'బాబా చిత్ర పటాలు పూజ గదిలో ఉంచుకోవద్దు'
అనంతపురం కల్చరల్: ‘షిరిడీ సాయిబాబా ఓ ముస్లిం తెగకు చెందినవారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఆరాధిస్తూ చాలా మంది హిందువులు తప్పు చేస్తున్నారు. ఆయన చిత్రపటాలను పూజ గదిలో ఉంచుకోవద్ద’ని ద్వారకా శారద పీఠం అధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి సూచించారు.
శనివారం అనంతపుర వచ్చిన ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా షిరిడీ సాయిని ఆరాధించడాన్ని వ్యతిరేకించడంతో పాటు ఆయన్ను పూజించబోమని, హిందూ ధర్మంతోనే ఉంటామని భక్తులతో ప్రమాణం చేయించారు. దీన్ని బాబా భక్తులు వ్యతిరేకించడంతో వివాదానికి దారితీసింది.
సాయి భక్తుల నిరసన
ఇదిలా ఉండగా జగద్గురు శంకరాచార్యస్వరూపానంద సరస్వతి షిర్డీసాయిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బాబా భక్తులు మండిపడ్డారు. సాయి సంఘం ప్రతినిధులు సాయినాథ్ మహరాజ్‌కీ జై అంటూ నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని పంపేయడంతో స్వామీజీ తన ఉపన్యాసం కొనసాగించారు.