
సాక్షి, విజయవాడ : కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం రెండోరోజు కూడా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు, భక్తులు తరలివస్తున్నారు. దీంతో సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమం భక్తజన సందోహంగా మారింది. సోమవారం ఈ ఉత్సవంలో గవర్నర్ నరసింహన్‌తోపాటు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్, నవీన్ పట్నాయక్ పాల్గొననున్నారు. శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులవ్వడం సంతోషంగా ఉందని బాలస్వామి కిరణ్‌కుమార్ శర్మ అన్నారు. తాను చిన్నప్పుడే ఆశ్రమానికి వచ్చానని తెలిపారు. మహాస్వామి దగ్గర ఉంటూ అన్ని విద్యలు నేర్చుకున్నానని, ఆయనకు ప్రధాన శిష్యూడయ్యానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment