స్వామీజీకి పట్టువస్త్రాలు సమర్పించి ఆశీర్వచనం తీసుకుంటున్న సీఎం కేసీఆర్ ప్రతినిధి
పెందుర్తి: పవిత్ర నాగులచవితి నాడు భగవంతుడు తనకు శరీరాన్ని ప్రసాదించడం.. శారదా పీఠానికి పీఠాధిపతిగా నియమించడం తన పూర్వజన్మ సుకృతమని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. స్వామి జన్మదినం సందర్భంగా ఆదివారం విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠంలో పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి అనుగ్రహ భాషణం చేశారు. రాష్ట్రానికి ప్రజలు మెచ్చే బలమైన నాయకుడు ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరముందన్నారు. పాశ్చాత్య పోకడలను అలవాటు చేసుకుంటే అనర్థాలే తప్ప మంచి జరగదని హెచ్చరించారు. భక్తులకు మానవసేవ గురించి వివరించాలన్న తలంపుతోనే.. వారి కోరిక మేరకు ఈ వేడుకలకు ఒప్పుకున్నానని వెల్లడించారు. నాగులచవితి ఎంతో విశిష్టత కలిగిన పర్వదినమన్నారు.
పీఠం తరపున తెలుగు రాష్ట్రాలు, దేశానికి ఉపద్రవాలు సంభవించకుండా పరమాత్ముడిని పూజిస్తూ అనేక యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడం లో శారదా పీఠం ముందుందన్నారు. వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి వారికి స్వరూపానందేంద్ర స్వామి చేతుల మీదుగా విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రతినిధి ద్వా రా స్వామికి పట్టువస్త్రాలు, ఫలాలందించా రు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పూజల్లో పాల్గొని ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం గురించి స్వామి బొత్సను ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment