్పడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆమెను వెంటబెట్టుకుని కొండ ప్రాంతం అంతా గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం ఉదయం క్విక్ రియాక్షన్ టీమ్ బృందాలు డాగ్ స్క్వాడ్ సహా రంగంలోకి దిగాయి. ఎట్టకేలకు చిన్నారిని పూడ్చిన ప్రదేశాన్ని కనుగొన్నారు. జ్ఞానస మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఏసీపీ స్వరూపారాణి ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ అనుమానాస్పద ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా ప్రగతి కేంద్రంలో గ్రామ వాలంటీర్ల శిక్షణ
సాక్షి, పెందుర్తి(విశాఖపట్టణం) : రాష్ట్రంలో అవినీతిలేని పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర్ట పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. త్వరలో బాధ్యతలు తీసుకోనున్న గ్రామ వలంటీర్లు పారదర్శకంగా పని చేసి ప్రజల మన్ననలు అందుకోవాలని సూచించారు. టీవోటీలు వలంటీర్లకు ఆ దిశగా చక్కటి దిశానిర్దేశం చేయాలన్నారు. పెందుర్తి లోని డీఆర్డీఎ మహిళా ప్రగతి కేంద్రంలో శుక్రవారం గ్రామ వలంటీర్లకు శిక్షణ అందించనున్న జిల్లాస్థాయి టీవోటీలకు రెండు రోజుల శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వలంటీర్లకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. వారికి కేటాయించిన 50 కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల అవగాహన కలిగించి కుల, మత, వర్గ తేడాలు లేకుండా, రాజకీయాలకు అతీతంగా సంక్షేమపథకాలు అందేలా చూడాల్సి ఉంటుందన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గ్రామ సచివాలయానికి చేరవేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. వలంటీర్లు అవినీతికి పాల్పడితే జిల్లాస్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని అక్కడ న్యాయం జరగకపోతే స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షించే రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని దాన్ని అందరూ సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అందరం పని చేయాలని ఆకాంక్షించారు. పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. గ్రామాల అభివృద్ధిలో వలంటీర్ల పాత్ర అంత్యంత కీలకమన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. గ్రామ వలంటీర్ల శిక్షణ కరదీపిక, నవరత్న మాలిక కరదీపికను మంత్రి, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ–2 ఎం.వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈవో రమణమూర్తి, డీపీవో కృష్ణకుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తిరుపతిరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు జయప్రకాష్, డీఈవో లింగేశ్వరరెడ్డి, డీఆర్డీఎ ఇన్చార్జి పీడీ రామ్మోహనరావు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మీ సమస్యలను నేను విన్నాను..
-
మీ సమస్యలు.. నా సమస్యగా భావిస్తా: వైఎస్ జగన్
సాక్షి, పెందుర్తి (విశాఖ జిల్లా) : ‘అధికారంలోకి రాగానే మీ సమస్యలను నా సమస్యగా భావించి పరిష్కరిస్తాను’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నంరెడ్డి అదీప్ రాజ్, అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి కాండ్రేగుల సత్యవతిలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. మీ సమస్యలను నేను విన్నాను.. ‘రాష్ట్రవ్యాప్తంగా 3,648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్రను పూర్తి చేశాను. ఆ పాదయాత్రలో పెందూర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి సమస్యను మీరంతా నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యలను విన్నాను.. ఆ కష్టాలను నేను స్వయంగా చూశాను. మీ అందరికి అండగా నేనున్నానని భరోసా ఇస్తున్నాను. మంచి చేయమని ఓట్లు వేస్తే.. ఆ టీడీపీ నేతలు గద్దల్లా జిల్లాలో భూములు దోచుకున్నారు. భూ అక్రమణ కోసం దళిత మహిళపై దారుణంగా దాడి చేశారు. పంచగ్రామ సమస్యను.. నా సమస్యగా భావించి పరిష్కరిస్తా. గుడిపెద్దలతో మాట్లాడి కచ్చితంగా భూములకు పట్టాలు ఇప్పిస్తాం. కాలుష్య ప్రభావితమైన గ్రామాల్లోని ప్రజలను అధికారంలోకి రాగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆదుకుంటాం. ఎన్నికల వేళ 20 రోజులుగా జరుగుతున్న కట్రలు, మోసాలను మీరంతా చూస్తున్నారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో చూసిందేమిటి? ఎన్నికల ముందు ఆయన చెప్పిందేమిటి? ఆ తరువాత చేసిందేమిటి? ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నా. చంద్రబాబు పాలనలో చేసిందేమిటంటే మోసం.. మోసం.. ఆయన పాలనపై చర్చ జరగకూడదని రోజుకో కుట్రకు తెరలేపుతున్నారు. ఈ కుట్రలు, మోసాలు గమనించాలని కోరుతున్నా. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం.. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో మన పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ 9 అమ్ముడుపోయిన చానెళ్లన్నిటీతో చేయాలి. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి వివరించండి. ప్రస్తుతం మన పిల్లలు ఇంజనీరింగ్ చదివే పరిస్థితుల్లో ఉన్నారా? అని ప్రతి అక్కను అడగండి. అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం.. అప్పుడు మన పిల్లలను ఇంజనీరింగే కాదు.. డాక్టర్, కలెక్టర్ చదువులకు ఎంత ఖర్చైనా అన్న భరిస్తాడని చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. నాలుగు దఫాల్లో నేరుగా అందజేస్తామని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్ మీ మనవడు ఇస్తాడని, రాజన్న రాజ్యాన్ని జగన్ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్ జగన్ కోరారు. -
‘బలమైన నాయకుడు సీఎం కావాలి’
పెందుర్తి: పవిత్ర నాగులచవితి నాడు భగవంతుడు తనకు శరీరాన్ని ప్రసాదించడం.. శారదా పీఠానికి పీఠాధిపతిగా నియమించడం తన పూర్వజన్మ సుకృతమని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. స్వామి జన్మదినం సందర్భంగా ఆదివారం విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠంలో పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి అనుగ్రహ భాషణం చేశారు. రాష్ట్రానికి ప్రజలు మెచ్చే బలమైన నాయకుడు ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరముందన్నారు. పాశ్చాత్య పోకడలను అలవాటు చేసుకుంటే అనర్థాలే తప్ప మంచి జరగదని హెచ్చరించారు. భక్తులకు మానవసేవ గురించి వివరించాలన్న తలంపుతోనే.. వారి కోరిక మేరకు ఈ వేడుకలకు ఒప్పుకున్నానని వెల్లడించారు. నాగులచవితి ఎంతో విశిష్టత కలిగిన పర్వదినమన్నారు. పీఠం తరపున తెలుగు రాష్ట్రాలు, దేశానికి ఉపద్రవాలు సంభవించకుండా పరమాత్ముడిని పూజిస్తూ అనేక యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడం లో శారదా పీఠం ముందుందన్నారు. వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి వారికి స్వరూపానందేంద్ర స్వామి చేతుల మీదుగా విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రతినిధి ద్వా రా స్వామికి పట్టువస్త్రాలు, ఫలాలందించా రు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పూజల్లో పాల్గొని ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం గురించి స్వామి బొత్సను ఆరా తీశారు. -
పెందుర్తిలో కార్మికుల సొసైటీ పేరిట అక్రమ తవ్వకాలు
-
వెంకన్నకు ప్రత్యేక పూజలు
పెందుర్తి : స్థానిక వెంకటాద్రిపై వెలసిన వేంకటేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారి సుప్రభాతసేవ జరిపారు. అనంతరం అర్చనలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. లక్ష్మిపురంలోని శ్రీదేవి భూదేవి సహిత కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.