నిందితులు రమేష్, మోహన్
పెందుర్తి: ‘పచ్చ’చొక్కాలు వేసుకుని రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని డాబు చేయడం వారి సాధారణ కోణం.. ఆస్పత్రుల నుంచి పసి పిల్లలను దొంగ చాటున ఎత్తుకొచ్చి నడిబజారులో విక్రయించడం వారి చీకటి కోణం. ఇటీవల గుట్టురట్టు అయిన చంటి పిల్లల విక్రయాల దందా మూలాలు పెందుర్తి టీడీపీ కార్యాలయంలోనే ఉన్నాయి. ముఠాలో పాత్రదారులు, కేసులో ప్రధాన నిందితులైన పులమరశెట్టి రమేష్, పెతకంశెట్టి మోహన్ ఇద్దరూ జీవీఎంసీ 96వ వార్డు టీడీపీ ప్రధాన కార్యదర్శులు కావడం గమనార్హం. జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితులైన వారిద్దరూ చంటి పిల్లలను ఎత్తుకొచ్చి అమ్మకాలు సాగించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
రెండేళ్ల పాటు గుట్టుగా వ్యాపారం
నగరంలోని ఆస్పత్రులు, ఏజెన్సీ నుంచి పిల్లలను ఎత్తుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్న ఈ దందా పెందుర్తి కేంద్రంగా రెండేళ్లుగా గుట్టుగా సాగుతుంది. జీవీఎంసీ 96వ వార్డులో తెలుగుదేశం పార్టీలో కార్యదర్శులుగా ఉన్న రమేష్, మోహన్ ఈ ముఠాకు ప్రధాన డాన్‌లు. స్థానిక జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో అన్నీతానై వ్యవహరిస్తున్న టీడీపీ మహిళా నాయకురాలు అండతో వారు ఎత్తుకొచ్చిన పిల్లలను కాలనీ ప్లాట్లలో ఉంచుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్కడి నుంచి పిల్లలు కావలిసిన వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠా సభ్యులకు టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీను అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ ముఠా పోలీసులకు దొరికిన రోజు కూడా నిందితులకు మద్దతుగా అరకు పోలీసులతో పీలా శ్రీను లాబీయింగ్ చేసేందుకు విఫలయత్నం చేసినట్లు సమాచారం. బయటకు నీతులు చెబుతూ లోపల ఇలాంటి అనైతిక వ్యాపారాలకు మద్దతుగా నిలవడంపై ప్రత్యర్థులు పీలాపై దుమ్మెత్తి పోస్తున్నారు.
చదవండి: తక్కువ వడ్డీ పేరిట అదితి గోల్డ్ లోన్ సంస్థ ఘరానా మోసం! కిలోల బంగారంతో పరార్..
Comments
Please login to add a commentAdd a comment