Bala swamy
-
వీహెచ్‌పీ నేత బాలస్వామికి బెదిరింపు కాల్స్.. ఈస్ట్‌జోన్ డీసీపీకి ఫిర్యాదు
సుల్తాన్‌బజార్: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేత బాలస్వామికి ఆదివారం బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన ఈస్ట్‌జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాలస్వామి మా ట్లాడుతూ బజరంగ్దళ్ నిరసన కార్యక్రమాలను నిలిపి వేయాలని విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ అయిన తనకు ఆదివారం అర్ధరాత్రి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్‌లకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడంతో పాటు డీసీపీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడాన్ని వారు సవాలు చేస్తున్నారన్నారు. రకరకాల పేర్లతో ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బజరంగ్దళ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాలను వెంటనే రద్దుచేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చ రించినట్లు బాలస్వామి వెల్లడించారు. వీహెచ్‌పీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌ను కొందరు మార్పిడి చేసి వైరల్ చేశారన్నారు. అందులో వివాదాస్పద వ్యాఖ్యలు జోడించారని ఆరోపించారు. తమ ఫిర్యాదుపై డీసీపీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. -
కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ
-
కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ
సాక్షి, విజయవాడ : కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం రెండోరోజు కూడా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు, భక్తులు తరలివస్తున్నారు. దీంతో సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమం భక్తజన సందోహంగా మారింది. సోమవారం ఈ ఉత్సవంలో గవర్నర్ నరసింహన్‌తోపాటు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్, నవీన్ పట్నాయక్ పాల్గొననున్నారు. శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులవ్వడం సంతోషంగా ఉందని బాలస్వామి కిరణ్‌కుమార్ శర్మ అన్నారు. తాను చిన్నప్పుడే ఆశ్రమానికి వచ్చానని తెలిపారు. మహాస్వామి దగ్గర ఉంటూ అన్ని విద్యలు నేర్చుకున్నానని, ఆయనకు ప్రధాన శిష్యూడయ్యానని చెప్పారు. -
శ్రీ శారదాపీఠం... ఉత్తరపథం
ఆదిశంకరుల మార్గాన్ని అనుసరిస్తూ అద్వైతసిద్ధాంత ప్రచారకులుగా మన నేల మీద నడయాడిన మహోపాధ్యాయులు ఎందరో ఉన్నారు. వారిలో అగ్రేసరునిగా చెప్పదగ్గవారు జగద్గురు శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతీ మహాస్వామి. వారు శంకరాద్వైతానికి ప్రతీక. ఆ కోవలో చేరేవారే విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి. సచ్చిదానందేంద్రస్వామి నిరూపించిన నిర్గుణ బ్రహ్మవాదాన్ని పుణికి పుచ్చుకుని స్వరూపానందేంద్ర ధర్మపరిరక్షకులుగా నేటి భారతాన దర్శనమిస్తున్నారు.సనాతన ధర్మ పరిరక్షణమే సమాజానికి ఆవశ్యకమని చాటి చెబుతున్నారు. ధర్మపోరాటాలు చేపడుతున్నారు. అలాంటి స్వరూపానందేంద్రులవారు 1990 దశకంలో విశాఖపట్నంలోని పెందుర్తి సమీపాన చినముషిడివాడ గ్రామంలో వేదోక్తంగా నెలకొల్పిన శారదా పీఠం దినదిన ప్రవర్థమానమవుతూ ఎందరికో మార్గనిర్దేశం చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన శ్రీ విశాఖ శ్రీశారదాపీఠ వైభవం రాబోయే తరాల్లోనూ వెల్లివిరియాలన్న లక్ష్యంతో స్వరూపానందేంద్ర స్వామి పీఠం భావి బాధ్యతలను ఇరవై ఆరేళ్ల బ్రహ్మచారి కిరణ్ కుమారశర్మకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. కుమారశర్మకు శిష్యతురీయాశ్రమ దీక్షను స్వయంగా తానే ప్రదానం చేయదలిచారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో వేదవేద్యుల సన్నిధిలో ఆహితాగ్ని సాక్షిగా కిరణ్‌కుమారశర్మ సన్యాసాశ్రమ స్వీకరణ ఉత్సవం ఘనంగా జరిగేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక వ్యాసం... భారతీయ ధర్మపీఠాలు నిత్యం ప్రవహించే జీవనదులు. జనబాహుళ్యంలో చేతన నింపగల దివ్యధామాలు. ప్రజాళిని మంచి మార్గాన నడిపించే భక్తి సదనాలు. ఆదిశంకరాచార్యుని మొదలు ఇప్పటి మహాస్వాముల వరకూ ఎందరెందరో స్వధర్మ సంరక్షణకు పాటుపడుతున్నారు. శ్రుతి, స్మృతి పురాణాలను మరింతగా సమన్వయం చేస్తున్నారు. ప్రకరణ గ్రంథాల సాయంతో జీవితసత్యాలను వెల్లడి చేస్తున్నారు. పరబ్రహ్మతత్వాన్ని ఎరుకపరుస్తున్నారు. ఇలాంటి మహనీయుల పరంపర ఆగిపోకూడదు. వీరు నిర్వహించే పీఠాలు నిత్యమై శాశ్వతమై ధర్మప్రచారాన్ని నిర్వహిస్తూనే ఉండాలి. ఈ యోచనతోనే భారతీయ ధర్మకేంద్రాల అధిపతులు తమ ఉత్తరాధికారిగా ఒకానొక శిష్యుణ్ణి ఎంపిక చేసుకుంటారు. భావి మహాస్వామిగా ఆ బాలసన్యాసిని ప్రకటిస్తారు. శంకరభగవత్పాదులు ప్రారంభించిన పూరీ, శృంగేరీ, ద్వారక, జ్యోతిర్మఠాలు సహా వివిధ సంప్రదాయ పీఠాలెన్నో పరంపరానుగతంగా ఈ సరళిలోనే ముందుకు సాగుతున్నాయి. అజరామరమై విరాజిల్లుతున్నాయి. ఈ ధర్మపీఠాలకు నియుక్తులైన ఉత్తరాధికారులు భవిష్యత్తులో జగద్గురు స్థానాన్ని చేపట్టవలసి ఉంటుంది. జాతికి నీతిని నేర్పవలసి ఉంటుంది. సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడవలసి ఉంటుంది. శంకర పదం.. స్వరూప పథం.. తురీయాశ్రమ ధర్మాన్ని భారతీయ ఉపనిషద్సారం విడమరిచి చెప్పింది. మానవజన్మకు సంబంధించిన జాగృత, స్వప్న, సుషుప్తావస్థలను దాటి నాలుగవదశకు చేరిన చతుర్థశ్రేణి అశ్రమమే తురీయాశ్రమ సన్యాసం. సర్వసంగాలను తెంచుకుని బ్రహ్మజ్ఞానాన్ని అనుసరిస్తూ సన్యాసి తన జీవితాన్ని గడపవలసి ఉంటుంది. ఇలాంటి సన్యాసాశ్రమం స్వీకరించడానికి ధర్మనిష్ఠతో పాటు, స్వీయ ఆత్మను తెలుసుకోవడం పునాది అవుతుంది. శారదా పీఠం ఉత్తరాధికారిగా నియమితులవుతున్న కిరణ్‌కుమారశర్మ ఈ విషయంలో పూజనీయులు. వేదవిద్యను ఆకళింపు చేసుకున్న వేత్తలు. కనక దుర్గమ్మ సాక్షిగా.. కనకదుర్గమ్మ పాదాలచెంత ఈ ఉత్తరాధికార నియామకాన్ని ఒక మహత్కార్యంగా జరిపించాలని స్వరూపానందేంద్ర తలపోశారు. విజయవాడ కృష్ణా నది ఒడ్డున ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమం జయదుర్గా తీర్థాన్ని ఇందుకు వేదికగా శ్రీ చరణులు ఖరారు చేశారు. జూన్ 15, 16, 17 తేదీల్లో వేదవేద్యుల సన్నిధిలో ఆహితాగ్ని సాక్షిగా కిరణ్‌కుమారశర్మ సన్యాసాశ్రమ స్వీకరణ ఉత్సవం ఘనంగా జరిగేందుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా వేదవిహితమైన అగ్నికార్యాలు ఏర్పాటవుతున్నాయి. సన్యాసాంగ చతుష్కృత్య ప్రాయశ్చిత్తం, దశవిధ స్నానాలు, షోడశమహాదానాలు నిర్వహిస్తారు. శాస్త్ర వాక్యార్థ సభలు సాకారమవుతాయి. వైశ్వానర స్థాలీపాకం, విరజా హోమాలూ భక్తి శ్రద్ధలతో కొనసాగుతాయి. ప్రాచీన, నవీన గురువందనాలు సభక్తికంగా వీటికి జతపడతాయి. బాలస్వామికి యోగపట్టాను శ్రీ చరణులు అనుగ్రహిస్తారు. ఈ మహత్కార్యంలో భాగం పంచుకునేందుకు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాలనుంచీ భక్తకోటి తరలిరానుంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్, ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖరరావు, వై.ఎస్. జగన్మోహనరెడ్డి తదితర పెద్దల సమక్షంలో కార్యక్రమం జరుగుతుంది. భక్తి ఉద్యమసారధి బాలస్వామి.. శ్రీశారదా పీఠం ఉత్తరాధికారిగా నియమితులయ్యే కిరణ్‌కుమారశర్మ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం. 1993 ఏప్రిల్ 4 విశాఖలో జన్మించారు. తల్లిదండ్రులు పోణంగి హనుమంతరావు, ప్రభావతమ్మ. వీరిది మధ్యతరగతి కుటుంబం. హనుమంతరావు ఇద్దరు పిల్లలలో పెద్దవాడు కిరణ్‌కుమారశర్మ మూడవ తరగతి చదువుతుండగా యాదృచ్ఛికంగా తల్లిదండ్రులతో కలిసి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామిని దర్శించే భాగ్యం కలిగింది. బాలకిరణుడు మహాస్వామి కంటికి అపరశంకరునిగా గోచరించారు. అద్భుత ముఖవర్ఛస్సుతో, బ్రహ్మజ్ఞాన సముపార్జనార్హతతో కళకళలాడుతూ పిల్లవాడు కనిపించడం స్వామివారిని విశేషంగా ఆకర్షించింది.వెనువెంటనే తల్లిదండ్రులతో మాట్లాడారు. లౌకికవిద్యకు స్వస్తి పలికించి పిల్లవాణ్ణి పీఠానికి చేర్చమని సూచించారు. పీఠానికి వచ్చిన నాటినుంచీ కిరణ్‌కుమారశర్మ జీవితం పూర్తిగా మారిపోయింది. ఆంగ్ల విద్య మలిగిపోయింది. అంతఃచక్షువులకు సంబంధించిన వేదాధ్యయనం మొదలైంది. సంధ్యావందనంతో ప్రారంభమైన చదువు షోడశకర్మలు, పంచదశ కర్మలూ దాటింది. స్మార్తం హృదయగతమైంది. ద్వాదశి విశ్వనాథం, ఉప్పులూరి సంతోష్కుమార్శర్మల గురుత్వంలో కుమారశర్మ రాటుదేలుతూ వచ్చారు. రాణి దక్షిణామూర్తిగారి వద్ద ఉపనిషత్తులు, కారికలు, అరుణం పూర్తి చేశారు. దక్షిణామూర్తి, గిరీశశర్మ అధ్యాపకత్వంలో కృష్ణయజుర్వేదాన్ని అస్థిగతం చేసుకున్నారు. వ్యావహారిక సంస్కృతగ్రామంగా ప్రపంచంలోనే ప్రసిద్ధమైన కన్నడసీమలోని మత్తూరు వాస్తవ్యులు అరుణావధాని, బోధనలో మెళకువలు తెలిసిన ఇరుకు విద్యాసాగరశర్మ వంటి గురువుల నుంచి సంస్కృతం నేర్చుకున్నారు. శ్రీ చరణుల వద్దనే కిరణ్‌కుమార శర్మ తర్క, సాంఖ్య, యోగ, వేదాంత, మీమాంసలతో పాటుగా వేదాంగాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేశారు. మహాస్వామి ప్రధాన శిష్యునిగా మారిపోయారు. బాలస్వామిగా ప్రఖ్యాతమయ్యారు. రామేశ్వరం నుంచీ హిమాలయాలవరకూ స్వరూపానందేంద్రతో కలిసి విశేష పర్యటనలు జరిపారు. ఆ రకంగా మహాస్వామి అడుగులలో అడుగులు కదుపుతూ శిష్య తురీయాశ్రమ సన్యాస దీక్షా స్వీకరణకు సిద్ధమయ్యారు.విశ్వజనీనమైన స్వధర్మాన్ని రానున్న కాలాన బాలస్వామి కుమారశర్మ మునుముందుకు నడిపిస్తారనేదే భక్తజనుల ఆశ. ఆకాంక్ష. – డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు బాలస్వామి యోగ్యుడు అదిశంకరుడు, సచ్చిదానందేంద్రుడు, అద్వైతానందేంద్రుడు వీరి పరంపరగా శారదా పీఠం నడుస్తూ వస్తోంది. దీనికి ఉత్తరాధికారిగా కిరణ్‌కుమారశర్మ వ్యవహరించబోతున్నారు. వీరి సన్యాసనామం వేరుగా ఉంటుంది. దానిని శిష్యతురీయాశ్రమదీక్ష స్వీకార సమయంలో వెల్లడి చేస్తాం. కిరణ్‌కుమార శర్మ యోగ్యులు. వేదవేదాంగాలు చదువుకున్నవారు. వారి నేతృత్వంలో శ్రీ శారదా పీఠం మరిన్ని సత్కార్యాలు చేయనుంది. – స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి పూర్వజన్మ సుకృతం బంగారం లాంటి మా అబ్బాయిని స్వరూపానందేంద్ర స్వామివారే మేలిమి బంగారంలా తయారు చేశారు. ధర్మ పరిరక్షణకోసం వినియోగిస్తున్నారు. ఇంతకంటే ఏ తల్లిదండ్రులకయినా కావలసింది ఏముంటుంది. అందుకే విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాబు నియమితులవుతున్నారని తెలిసి సంతోషించాం. కిరణ్‌కుమారశర్మ ఇంతవరకూ మా అబ్బాయి. ఇప్పుడు జగద్గురువు స్థానానికి చేరారు. ఇది మా పూర్వజన్మ సుకృతం. – పోణంగి హనుమంతరావు, ప్రభావతమ్మ, కిరణ్‌కుమారశర్మ తల్లిదండ్రులు స్వామి అడుగుజాడల్లో... విశాఖ శ్రీ శారదాపీఠం విలక్షణమైనది. బాధ్యతాయుతమైనది. ఆదిశంకరాచార్యుల వారందించిన చైతన్యంతో నడుస్తోంది. శ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామి అడుగుజాడల్లో నడిచి మరిన్ని ధర్మపోరాటాలు చేయాలనేది నా ఆకాంక్ష. వారి సూచనలు పాటిస్తూ ధర్మప్రచారం కోసం అహరహమూ శ్రమిస్తాను. సర్వశక్తులూ ఒడ్డుతాను. – కిరణ్‌కుమారశర్మ, శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి -
తాళి తెంచటం మనోభావాలు దెబ్బతీయడం కాదా?
తమిళనాడులో కొంత మంది ‘బుద్ధిమంతులు’ బహిరంగంగా కట్టుకున్న తాళిని తెంచుకోవడం.. దానికి మీడియా మితిమీరిన పబ్లిసిటీ ఇవ్వడం కూడా సెక్యులరిజంలో భాగమేనా? మరి 120 కోట్లమంది జనాభా ఉన్న భారతదేశంతో మొదలుకుని ప్రపంచంలోని అనేక దేశాల్లో జీవిస్తున్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను ఇది దెబ్బ తీసినట్టు కాదా? మనకు స్వేచ్ఛ ఉంది కదా.. అని ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం అనేది ఎంతవరకు సరైనది? తాళి బొట్టు ఒక్కసారి మెడలో పడితే అది శరీరంలో భాగమైపో తుంది అనుకునే వారు కొందరు.. ఫంక్షన్లకు మాత్రమే వేసుకునే వారు మరికొందరు.. పండుగలకు మాత్రమే వేసుకునే వారు ఇంకొందరు.. అసలే వేసుకోని వారు కొందరు. ఇలా వారివారి ఇష్టానుసారం మేరకు వారు తాళిని ధరిస్తారు. మరి కొందరేమో.. తాళి బొట్టే సర్వస్వం.. అంటూ ఉదయాన్నే లేవగానే రెండు కళ్లకు అద్దుకుని పసుపు కుంకుమలు క్షేమంగా ఉండాలని పూజిస్తారు. అది వారి వారి వ్యక్తిగత విషయం. కానీ అందరూ అలానే చేయాలి అంటే కుదరవచ్చు.. కుదరక పోవచ్చు. మహిళల మైండ్‌సెట్‌కు సంబంధించిన అంశం అది. హిందూ సమాజంలో చాలామంది మహిళలు భర్త ఉన్నన్ని రోజులు మంగళసూత్రాన్ని పవిత్రంగానే భావిస్తారు. భర్త పోయాక దాన్ని కూడా తీసేస్తారు. అది ఆచారం..సంప్రదాయం కూడా. కానీ భర్త ఉండగానే తాళి తెంచుకోవడం అనేది కూడా వారి వారి వ్యక్తిగత విషయమే. కానీ దానికి ఓ వేదిక ఏర్పాటు చేసుకుని అందరి సమక్షంలో తాళిని తెంపటం అంటే మెజారిటీ వర్గాల మనసు నొప్పించడమే.. కయ్యానికి కాలు దువ్వడమే తప్ప ఇంకోటి కాదు. బహిరంగంగా తాళి తెంపేటందుకే ఓ వేదిక ఏర్పాటు చేసుకుని మెజారిటీ వర్గాల ప్రజల మనోభావాలపై దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదు. పైగా తాళి బొట్లు తెంచేయండి.. సహజీవనం చేస్తూ పిల్లలను కనండి అంటూ డీకే పార్టీ అధ్యక్షుడు శివమణి బహిరంగంగా ప్రకటించడం వెనక మతలబు ఏంటి? మరీ ముఖ్యంగా ఆ వ్యాఖ్యలను లోతుగా గమనిస్తే కుటుంబ వాతావరణంలో జీవించే వారికి తలవంపులు తెచ్చే విధంగా ఉన్నాయి. హిందూ జీవన విధానాలు విశ్వసిస్తూ.. ఆచరించే ప్రతి వ్యక్తి చొరవచూపి, ఇలా తాళినితెంచిన, తెంచుతున్న చర్యలను ఖండించాలి. సెక్యులర్ అంటే అన్ని మతాలు సమానమే.. వ్యత్యాసాలు వద్దని. కానీ ఈ దేశంలో సెక్యులర్ అంటే కేవలం మెజారిటీ వర్గాలను అవమానించ డమే పనిగా సాగుతోంది. ఇలాంటి విధానం మాను కోవాలి. అపుడే సెక్యులరిజాన్నిఅందరూ గౌరవిస్తారు. అభిమానిస్తారు. పగుడాకుల బాలస్వామి హైదరాబాద్ -
ప్రేమను గెలిచి..జీవితంలో నిలిచి...
అగాథంలో కూరుకుపోతున్న వారికి నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించేది ప్రేమ.. కష్టాల కడలి నుంచి సౌఖ్యాల తీరాన్ని దాటించేది ప్రేమ..ఇతరుల ఆనందాన్నే తన సంతోషంగా భావించేది ప్రేమ..చీకట్లో చిరుదివ్వెను వెలిగించేది ప్రేమ..ఏమీ లేకున్నా.. అన్నీ ఉన్నాయన్న భరోసా కల్పించేది ప్రేమ..అడ్డంకులు.. అవాంతరాలను ఎదుర్కొనే శక్తినిచ్చేది ప్రేమ.. ఇంతటి మహత్తర శక్తి ఉన్న ప్రేమను ఆస్వాదిస్తూ ఆనంద జీవితాలు గడుపుతున్న ప్రేమికులపై వాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం... స్నేహితుల సహకారంతో ఒక్కటయ్యాం కులాలు వేరని మా పెళ్లికి కుటుంబపెద్దలు ఒప్పుకోలేదు. ఐదేళ్లు పోరాటం చేశాం. అయినా అడ్డంకులు ఎదురొచ్చాయి. స్నేహితులు వెంకటయ్య, రాజు సహకారంతో ఉమామహేశ్వర క్షేత్రంలో ప్రేమవివాహం చేసుకున్నాం. బాలస్వామి ప్రస్తుతం అచ్చంపేటలో ఆర్ఎంపీగా, విజయలక్ష్మి ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి కుమారుడు ధనుంజయ్, కుమార్తె గణప్రియ ఉన్నారు. ప్రస్తుతం ఇరువురి కుటుంబాలు కలిసి ఉంటున్నారు. - ఎం. బాలస్వామి, విజయలక్ష్మి(అచ్చంపేట) హ్యాపీగా ఉంది..! ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదువుతుండగా మా పరిచయం ఏర్పడింది. నా సతీమణి రజనీది నల్గొండ జిల్లా రత్నావరం. ఎంఏ చదివి బీఈడీ పూర్తిచేసింది. ప్రస్తుతం నేను తలకొండపల్లి మండలం ఖానాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నాను. అప్పట్లో ఒకేక్లాస్ కావడంతో మా పరిచయం ప్రేమగా మారింది. మా కుటుంబాల పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. మాకు ఇద్దరు పిల్లలు. మా మధ్య ఎలాంటి దాపరికాలేవు. కుటుంబ జీవనం హాయిగా, హ్యాపీగా సాగుతోంది. - మల్లేష్, రజినీ, చుక్కాపూర్, తలకొండపల్లి మండలం కులాలు వేరని కులాలు వేరుకావడంతో ప్రేమపెళ్లికి కుటుంబపెద్దలు అంగీకరించలేదు. అయినా దాంపత్య జీవితానికి ఇరువురి భావాలు ఏకమయ్యాయి. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని స్నేహితుల సహ కారంతో బీచుపల్లి ఆంజేయస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నాం. ప్రస్తుతం భార్యాపిల్లలతో హాయిగా జీవిస్తున్నాం. - తిరుమలేష్, అమరచింత స్నేహం ప్రేమగా మారింది మాది గట్టు మండలం చింతలకుంట గ్రామం. బీఈడీ వనపర్తిలో పూర్తిచేశాను. ఆ సమయంలో నా క్లాస్మేట్ శ్రీదేవితో పరిచయమేర్పడింది. ప్రేమను వ్యక్త పర్చుకున్నాం. ఆ తర్వాత ప్రేమను పెద్దల ముందుంచి పెళ్లికి ఒప్పించాం. పెళ్లికి ముందు కంటే పెళ్లయిన తర్వాతే రెట్టింపు ప్రేమతో ఉన్నాం. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో అన్యోన్యజీవితాన్ని సాగిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండి ఇంటి బాధ్యతలు మరచినా తనకు తోడుగా వచ్చిన భార్య చక్కని ప్రోత్సాహం అందిస్తున్నారు. - శ్రీనివాస్, డిప్యూటీ తహశీల్దార్, ధరూరు ప్రేమపెళ్లి వద్దన్నారు 1988లో ఎంవీ రామన్ ఆంగ్ల మీడియం స్కూలును ఆత్మకూర్‌లో ఏర్పాటు చేశాం. పాఠశాల అవసరం రీత్యా ఆంగ్లభాష బోధన కోసం కేరళ నుంచి ఉపాధ్యాయులను నియమించుకున్నాం. వారిలోనే ఆన్సీ అనే ఉపాధ్యాయినితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కులాలు వేరు.. పెళ్లొద్దని కుటుంబ సభ్యులు అభ్యంతరం చె ప్పినా.. పెళ్లి చేసుకున్నాం. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సమానంగా ఎదుర్కొంటాం. అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతో దినదినాభివృద్ధితో పాఠశాలను ముందుకు తీసుకెళ్తూ గర్వంగా బతుకుతున్నాం. - ఎం.శ్రీధర్‌గౌడ్, ఎంపీపీ, ఆత్మకూర్ ప్రేమపెళ్లితో స్థిరడడ్డా పాఠశాలలో కేరళ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకుని వైవాహిక జీవితానికి శ్రీకారం చుట్టాం. ప్రస్తుతం ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. భార్య ప్రైవేట్ పాఠశాల లో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. కేరళ అమ్మాయిని చేసుకునప్పటికీ ఇంట్లో ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. మా సంసార జీవితం కష్టసుఖాలతో సాగుతోంది. - రవిప్రకాష్ యాదవ్, కండక్టర్, అమరచింత