‘అధికారంలోకి రాగానే మీ సమస్యలను నా సమస్యగా భావించి పరిష్కరిస్తాను’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు.