న్యూఢిల్లీ : టీటీడీలో మెరుగైన సేవల కోసం సూచనలు,సలహాలు అందించాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. రిషికేశ్‌లో సుబ్బారెడ్డి దంపతులు శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీతో కలిసి గంగా స్నానమాచరించారు. శారదా పీఠాధిపతి చేపట్టే చాతుర్మాస్య దీక్షలో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకు శారదా పీఠం చేపట్టిన సేవలు అభినందనీయం అని ప్రస్తుతించారు.
కేంద్ర మంత్రుల్ని కలిసిన టీటీడీ ఛైర్మన్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా,రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.రాష్ట్రానికి నిధులు ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కేంద్ర మంత్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. విభజన హామీలు నెరవేరేలా చూడాలని కోరారు.
శారదాపీఠం సేవలు అభినందనీయం
Published Sat, Aug 3 2019 2:05 PM | Last Updated on Sat, Aug 3 2019 2:11 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment