
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తన ఉనికిని దాదాపు కోల్పోయింది. ఆ పార్టీకి కాస్త పట్టుకున్న జీవీఎంసీ 79వ వార్డులో భారీ షాక్ తగిలింది. మొన్నటి జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన తరఫున కార్పొరేటర్ అభ్యర్దిగా పోటీ చేసిన కింటాడ ఈశ్వరరావు సహా దాదాపు 100 మంది వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సుజాతనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఈశ్వరరావు సహా జనసేన కార్యకర్తలకు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో తొలి నుంచి ఉన్న వారికి తగిన ప్రాధాన్యమిస్తూనే పార్టీలోకి వచ్చిన వారికి తగిన గౌరవం ఇస్తామన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసుకుంటూ ఆయా ప్రాంతాల అభివృద్ధికి నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ఈశ్వరరావుకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు.
ఈశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్ చేస్తున్న ప్రజాసేవను, అంకితభావాన్ని చూసి పార్టీలో చేరానన్నారు. పార్టీ సిద్ధాతాలకు అనుగుణంగా సేవలందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నంరెడ్డి అజయ్‌రాజ్, నాయకులు ఇల్లపు ప్రసాద్, కాసు అంజిరెడ్డి, సుండ్రపు అప్పారావు, సుండ్రపు శ్రీనివాస్, వినోద్, గొర్లె రామునాయుడు, ఎల్బీ నాయుడు, ఆదిరెడ్డి మురళి, చిన్ని, ఐడి బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment