
ధ్వజస్తంభానికి మొక్కుతున్న స్వరూపానందేంద్రస్వామి
తిరుమల: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిస్వామి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఆలయం వెలుపల స్వరూపానందేంద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని త్వరగా దూరం చేయాలని స్వామిని ప్రార్ధించినట్టు చెప్పారు. ఒడిశాకు చెందిన శివం కాండెవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి, తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలను శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి చేతుల మీదుగా అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment