sharada peetham
-
అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు
-
పెద్దలని గౌరవించండంలో సీఎం జగన్ తర్వాతే ఎవరైనా
-
రాజశ్యామల అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్
-
విశాఖ శారదాపీఠంలో గోపూజ
-
విశాఖ శారదాపీఠంలో గోపూజ
విశాఖపట్టణం: విశాఖ శ్రీ శారదాపీఠంలో కనుమ వేడుకలు జరిగాయి. పీఠం ప్రాంగణంలోని గోశాలలో గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు స్వయంగా గోపూజ చేసారు. గోమాతకు హారతులిచ్చి పండ్లు, అరిసెలు తినిపించారు. తెలుగు రాష్ట్రాలు పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉండేలా చూడాలని గోమాతను ప్రార్ధించారు. -
స్వామీజీల పీఠాలకు భూములు ఇస్తే తప్పేంటి?: మంత్రి వెల్లంపల్లి
అమరావతి: శారదా పీఠంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధర్మాన్ని కాపాడే పీఠం అడిగినప్పుడు స్థలం ఇవ్వడంలో తప్పేంటని టీడీపీ నేతలను ప్రశ్నించారు. గతంలో వైఎస్సార్, చంద్రబాబు ప్రభుత్వాలలో కూడా భూములు ఇచ్చారని గుర్తు చేశారు. కొన్నెళ్ల క్రితం చిన్నజీయర్ సంస్థ కి భూములు కేటాయించాం.. ఇప్పుడు శారదా పీఠంతో పాటు గణపతి సచ్చిదానంద స్వామి ట్రస్ట్ కి కూడా ఇస్తున్నామని తెలిపారు. కాగా, చంద్రబాబు హయాంలో మాత్రం.. రాయపాటి, నారా లోకేష్ లకు అప్పనంగా భూములు ఇచ్చారని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్మం కాపాడే పీఠానికి భూములు ఇస్తుంటే టీడీపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి మీడియా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోందని అన్నారు. ఇలానే వ్యవహరిస్తే హిందువులు ఆంధ్రజ్యోతి ని బహిష్కరిస్తారని మంత్రి వెల్లంపల్లి అన్నారు. చదవండి: అమిత్ షాను కలిసిన ఎంపీ గోరంట్ల మాధవ్ -
43 గుళ్లను కూల్చేసిన ఘనుడు చంద్రబాబు
విజయవాడ: శారదాపీఠంపై చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరమని ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ వైస్ చైర్మన్ ద్రోణంరాజు రవి తెలిపారు. స్వామిజీలను విమర్శించడం చంద్రబాబుకు తగదని చెప్పారు. 43 దేవాలయాలను కూల్చేసిన చంద్రబాబుకు స్వామిజీల గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి 29 మంది భక్తులు పుష్కరాల్లో బలైపోయారని గుర్తుచేశారు. విజయవాడలో మంగళవారం ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. అహంకారం పూర్తిగా దిగే రోజులు ఇంకా ముందున్నాయని ద్రోణంరాజు రవి పేర్కొన్నారు. ప్రతిఒక్కదానికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అమ్మవారి రూపాన్నే మార్చేసి క్షుద్రపూజలు చేసిన ఘనుడు చంద్రబాబు అని తెలిపారు. ఎక్కడో పుట్టిన బాబాకు 400 ఎకరాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుది అని ఆరోపించారు. మానస ట్రస్ట్, సింహాచలం భూ కుంభకోణాలను వెలికితీస్తామని తెలిపారు. చంద్రబాబు తన తీరు మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని ద్రోణంరాజు రవి స్పష్టం చేశారు. -
ఆదిశంకరుని అడుగుజాడలే స్ఫూర్తి
పెందుర్తి: వేదపరిరక్షణ, హైందవధర్మ రక్షణ ధ్యేయంగా శారదాపీఠం ముందుకు సాగుతోందని శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. ఆదిశంకరుని అడుగుజాడలే తమకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీశారదాపీఠంలో బుధవారం స్వామి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నాగులచవితి పర్వదినం రోజున జరిగే ఈ వేడుకలో భాగంగా స్వామి.. పీఠ ఆస్థానదేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి, సుబ్రహ్మణ్యస్వామికి, దాసాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద మంత్రాలు ప్రతిధ్వనిస్తుండగా ఆయనకు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పాదపూజ చేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర అనుగ్రహభాషణ చేస్తూ.. మతం కోసం ఏ ఒక్కరూ నోరు మెదపని రోజుల్లోనే తాను నిర్భయంగా మాట్లాడానని చెప్పారు. హిందూమతాన్ని ఉద్ధరించే వారిలో బ్రాహ్మణజాతి తర్వాతే ఎవరైనా ఉంటారన్నారు. కాషాయం జెండా పట్టుకున్నంత మాత్రాన మతం నిలబడదని చెప్పారు. ఇప్పుడైతే హిందూమతం కోసం ఎంతోమంది పోరాటం చేస్తున్నారన్నారు. భారతదేశపు మూలాల నుంచి అద్వైత సిద్ధాంతాన్ని వెలికి తీసింది ఆదిశంకరాచార్యులేనని.. ఆయన ఆలోచనలు తలచుకుంటూ పురుడుపోసుకున్నదే విశాఖ శ్రీశారదాపీఠమని చెప్పారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉపాసనతో అభివృద్ధి సాధించిందని, రాజశ్యామల అమ్మవారి ఆరాధనతో ప్రఖ్యాతి చెందిందని తెలిపారు. తమ పీఠంలో ఆత్మజ్ఞానం గురించి నిరంతరం చర్చ జరుగుతుంటుందని చెప్పారు. స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ గురువులు సూర్యచంద్రులతో సమానమన్నారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువులను విస్మరిస్తే ముప్పు తప్పదని చెప్పారు. శారదాపీఠం విలక్షణమైనదని, యావత్ భారతం పీఠం వైపు చూస్తోందంటే అది గురువుల కృప మాత్రమే అని పేర్కొన్నారు. వేదసభలో వివిధ శాఖలకు చెందిన వందలాదిమంది పండితులు పాల్గొన్నారు. స్వామి చేతుల మీదుగా మూడువేల మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు. మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చెల్లుబోయిన, ఎంపీలు డాక్టర్ బి.సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్సీలు చైతన్యరాజు, దాడి వీరభద్రరావు, భక్తులు స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. స్వరూపానందేంద్ర స్వామికి సీఎం శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూ పానందేంద్ర స్వామి పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం సీఎం స్వరూపానందేంద్ర స్వామికి ఫోన్ చేసి మాట్లాడారు. -
శ్రీవారిని దర్శించుకున్న స్వరూపానందేంద్రస్వామి
తిరుమల: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిస్వామి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల స్వరూపానందేంద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని త్వరగా దూరం చేయాలని స్వామిని ప్రార్ధించినట్టు చెప్పారు. ఒడిశాకు చెందిన శివం కాండెవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి, తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలను శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి చేతుల మీదుగా అందచేశారు. -
జనతా కర్ఫ్యూ: పెట్రోల్ బంక్‌లు బంద్
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకి ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ (ఏపీఎఫ్పీటీ) మద్దతు ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఆదివారం ఉదయం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించనున్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3 వేల పెట్రోల్ బంకులను మూసి వేస్తూ సిబ్బందికి సెలవులు ప్రకటించినట్లు ఏపీఎఫ్పీటీ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వ వాహనాలు, అంబులెన్స్‌ల కోసం ప్రతి పెట్రోల్ బంక్‌లో ఒకరిద్దరు సిబ్బందిని ఉంచుతున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 5 వరకు ఎల్ఎల్ఆర్ పరీక్షలు రద్దు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవాణా శాఖ ఏప్రిల్ 5వ తేదీ వరకు లెర్నింగ్ లైసెన్సు పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 5 తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి రద్దు నిర్ణయాన్ని పొడిగించాలా? లేదా? అన్నది పరిశీలిస్తామన్నారు. కార్యాలయాలకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఉద్యోగులు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతుంటే సెలవు తీసుకుని చికిత్స కోసం వెళ్లాలని స్పష్టం చేశారు. 31 వరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ బంద్ విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కోవిడ్–19 నివారణ చర్యల్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఈనెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. అన్ని విభాగాల కార్యకలాపాలు రద్దు చేశామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితిలో ఉద్యోగులు ఎప్పుడంటే అప్పుడు యూనివర్సిటీకి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలోని ఏపీ మెడికల్ కౌన్సిల్‌కు సెలవులు ప్రకటించే విషయంలో శుక్రవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు రిజిస్ట్రేషన్, సమాచారం కోసం వస్తుండడంతో మెడికల్ కౌన్సిల్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ మూల్యాంకనం వాయిదా సాక్షి, అమరావతి: కోవిడ్–19 వైరస్ నేపథ్యంలో ఇంటర్మీడియెట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఆ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. స్పాట్ వాల్యుయేషన్ తేదీలను తరువాత వెల్లడిస్తామన్నారు. శారదాపీఠం తాత్కాలికంగా మూసివేత పెందుర్తి: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా విశాఖ జిల్లా చినముషిరివాడలోని శ్రీ శారదా పీఠాన్ని తాత్కాలికంగా మూసివేస్తు న్నట్లు ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఓ ప్రకటనలో తెలిపారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాల్లోని పీఠ పాలిత ఆలయాలు, ఆశ్రమాల్లో సర్వదర్శనాలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. -
శ్రీశారదా పీఠం వార్షికోత్సవాలకు హజరైన సీఎం వైఎస్ జగన్
-
శ్రీశారదాపీఠానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
శారదా పీఠం వార్షికోత్సవాలకు అంకురార్పణ
-
తెలుగు రాష్ట్రాల మేలు కోసమే యాగం
పెందుర్తి: తెలుగు రాష్ట్రాల మేలు కోసమే శారదాపీఠంలో యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నామని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. దేవదేవుడు శ్రీనివాసుడి ఆశీస్సులు దేశానికి ఉండాలన్న సంకల్పంతో పీఠం వార్షికోత్సవాల్లో శ్రీనివాస చతుర్వేద హవనం చేపట్టినట్లు తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల చేతుల మీదుగా అంకురార్పణ జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస చతుర్వేద హవనంతో పాటు రాజశ్యామల యాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి దంపతులు యాగానికి సంకల్పం గావించారు. టీటీడీ శ్రీ వేంకటేశ్వర వేదాధ్యయన సంస్థకు చెందిన వేద పండితులు యాగాన్ని నడిపించారు. భక్తులనుద్దేశించి స్వరూపానందేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం చేశారు. కార్యక్రమంలో ఒడిశా అసెంబ్లీ స్పీకర్ పాత్రో, రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అదీప్‌రాజ్, తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు
-
స్వాత్మానందేంద్ర స్వామి వారిని కలిసిన మంత్రి వెల్లంపల్లి
-
శారద పీఠంలో ముగింపు దశకు చేరుకున్న శరన్నవరాత్రి ఉత్సవాలు
-
శారదా పీఠానికి భూమి.. ప్రభుత్వానికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: విశాఖ శారదా పీఠానికి హైదరాబాద్ నగర శివారులో ఎకరం ధర రూపాయి చొప్పున.. 2 ఎకరాల భూమిని కేటా యించడాన్ని సవాల్ చేసిన పిల్లో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కోకాపేట సర్వే నెంబర్ 240లో శారదా పీఠానికి భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన వీరాచారి దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హెచ్ఎండీఏ ఎండీ, శారదా పీఠం ధర్మాధికారి జి.కామేశ్వరశర్మలకు నోటీసులు జారీ చేసింది. ధర్మకర్తగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఇలా భూములివ్వడం చెల్లదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. విచారణ 4 వారాలకు వాయిదా పడింది. -
శారదాపీఠం సేవలు అభినందనీయం
న్యూఢిల్లీ : టీటీడీలో మెరుగైన సేవల కోసం సూచనలు,సలహాలు అందించాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. రిషికేశ్‌లో సుబ్బారెడ్డి దంపతులు శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీతో కలిసి గంగా స్నానమాచరించారు. శారదా పీఠాధిపతి చేపట్టే చాతుర్మాస్య దీక్షలో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకు శారదా పీఠం చేపట్టిన సేవలు అభినందనీయం అని ప్రస్తుతించారు. కేంద్ర మంత్రుల్ని కలిసిన టీటీడీ ఛైర్మన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా,రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.రాష్ట్రానికి నిధులు ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కేంద్ర మంత్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. విభజన హామీలు నెరవేరేలా చూడాలని కోరారు. -
ఘనంగా సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం
-
ఘనంగా సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం
-
ఘనంగా సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం
సాక్షి, విజయవాడ/తాడేపల్లి రూరల్: కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ ముగింపు మహోత్సవం సోమవారం కన్నులపండువగా జరిగింది. విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించిన కిరణ్‌కుమార్ శర్మ (కిరణ్ బాలస్వామి)కు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. కృష్ణా నదీ తీరంలోని గణపతి స్వచ్చిదానంద ఆశ్రమంలో జరిగిన ఈ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ హాజరయ్యారు. (చదవండి: అధర్మం ఓడిపోతుందని ఆనాడే చెప్పాం) ఈ సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, స్వామి కిరణ్‌కుమార్ శర్మలకు ఇరువురు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ ఫలపుష్పాలు సమర్పించి.. ఆశీర్వాదం తీసుకున్నారు. వీరితోపాటు పలువురు ప్రముఖులు కూడా ఈ మహోత్సవానికి రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించిన అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతి.. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి పుష్పాభిషేకం చేశారు. సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవంలో భాగంగా గత మూడురోజులుగా శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో కృష్ణ తీరంలో యాగ, హోమ, దాన, పూజాదికాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పీఠాధిపతులు, వేదపండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా కిరణ్‌కుమార్ శర్మ సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం జరిగింది. -
కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ
-
కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ
-
కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ
సాక్షి, విజయవాడ : కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం రెండోరోజు కూడా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు, భక్తులు తరలివస్తున్నారు. దీంతో సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమం భక్తజన సందోహంగా మారింది. సోమవారం ఈ ఉత్సవంలో గవర్నర్ నరసింహన్‌తోపాటు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్, నవీన్ పట్నాయక్ పాల్గొననున్నారు. శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులవ్వడం సంతోషంగా ఉందని బాలస్వామి కిరణ్‌కుమార్ శర్మ అన్నారు. తాను చిన్నప్పుడే ఆశ్రమానికి వచ్చానని తెలిపారు. మహాస్వామి దగ్గర ఉంటూ అన్ని విద్యలు నేర్చుకున్నానని, ఆయనకు ప్రధాన శిష్యూడయ్యానని చెప్పారు. -
శారదా పీఠంలో సీఎం వైఎస్ జగన్
-
శారదాపీఠంలో సీఎం వైఎస్ జగన్
-
స్వామివారి ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకున్నారు. పూర్ణకుంభంతో వేదపండితులు ఆయనకు స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం వైఎస్ జగన్ స్వరూపానందేంద్ర స్వామివారికి ఫలాలు సమర్పించారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకుని.. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. మరికాసేపట్లో సీఎం తిరుగుపయనమవుతారు. పాదయాత్రలో ఇచ్చిన హామీమేరకు ఆశ వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి 10 వేలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై హర్షం వ్యక్తం చేసిన ఆశా వర్కర్లు.. శారదా పీఠాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి శారదా పీఠం నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి ముఖ్యమంత్రి వెళ్తారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు సజ్జల రామకృష్ణా రెడ్డి, తలశిల రఘురాంతో పాటు మరో ఏడుగురు వైఎస్సార్సీపీ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్టు నుంచి చినముషిడివాడ శారదా పీఠం వరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 14 కిలోమీటర్లు అడుగడుగునా పోలీసుల పహారా నెలకొని ఉంది. శారదా పీఠం పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇక సీఎం రానుండటంతో ఎన్ఏడీ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో అభిమానులు భారీగా ఆయన స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ తొలిసారి విశాఖ వచ్చిన నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో అదనపు భద్రతా చర్యలు చేపట్టారు. సాధారణ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మరోమార్గం గుండా సీఎం రాకకు ఎయిర్‌పోర్టు అధికారులు ఏర్పాట్లు చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
14న అష్టబంధన మహాకుంభాభిషేకం
పెందుర్తి: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ క్షేమం కోరుతూ విశాఖ శ్రీశారదాపీఠంలో ఈ నెల 14న అష్టబంధన మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వెల్లడించారు. ఈ నెల 10 నుంచి 5 రోజుల పాటు పీఠం వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయని చెప్పారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠంలో గురువారం స్వామీజీ మాట్లాడుతూ... శారదాపీఠం లో సుధా దేవాలయం(రాజశ్యామల అమ్మవారి దేవాలయం) పునఃప్రతిష్ఠలో భాగంగా శిలా దేవాలయాన్ని నిర్మించామని, ఈ నెల 10న దేశం నలుమూలల నుంచి వచ్చే పండితుల చేతుల మీదుగా ఆలయ ప్రతిష్ఠాపనతో పాటు యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయని వెల్లడించారు. తొలిరోజు గణపతిపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, దీక్షాధారణ, రాజశ్యామల యాగం, వనదుర్గ యాగం ప్రారంభం, వాల్మికీ రామాయణం, దేవీ భాగవత పారాయణాలు, మేధా దక్షిణామూర్తికి పంచామృతాభిషేకా లు, రుగ్వేద పారాయణం, నిత్య పీఠ పూజ, సాంస్కృ తిక కార్యక్రమాలు, రెండో రోజు దాసాంజనేయస్వామికి పంచామృతాభిషేకాలు, రాజశ్యామల యాగం, వనదుర్గ యాగం, నీరాజన మంత్రపుష్పం, కృష్ణ యజుర్వేద పారాయణం, నిత్య పీఠ పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. తెలం గాణ సీఎం కేసీఆర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విశిష్ట అతిథులుగా పాల్గొంటారని స్వామీజీ చెప్పారు. సమావేశంలో ఉత్తర పీఠాధిపతి బాలస్వామి, ధర్మాధికారి కామేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘బలమైన నాయకుడు సీఎం కావాలి’
పెందుర్తి: పవిత్ర నాగులచవితి నాడు భగవంతుడు తనకు శరీరాన్ని ప్రసాదించడం.. శారదా పీఠానికి పీఠాధిపతిగా నియమించడం తన పూర్వజన్మ సుకృతమని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. స్వామి జన్మదినం సందర్భంగా ఆదివారం విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠంలో పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి అనుగ్రహ భాషణం చేశారు. రాష్ట్రానికి ప్రజలు మెచ్చే బలమైన నాయకుడు ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరముందన్నారు. పాశ్చాత్య పోకడలను అలవాటు చేసుకుంటే అనర్థాలే తప్ప మంచి జరగదని హెచ్చరించారు. భక్తులకు మానవసేవ గురించి వివరించాలన్న తలంపుతోనే.. వారి కోరిక మేరకు ఈ వేడుకలకు ఒప్పుకున్నానని వెల్లడించారు. నాగులచవితి ఎంతో విశిష్టత కలిగిన పర్వదినమన్నారు. పీఠం తరపున తెలుగు రాష్ట్రాలు, దేశానికి ఉపద్రవాలు సంభవించకుండా పరమాత్ముడిని పూజిస్తూ అనేక యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడం లో శారదా పీఠం ముందుందన్నారు. వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి వారికి స్వరూపానందేంద్ర స్వామి చేతుల మీదుగా విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రతినిధి ద్వా రా స్వామికి పట్టువస్త్రాలు, ఫలాలందించా రు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పూజల్లో పాల్గొని ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం గురించి స్వామి బొత్సను ఆరా తీశారు. -
ఘనంగా శ్రీస్వరూపానందేంద్రస్వామి సరస్వతి జన్మదిన వేడుకలు
-
కేరళ బాధితులకు శారదాపీఠం సాయం
పెందుర్తి: ఇటీవల కేరళ రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న గిరిజన ప్రాంతాల్లో సహాయ సహకారాలు అందించేందుకు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సంకల్పించారని, ఆయన ఆదేశాల మేరకు అనేక మంది దాతలను సహాయసహకారాల కోసం సంప్రదించినట్టు ఆ పీఠం ట్రస్ట్ రొబ్బి శ్రీనివాస్ తెలిపారు. ఐపీపీ సెంచరీ క్లబ్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి విలయతాండవంతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలుసుకుని రుషికేష్‌లో చాతుర్మాసదీక్షలో ఉన్న స్వరూపానందేంద్ర సరస్వతి అక్కడి ప్రజలకు దుస్తులు, పప్పుదినుసులు తదితర వాటిని అందించాలని శ్రీశారదాపీఠం ట్రస్ట్ సభ్యులను ఆదేశించారన్నారు. కేరళలో కూడా శంకర సేన సేవా ట్రస్ట్ శారదాపీఠానికి అనుబంధంగా ఉందని పేర్కొన్నారు. సేవలందించేవారు శారదాపీఠానికి తెలియజేస్తే శంకర సేన సేవా ట్రస్ట్, శారదాపీఠం ట్రస్ట్ సభ్యులు, శారదాపీఠం భక్తులు అంతా కలిసి కేరళ ప్రాంతంలో వాటిని అందజేస్తారని చెప్పారు. ఇప్పటికే తొలివిడతగా శంకరసేన సేవా ట్రస్టుకు 5వేల దుప్పట్లు, 2వేల చీరలు, 1500 పంచెలు, 3వేల టవల్స్, ఆహారపదార్థాలు పంపించామని తెలిపారు. రెండో విడతగా ఆదివారం సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎంఆర్ షాపింగ్‌మాల్ అధినేత మావూరి వెంకటరమణ, కృతుంగా రెస్టారెంట్స్ ఎండి నరేందర్‌రెడ్డి, అభిరుచి స్వీట్స్ అధినేత రామకృష్ణ, హూలీమేరీ ఇంజినీరింగ్ కళాశాల అధినేత డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, మహిణ ఇన్ఫ్రా అధినేత సతీష్‌బాబు విరాళాలు ప్రకటించారు. శ్రీదుర్గా ఐబీపీ సెంచరీ క్లబ్ తరఫున లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళం అందించారన్నారు. శారదాపీఠం ట్రస్టీలు చల్లా రామారావు, సభ్యులు కె.చలపతిరావు, పి.హనుమంతరావు, పి.మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
శారదాపీఠంలో ఉచిత వేద విద్య
పెందుర్తి: దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్థికభారంతో, పోషణకు ఇబ్బందులు పడుతున్న వేద పాఠశాలల్లోని విద్యార్థులు, గురువులను విశాఖ శ్రీ శారదాపీఠం దత్తత తీసుకోనున్నట్లు ఉత్తర పీఠాధిపతి బాలస్వామి తెలిపారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామిజీ ఆశీస్సులతో ఆయా రాష్ట్రాల్లో ఉన్న వారిని చినముషిడివాడలోని పీఠానికి తరలించి ఇక్కడి వేద పాఠశాలలో శిక్షణతో పాటు వసతి కల్పిస్తామన్నారు. వీరికి వేద విద్య (రుగ్వేదం, యజుర్వేదం)తో పాటు స్మార్థము, ధర్మశాస్త్రాలు, ఆగమశాస్త్రాలు, సంస్కృత పరిజ్ఞానం అందించాలని సంకల్పించామన్నారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి శారదాపీఠం తరపున ఉత్తీర్ణత ధ్రువపత్రం, రూ.లక్ష ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించారు. శారదాపీఠంలో పదేళ్ల క్రితం జగద్గురువులు శంకరాచార్య వేద పాఠశాలను స్థాపించి ఎందరికో విద్యాబుద్ధులు చెప్పారన్నారు. వేద పాఠశాలలో చేరే ఆసక్తి గలవారు విశాఖ శ్రీశారదాపీఠం, చినముషిడివాడ, విశాఖపట్నం–530051 అడ్రస్‌కు, లేదా 94403 93333, 93485 55595, 99666 69658 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
'బాబా చిత్ర పటాలు పూజ గదిలో ఉంచుకోవద్దు'
అనంతపురం కల్చరల్: ‘షిరిడీ సాయిబాబా ఓ ముస్లిం తెగకు చెందినవారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఆరాధిస్తూ చాలా మంది హిందువులు తప్పు చేస్తున్నారు. ఆయన చిత్రపటాలను పూజ గదిలో ఉంచుకోవద్ద’ని ద్వారకా శారద పీఠం అధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి సూచించారు. శనివారం అనంతపుర వచ్చిన ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా షిరిడీ సాయిని ఆరాధించడాన్ని వ్యతిరేకించడంతో పాటు ఆయన్ను పూజించబోమని, హిందూ ధర్మంతోనే ఉంటామని భక్తులతో ప్రమాణం చేయించారు. దీన్ని బాబా భక్తులు వ్యతిరేకించడంతో వివాదానికి దారితీసింది. సాయి భక్తుల నిరసన ఇదిలా ఉండగా జగద్గురు శంకరాచార్యస్వరూపానంద సరస్వతి షిర్డీసాయిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బాబా భక్తులు మండిపడ్డారు. సాయి సంఘం ప్రతినిధులు సాయినాథ్ మహరాజ్‌కీ జై అంటూ నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని పంపేయడంతో స్వామీజీ తన ఉపన్యాసం కొనసాగించారు.