దర్మ ప్రచార కార్యక్రమాలపై టీటీడీ చైర్మన్‌ సమీక్ష | TTD Chairman Review On Dharma Campaigns | Sakshi
Sakshi News home page

దర్మ ప్రచార కార్యక్రమాలపై టీటీడీ చైర్మన్‌ సమీక్ష

Published Sun, Nov 8 2020 4:51 AM | Last Updated on Sun, Nov 8 2020 4:51 AM

TTD Chairman Review On Dharma Campaigns - Sakshi

స్వరూపానందేంద్రస్వామితో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈవో జవహర్‌రెడ్డి, ఏఈవో ధర్మారెడ్డి

తిరుమల: హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యక్రమాలపై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మ ప్రచార కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు పలు సూచనలు చేశారు. జిల్లా ధర్మ ప్రచార మండలి పేరుతో ఆసక్తి గల భక్తులను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో ధర్మ ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.

శారద పీఠాధిపతిని కలిసిన వైవీ సుబ్బారెడ్డి
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, ఏఈవో ఏవీ ధర్మారెడ్డిలు శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. గోగర్భం సమీపంలోని శారద పీఠానికి చేరుకుని స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు.

నేడు డయల్‌ యువర్‌ ఈవో: తిరుమలలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ఆదివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు జరుగనుంది. భక్తులు 0877–2263261 నెంబర్‌కు ఫోన్‌ చేసి సందేహాలు, సూచనలను టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డికి నేరుగా తెలుపవచ్చు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement