Shirdi Sai
-
విజయవాడ–షిర్డీ విమాన సర్వీసులు ప్రారంభం
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి ఇండిగో సంస్థ ఆదివారం నుంచి విమాన సర్వీసులను ప్రారంభించింది. మధ్యాహ్నం 12.25 గంటలకు సుమారు 70 మంది ప్రయాణికులతో విమానం షిర్డీకి బయల్దేరి వెళ్లింది. అక్కడి నుంచి 66 మంది ప్రయాణికులతో విమానం తిరిగి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంది. రోజూ అందుబాటులో ఉండే ఈ విమాన సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఇండిగో ప్రతినిధులు కోరారు. -
షిర్డీ ఆలయానికి భారీ విరాళాలు.. రూ.6.68 కోట్ల ఆదాయం
సాక్షి, ముంబై: వరుసగా వచ్చిన క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులతో షిర్డీలోని సాయిబాబా ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఫలితంగా బాబా సంస్థాన్‌కు కానుకలు రూపంలో రూ.6.68 కోట్ల ఆదాయం వచ్చింది. బాబా ఆలయం ఆవరణలో, సమాధి మందిరంలో ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు సమర్పించుకున్న కానుకలను సాయి సంస్థాన్ పదాధికారులు బుధవారం లెక్కించారు. అందులో నగదు, బంగారు, వెండి కానుకల రూపంలో ఆలయానికి మొత్తం రూ.6.68 కోట్లు విరాళాలుగా అందాయి. ఇందులో రూ.26.22 లక్షలు విలువచేసే వివిధ రకాల బంగారు ఆభరణాలు, రూ.1.07 లక్షలు విలువచేసే వెండి నగలున్నాయి. అయితే షిర్డీ పుణ్యక్షేత్రంలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన విరాళాలు స్వీకరించే కౌంటర్లలో పోగైన నగదు, అన్లైన్లో దాతలు పంపిన నగదు ఇంకా లెక్కించాల్సి ఉంది. ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తయితే విరాళాల మొత్తం ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. లాక్‌డౌన్‌తో భారీగా పడిపోయిన ఆదాయం.. క్రిస్మస్‌తోపాటు థర్టీఫస్ట్ డిసెంబర్, నూతన సంవత్సరం ఇలా వరుసగా వచ్చిన సెలవుల కారణంగా షిర్డీ పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోవిడ్ ఆంక్షలు, ఆలయ దర్శన వేళలు కుదించినప్పటికీ పది రోజుల్లో భక్తులు పెద్దసంఖ్యలోనే బాబాను దర్శించుకున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ వల్ల అనేక నెలలు షిర్డీసాయి ఆలయం మూసి ఉంచారు. దీంతో బాబా ఆలయానికి కానుకల రూపంలో లభించే ఆదాయానికి భారీగా గండిపడింది. కరోనా వైరస్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టడంతో 2021 అక్టోబరు ఏడో తేదీ నుంచి ఆలయాన్ని తిరిగి తెరిచారు. చదవండి: Covid-19: ప్రముఖ ఆస్పత్రిలో 61 మంది డాక్టర్లకు కరోనా దీంతో భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. కానీ కోవిడ్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తొలుత రోజుకు 12 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. వృద్ధులకు, చిన్న పిల్లలకు అనుమతి నిషేధించారు. కానీ ఈ సంఖ్య పెంచాలని బాబా ఆలయ సంస్ధాన్‌పై భక్తుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో పెరుగుతున్న భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని రోజుకు 25 వేల మంది భక్తులను అనుమతించసాగారు. దీంతో హుండీలో భక్తులు సమర్పించుకుంటున్న కానుకలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వరుసగా వచ్చిన సెలవుల వల్ల నవంబర్ 24 నుంచి జనవరి 4వ తేదీ వరకు భక్తులు బాబాకు భారీగా విరాళాలు సమర్పించుకున్నారు. ఇలా పది రోజుల్లో మొత్తం రూ.6.68 కోట్ల మేర విరాళాలు సమకూరాయని ఆలయ అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు ఆదాయంతో పోలిస్తే ఈ విరాళాలు తక్కువే అని చెప్పారు. ఒక పక్క కోవిడ్ ఆంక్షలు, దర్శన వేళలు కుదించడం, మరోపక్క రోడ్డు, రైలు రవాణ సౌకర్యాలు సరిగా లేకపోవడంతో షిర్డీకి వచ్చే భక్తుల తాకిడి సగానికి తగ్గిపోయింది. గతంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో బాబాకు కానుకల రూపంలో సుమారు రూ.10–12 కోట్లమేర ఆదాయం వచ్చేది. ఇప్పుడు సగానికి పడిపోయిందని వారు అంటున్నారు. -
ఒక్కటైనారు ముక్కోటి భక్తులు
దేవుడి కోసం ఇంతలా ఎప్పుడూ భక్తులు తపించి పోలేదు. అయోధ్య రాముడి కోసం రాజకీయ భక్తులు, శబరిమల అయ్యప్ప కోసం కోర్టు తీర్పు భక్తులు, షిర్డీ సాయి కోసం న్యూ ఇయర్ భక్తులు, తిరుమల శ్రీవారి కోసం బలవన్విరమణ అర్చక భక్తులు.. వీళ్లంతా క్రిస్మస్ తాత మోసుకొచ్చే కానుకల మూట కోసం నిన్న మొన్నటి వరకు ఎదురు చూసిన పసి పిల్లల్లా ఆశగా వేచి ఉన్నారు. జీసస్.. ఇంత మంచి భక్తిమాసం ఎప్పుడైనా వచ్చిందా! వెచ్చని చలి అని కాదు. కేకు ముక్కల్లో మగ్గిన తియ్యని ద్రాక్ష పరిమళం అని కాదు. ముక్కోటి దేవతలు కదా ఎప్పుడూ ఒక్కటవుతారు. ఈ డిసెంబరులో ముక్కోటి భక్తులు ఏకమయ్యారు. ఎవరి దర్శనం కోసం వాళ్లు. ఎవరి విజ్ఞప్తుల కోసం వాళ్లు. ఎవరి తీర్పుల కోసం వాళ్లు. దేశమంతటా భువి నుంచి దివికి వెలుగులు విరజిమ్మే వేడుకల తోరణాలే! రంగురంగుల వేడుకోళ్ల వినతి పత్రాలే! షిర్డీలో ఈ ఏడాది ‘న్యూ ఇయర్ దర్శనాలు’ వారం ముందుగానే.. నిన్న క్రిస్మస్ రోజున మొదలయ్యాయి. ఇకనుంచి ఇదే సంప్రదాయం. ఏటా డిసెంబర్ 31–జనవరి 1 మధ్య ఉండే ఇరవై నాలుగు గంటల వ్యవధి భక్తుల దర్శనానికి మరీ ఇరుకైపోవడంతో ఆలయ సీఈవో రుబల్ అగర్వాల్ దర్శనభాగ్యాన్ని ఏడు ‘ఇరవై నాలుగు గంటల నిడివి’కి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్రిస్మస్ నుంచి జనవరి ఫస్ట్ వరకు జరిగే ఈ దర్శనోత్సవాలకు ‘షిర్డీ ఫెస్టివల్’ అని పేరు పెట్టారు. ఆలయ ప్రాంగణంలో సంగీత కచేరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రథమ దర్శనోత్సవాలకు ఒడిశా నుంచి సుబ్రత్, నాశిక్ నుంచి వినయ కులకర్ణి, కర్ణాటక నుంచి అనిల్‌కుమార్ మిస్కిన్, షిర్డీ గాయకుడు సుధాంశు లోకేగావ్కర్, ముంబై నుంచి రవీంద్ర పింగ్లే వస్తున్నారు. ‘స్వరాంజలి సంగీతం బృందం’ ముంబై నుంచి ఇప్పటికే షిర్డీ చేరుకుంది. వీళ్లే కాదు, భక్తుల ‘ఆరగింపు సేవ’కు కొత్త సోలార్ కిచెన్ పొగలు కక్కుతూ ఉంది. అటువైపున శబరిమలకు కూడా ఈ డిసెంబరులో భక్తుల తాకిడి ఎక్కువైంది. అయితే అది కోర్టు కారణంగా కొత్తగా తయారైన భక్తుల తాకిడి మాత్రమేనని అనుకోవాలి. వారి సౌకర్యార్థం ‘ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు’ తను చేయగలిగింది చేస్తున్నప్పటికీ, ‘పంబ’లో మకాం వేసిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి.కార్తికేయన్ అంతకుమించే చేయవలసి వస్తోంది. ఆదివారం మదురై బయల్దేరి, మధ్యలో శబరిమల దర్శనానికి వచ్చిన యాభై ఏళ్లలోపు మహిళా భక్తులు పదకొండు మందిని.. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్న భక్తులు అడ్డగించడంతో కార్తికేయన్ అండ్ టీమ్ సురక్షితంగా వెనక్కు పంపించవలసి వచ్చింది. పట్టింపుల భక్తులకు, పంతంపట్టి వస్తున్న భక్తులకు మధ్య ఘర్షణ.. సంక్రాంతి వచ్చిపోతే కానీ సమసిపోయేలా లేదు. ఢిల్లీలో కూడా డిసెంబర్ ఎప్పుడూ ఇంత ‘వేడి’గా లేదు. సుప్రీంకోర్టు ముందు గొంతుక్కూర్చుని తీర్పు కోసం ఎదురుచూస్తున్న అయోధ్య భక్తుల నిరసన నిట్టూర్పులు ఈ క్లైమేట్ ఛేంజ్‌కి కారణం. అయితే ఆలయ నిర్మాణానికి భక్తులు త్వరపడుతున్నంతగా జడ్జీలు హైరానా పడడం లేదు. అక్టోబర్‌లో ఫైల్ టేబుల్ మీదకు వచ్చినప్పుడు, ఆ ఫైల్ని జనవరి మొదటి వారంలోకి గిరాటు వేశారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్. మొదటి వారంలో కూడా ఏ డేటో చెప్పలేదు. మొన్న డిసెంబర్ 24న డేటొచ్చింది జనవరి 4న అని. ‘ఇదంతా కాదు. వెంటనే ఆర్డినెన్స్ తెచ్చి, అయోధ్యలో రామాలయ నిర్మాణం మొదలుపెట్టాలి’ అని ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భాగవత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అడుక్కోవాల్సి వస్తోంది. రామాలయం మా హక్కు కాదా’ అని ఆర్.ఎస్.ఎస్. కార్యదర్శి భయ్యాజీ జోషీ ఆవేదన చెందుతున్నారు. ‘ఆలయ నిర్మాణానికి ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తామేమిటో చూపిస్తారు’ అని వి.హెచ్.పి. వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ హెచ్చరిస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చెయ్యడానికి, ఆవేదన చెందడానికి, హెచ్చరించడానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అవకాశం లేదు కాబట్టి, ‘అంతే కదా. రామాలయ నిర్మాణం జాతి ప్రజల అభిమతం కదా. బీజేపీ ఉన్నది అందుకే కదా’ అని మాత్రం అనగలుగుతున్నారు. ‘బీజేపీ మాత్రమే రామాలయాన్ని నిర్మించగలదు. వేరెవ్వరూ నిర్మించలేరు’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ అంటున్నారు. సాధ్యాసాధ్యాలను చూడనివ్వదు కదా భక్తి పారవశ్యం! జనవరి 4న అని కోర్టు ఇచ్చిన తేదీ ‘తుది తీర్పు’ ఇవ్వడం కోసం కాదు. కనీసం వాదోపవాదాలను వినడానికీ కాదు. ఎప్పటి నుంచి ‘తను వింటుందో’ ఆ తేదీ చెప్పడం కోసం. అయోధ్యలోని ఆ 2.77 ఎకరాల వివాదా స్పద స్థలం ఎవరిదన్నది తేల్చి చెప్పడానికి కోర్టు 16 పిటిషన్లను విచారించవలసి ఉంది. అవన్నీ హిందూ భక్తులవి, ముస్లిం భక్తులవి. అలా రామభక్తులు సుప్రీంకోర్టు వైపు చూస్తుంటే, ఇక్కడ తిరుమల వారసత్వ అర్చక భక్తులు ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ (టీటీడీ) .. కోర్టు తీర్పుపై ఎలా స్పందిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. టీటీడీలో సాధారణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు (65 ఏళ్లు) నిబంధన టీటీడీలో వారత్వంగా ఉన్న అర్చకులకు వర్తించదని హైదరాబాద్ హైకోర్టు ఈ నెల 14న తీర్పు చెప్పింది. తీర్పుకు కారణం ఉంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వారసత్వ అర్చకులుగా ఉన్న శేషాద్రిని, మురళిని అరవై ఐదేళ్లు నిండిన కారణంగా విధుల్లోంచి విరమింప చేస్తున్నట్లు ఈ ఏడాది జూన్‌లో టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. (తిరుచానూరు ఆలయ నిర్వహణ కూడా టీటీడీ కిందికే వస్తుంది). టీటీడీ పరిధిలో ఇలా వారసత్వ అర్చకత్వంలో నాలుగు కుటుంబాలు ఉన్నాయి. వాటిల్లో టీటీడీ ప్రధాన అర్చకులుగా పని చేసిన రమణ దీక్షితులు కుటుంబం కూడా ఒకటి. టీటీడీ ఇచ్చిన పదవీ విరమణ ఉత్తర్వులపై శేషాద్రి, మురళి కోర్టును ఆశ్రయించిన ఈ కేసులోనే.. టీటీడీ తీర్మానాలు ఇలా ప్రత్యేకమైన కేటగిరీలో ఉన్న అర్చకులకు వర్తించవు అని కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పును శిరసావహించి ఆ ఇద్దరినీ, వారితో పాటు తన రిటైర్మెంట్ రూల్స్ పరిధిలోకి వచ్చిన రమణ దీక్షితుల్ని టీటీడీ తిరిగి తీసుకుంటుందా, లేక తను కూడా వాదన మొదలు పెడుతుందా? ఇప్పటికింకా నిర్ణయమైతే జరగలేదు. దేవుడి కోసం ఇంతలా ఎప్పుడూ భక్తులు తపించి పోలేదు. అయోధ్య రాముడి కోసం రాజకీయ భక్తులు, శబరిమల అయ్యప్ప కోసం కోర్టు తీర్పు భక్తులు, షిర్డీ సాయి కోసం న్యూ ఇయర్ భక్తులు, తిరుమల శ్రీవారి కోసం బలవన్విరమణ అర్చక భక్తులు.. వీళ్లంతా క్రిస్మస్ తాత మోసుకొచ్చే కానుకల మూట కోసం నిన్న మొన్నటి వరకు ఎదురు చూసిన పసి పిల్లల్లా ఆశగా వేచి ఉన్నారు. అందరికీ అన్నీ లభించాలి. అగునుగాక. తథాస్తు. ఆమెన్. ∙మాధవ్ శింగరాజు ∙ -
శిరిడి సాయి ఫస్ట్‌లుక్ విడుదల
సాక్షి బెంగళూరు: ప్రత్యక్ష దైవం శిరిడి సాయి సినిమా ఫస్ట్ లుక్‌ను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ పి.సునీల్ కుమార్ శనివారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సినిమాలో శిరిడి సాయిబాబాగా మచ్చా రామలింగారెడ్డి(ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు) నటిస్తున్నారు. ప్రముఖ నటీనటులు సీత, భానుచందర్, విజేత, సతీశ్, నాగకర్, రజనీ, శశికళ, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. చిత్రాన్ని కన్నడ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. ఉభయ భాషల్లో వస్తున్న శిరిడి సాయిబాబా చిత్రం విజయవంతం కావాలని, ప్రతి ఒక్క సాయి భక్తుడికి ఈ సినిమా ఒక అనుభూతి ఇవ్వాలని సీపీ ఆకాంక్షించారు. రామలింగారెడ్డి మాట్లాడుతూ కన్నడలో ఆడియో ఫంక్షన్ ఈ నెలలోనే బెంగళూరులో నిర్వహిస్తామన్నారు. భక్తుల అనుభవాలతో పాటు సాయిబాబా లీలలను ఈ చిత్రంలో చూపించినట్లు దర్శకుడు సత్యం తెలిపారు. కోడైరెక్టర్ రవిరాజ్, నిర్మాతలు వెంకట్ పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితాలో షిర్డీ సాయిబాబా పేరు
షిర్డీ: అహ్మద్‌నగర్ జిల్లాలో ఈసీ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఓ గుర్తుతెలియని వ్యక్తి అసాధారణ రీతిలో షిర్డీ సాయిబాబా పేరును స్ధానిక అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రయత్నించాడు. ఆన్లైన్ ఫామ్స్‌ను తనిఖీ చేస్తున్న సమయంలో దీన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సాయిబాబా చిరునామాగా షిర్డీ ఆలయాన్ని పేర్కొన్నట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఐటీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయిబాబా పేరును ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఫామ్ నెంబర్ 6ను నింపడం ద్వారా ఓ వ్యక్తి ప్రయత్నించాడని, ఫాంలను పరిశీలిస్తుండగా ఈ విషయం వెలుగుచూసిందని అధకారులు తెలిపారు. ఈ కేసును తొలుత అహ్మద్‌నగర్ జిల్లా సైబర్‌క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించిన పోలీసులు రహతా పోలీసులకు తిరిగి బదలాయించడంతో దర్యాప్తులో జాప్యం జరిగిందని పోలీసులు వెల్లడించారు. 2017 డిసెంబర్ 4న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. షిర్డీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సాయిబాబాను ఓటర్‌గా నమోదు చేయించేందుకు ఆన్లైన్ రిజిస్ర్టేషన్ సిస్టమ్‌ను ఆశ్రయించిన వ్యక్తి సాయిబాబా వయసు 24 సంవత్సరాలుగా పేర్కొన్నాడని, తండ్రి పేరు రామ్‌గా ఉటంకించాడని, చిరునామాగా షిర్డీ ఆలయాన్ని ప్రస్తావించాడని అధికారులు తెలిపారు. -
సాయి యోగ్యశక్తి
షిర్డీ గ్రామంలో ఏ రోజుకారోజు సాయి స్వయంగా అందరు అంగడులవారి వద్దకి వెళ్లి, మసీదులో, మరికొన్ని ప్రదేశాల్లో దీపాలని వెలిగించవలసి ఉందని చెప్పి నూనెని అడగడం చేస్తుండేవాడు. అందరూ కూడా సాయి గొప్పదనాన్ని విని ఉండటం, చూస్తూ ఉండటం కారణంగా ఎవరూ కాదనకుండా యథాశక్తి నూనెని దీపాల నిమిత్తం ఇస్తూనే ఉండేవాళ్లు. అంతా సవ్యంగా జరిగిపోతూ ఉంటే చెప్పుకోవాల్సిందంటూ ఏముంటుంది? సాయి అంటే కిట్టనివాళ్లు కొందరు పగ అనే వత్తిని, ద్వేషమనే నూనెలో తడిపి, వ్యతిరేకత అనే దీపాన్ని వెలిగించారు అంగడిదారుల బుద్ధులందరిలో. అంతే! ఎవ్వరూ కూడా నూనెని సాయికి ఇవ్వరాదని తీర్మానించుకున్నారు. ‘అంతమంది భక్తులొస్తున్నారుగా!? అందరిలో ఎవరో ఒకరితోనో, లేదా అందరితోనో నూనెని ఏర్పాటు చేసుకోలేడా?’ అని కొందరు, ‘అయినా మసీదులో కిరసనాయిలతో వెలిగే లాంతర్లు ఉండగా, ఈ నూనె దీపాలని కూడా వెలిగించాల్సిన అవసరమేమిటి?’ అని ఇంకొందరు, ‘ఇదంతా కాదు. మసీదేమిటి? హిందూ ఆచారం ప్రకారం నూనె దీపాలు వెలిగించడమేంటి?’ అని మరికొందరు మాట్లాడుకోసాగారు. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు అనుకుని, సాయికి నూనె ఇవ్వరాదని తీర్మానించుకున్నారు. ఎప్పటిలానే సాయి నూనె కోసం వస్తే, వ్యాపారస్థులంతా ముభావంగా ఉండటం, ముఖం తిప్పుకోవడం, అయిష్టంగా ఇవ్వదలచడం, రేపటిరోజున రండి అనడం వంటివేం చెయ్యలేదు. ముఖానే చెప్పారు ఇవ్వడం సాధ్యంకాదని. ఇలాంటి అకస్మాత్ వ్యతిరేకతకు సాయి ఏ మాత్రం దుఃఖపడలేదు. వ్యతిరేకత సామూహికమైనందుకు అశ్చర్యపడలేదు. తన మసీదుకి తిరిగొచ్చేశాడు. తన దగ్గరున్న డబ్బాలో అట్టడుగున ఉన్న నూనెలో నీటిని పోశాడు. కలియదిప్పాడు డబ్బాని. ఆ నూనె, నీరు కలిసిన మిశ్రమాన్ని తాగి ఊశాడు. ఆ మీదట నిండుగా నీటిని డబ్బాలో నింపాడు. ఆ నీటినే వత్తులు ఉన్న ప్రమిదల్లో నిండుగా పోశాడు. ఎవరికీ ఏం అర్థంకాని స్థితిలో నూనె దీపాలులాగానే వాటిని క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వెలిగించసాగాడు. అలా వెలిగిన నీటి దీపాలు రాత్రి రాత్రంతా కాంతిని ఇస్తూనే, వెలుగుతూనే ఉండిపోయాయి. ఇది అందరూ చూస్తుండగా జరిగిన కథ కాదు, చరిత్ర. విశ్వనిర్మాణ రహస్యం ఏదైనా ఒక వస్తువు మరమ్మతుకి గాని వస్తే దాన్ని బాగు చేయవలసిన వానికి, ఆ వస్తువుకి సంబంధించిన, మొత్తం నిర్మాణానికి సంబంధించిన అంత సమాచారం ఎలా తెలిసి ఉండాలో, అదే తీరుగా విశ్వంలో జరిగిన ఈ విచిత్రానికి సంబంధించిన నిజానిజాలు తెలియాలంటేనూ, దాన్ని వివరించి చెప్పాలంటేనూ ఆ విశ్వానికి సంబంధించిన నిర్మాణ రహస్యం తెలిసి ఉండి తీరాల్సిందే కదా! ఆ దృష్టితో చూస్తే పృధ్వి – అప్ – తేజస్ – వాయు – ఆకాశం అనే ఐదింటితో ఈ జగత్తు ఏర్పడింది కాబట్టే దీన్ని ‘ప్ర–పంచము’ (ఐదింటి సమాహారం) అన్నారు. ఇది బ్రహ్మ చేత నిర్మింపబడింది కాబట్టి, బ్రహ్మకి మాత్రమే దీన్ని సృష్టించే అధికారాన్ని ఇచ్చారు కాబట్టి దీన్ని బ్రహ్మా+అండము ‘బ్రహ్మా అనే దీర్ఘం చివర ఉంటే పురుషుడైన బ్రహ్మ’ అని అర్థం. అదే ‘బ్రహ్మ+అండము’ అన్నట్లయితే స్త్రీ పురుష భేదం లేని బ్రహ్మపదార్ధమనే అర్థం వస్తుంది. ఈ జగత్తుని సృష్టించగల అధికారాన్ని పురుషుడైన బ్రహ్మే పొందాడు కాబట్టి ‘బ్రహ్మా+అండము’ అనేదే సరైన పదవిభాగం. అలాంటి బ్రహ్మ చేత సృష్టించబడిన ‘అండం’ ( స్త్రీయో, పురుషుడో తెలియని స్థితిలో ఉండే ముద్ద – ప్రాణియో, అప్రాణియో తెలియని స్థితిలో ఉండే ముద్ద) కాబట్టి దీన్ని బ్రహ్మాండము అన్నారు. ఈ బ్రహ్మాండమే జగత్తంతా. దీనికి సరైన పోలికతో ఉండేది మనం. మనందరం తల్లి గర్భంలో ఉన్న పిండం నుంచి పుట్టాం కాబట్టి మనం ‘పిండాండం’ నుంచి పుట్టినవాళ్లం. బ్రహ్మాండానికి ఎలా పంచభూతాలు సహకరించాయో అలాగే పిండాండానికి కూడా పంచభూతాలు సహకరించి ఉన్నాయి. అంటే బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాలు, పిండాండంలో కూడా ఉండనే ఉన్నాయన్నమాట! బ్రహ్మాండంలోని ‘పృ«థ్వి’ మనకి కన్పించే నేల. పిండాండం అంటే మనలో పృ«థ్వి మన శరీరంలో ఉన్న మాంసం, మజ్జ అనేవి. బ్రహ్మాండంలోని ‘అప్’ మనకి కన్పించే నదులు, సముద్రాలు అన్నీను. పిండాండం అంటే మనలో ‘అప్’ మన శరీరంలోన ఉన్న నీరు. రక్తంలో ఎక్కువశాతం నీరే. బ్రహ్మాండంలోని ‘తేజస్’ (వేడిమి) మనకి కన్పించే సూర్యుని ఉష్ణత. పిండాండంలో కన్పించే ‘తేజస్’ మన శరీరంలో ఎప్పుడూ ఒకేలా ఉండే 98.4 డిగ్రీల వేడిమి. బ్రహ్మాండంలోని ‘వాయువు’ మనకి అనుభవంతో కన్పించే వాయువు. పిండాండంలో అంటే మన శరీరంలో (5+5) దశవిధాలైన వాయువులు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన మొదలైనవి ఉన్నాయి. బ్రహ్మాండంలోని ‘ఆకాశం’ మనకి కన్పిస్తున్నట్లుగా ఉంటూ ఎంత దూరం వెళ్లినా కన్పించని శూన్యమైన పదార్థం. ఇక పిండాండంలో ఉండే ఆకాశమంటే అనుభవంలో కన్పిస్తూ ఎవరూ చూడడానికి అవకాశం లేని మనస్సు. ఇలా బ్రహ్మాండ – పిండాండాలు అనే రెండూ పరస్పరం సమానంగా ఉంటూ రెంటి స్వభావం, స్వరూపం ఒకటే అయినా ఆ రెండూ వేర్వేరుగానే ఉంటాయి. ఒకటిగా ఉండలేవు. ఉండవు. ఇదంతా ఎందుకంటే ఈ పంచభూతాలు పైకి వేర్వేరుగా కన్పిస్తున్నా అన్నీ ఆకాశం నుంచి వచ్చాయని చెప్పడానికి. తద్వారా నీటిని గురించిన, అలాగే అగ్నిని గురించిన తత్వాన్ని తెలుసుకుని నీటిలో అగ్నితనం ఎలా ఉంటుందో నిరూపించడానికీను. ఆకాశాద్వాయుః – ఆకాశం నుండి వాయువు పుట్టింది. ‘గాలి బిగదీసింది’ అంటూ ఉంటాం. అంటే ఆకాశం ఆ సమయంలో తన శూన్య ప్రదేశం నుండి వాయువుని విడుదల చేయడం లేదని అర్థమన్నమాట. అంతే కాక వాయువెప్పుడూ శూన్యం నుండే వస్తుందని కూడా భావమన్నమాట. వాయో రగ్నిః – ఇలా వచ్చిన వాయువు నుండే అగ్ని పుట్టిందని దీనర్థం. ఇదేమిటి? ఎక్కడైనా నిప్పుంటే ఆ సమయంలో గాలి బలంగా వీస్తే నిప్పు ఆరిపోతుందిగా!? అని అనుకుంటాం మనం. నిప్పు ఆరిపోవాలన్నా, బాగా రాజుకుని నిప్పు మరింతగా పెరిగి, తన ప్రతాపాన్ని చూపాలన్నా వాయువు వీచినప్పుడే అని అనుకోం. దానికి కారణం సాధారణమైన దృష్టితో ఆలోచించడమే. లో–దృష్టితో పరిశీలించకపోవడమే!!అగ్నే రాపః – ఆ అగ్ని నుంచి నీరు పుట్టిందని దీనర్థం. ఇదేమిటి? ఇది మరీ వింతగా ఉంది! అనిపిస్తుంది. అగ్ని అనేది నీటిని వేడి చేస్తుంది. అలాగే నీరు అనేది నిప్పుని ఆర్పుతుంది. అంతేతప్ప అగ్ని నుండి నీరు పుట్టడమేమిటి? అన్పిస్తుంది. దీనికి కూడా కారణం సాధారణ దృష్టితో మాత్రమే చూడడం. లో–దృష్టి పెట్టాలనే ఆలోచన కూడా లేకుండా ఉండడమూనూ. అబ్భ్యః – పృధ్వి అలాంటి నీటి నుండి నేల పుట్టిందని దీనర్థం. ఎక్కడైనా నేల అనేది కణాలు కణాలుగా ఉంటే ఆ భూకణాలని తొలగించడానికి దూరంగా నెట్టివేయడానికీ నీటిని వాడతాం తప్ప నీటి నుండి భూమి ఎలా పుట్టే వీలుంది? అన్పిస్తుంది. దీనికి కూడా సమాధానం సాధారణ దృష్టితో ఆలోచించడమే తప్ప లో–దృష్టిని పెట్టకపోవడమే అనేదే. అంటే ఏమన్నమాట? నీటితో దీపాల్ని వెలిగించడం వంటి అనూహ్యమైన, ఎన్నడూ వీలుకాని సంఘటనలని విన్నట్లయితే, చూసినట్లయితే సాధారణ దృష్టితో కాకుండా లో–దృష్టితో పరిశీలించి తీరాల్సిందే అని దీని భావమన్నమాట! మరొక్క మాటని అనుకుని సమాధానాన్ని తెలుసుకుందాం! మన శరీరానికి నవ(9) రంధ్రాలున్నాయి. రంధ్రం అంటే కన్నం లేదా చిల్లు అని కదా అర్థం. మరి ఈ తొమ్మిదింటి నుంచి శరీరంలోకి మనం నీటిని పంపినా, అన్నాన్ని పంపినా, మరి దేన్ని తిన్నా వెంటనే అన్నీ కన్నాల నుండి లేదా ఏవో ఒకటో రెండో కన్నాల నుంచి బయటికొచ్చేయాలి కదా! అనుకుంటాడు సామాన్య దృష్టి మాత్రమే ఉన్నవాడు. సహజంగా పిల్లలు ఈ ప్రశ్నని చిన్నపిల్లలు అడిగే ఉన్నారు కదా! దాన్ని వివరించి చెప్తేగదా వాడు ఆ రోజున అర్థం చేసుకోగలిగాడు! ఇదే తీరుగా పంచభూతాల్నీ వివరించుకోకుండా (అసందర్భం అవుతుంది కాబట్టి) నీటిని గురించి మాత్రమే అనుకుందాం! నీరు అనేది ‘అగ్నేరాపః’ నిప్పునుంచి పుట్టిందే. అయితే ఈ నీరు నిప్పుని ఆర్పగల శక్తితో కన్పిస్తోంది. లౌకికంగా ముందు ఒక సమాధానాన్ని చూద్దాం! నీటిని బాగా వేడి చేశాం. వేడి నీళ్లు అయ్యాయి. మనం ముట్టుకుంటే మన శరీరభాగం కాలేంతటి నిప్పుదనం (ఉష్ణత) ఆ నీటికి పట్టుకుంది. అవును కదా! ఆ నిప్పుదనంతో నిండిన నీటిలోనికి నీళ్లని ఎక్కువగా పంపితే... పూర్తి ఉష్ణతని కోల్పోయి మళ్లీ చల్లబడిపోయి, వేడిమి చేయడానికి ముందు ఏ చల్లదనంతో ఉన్నాయో ఆ స్థితికే వచ్చేస్తాయి నీళ్లు. అంతే కదా! ఇప్పుడు నీళ్లు అనేవి ఎలా ఏర్పడ్డాయో ఈ ఉదాహరణతో గమనిద్దాం! నీళ్లు అనేవి రెండు వాయువుల కలయిక వల్ల ఏర్పడి వాయురూపాన్ని మార్చుకుని, ద్రవరూపాన్ని పొందాయి. వాయువులు రెండు కలిస్తే ఆ పదార్థం వాయువే కావలసి వస్తూంటే ఆ రెండు వాయువుల సమ్మేళనం ద్రవంగా (నీరు) కావడమేమిటి? ఇక్కడే ఉంది రహస్యం. పంచభూతాలు వేటికి అవిగా ఉన్నప్పుడు చెప్పుకోవలసిందంటూ ఏమీ ఉండదు. పృధ్వి(నేల)+అప్(నీరు) = ప్రవాహం అప్(నీరు)+ తేజస్(ఉష్ణత) = వేడి నీరు తేజస్(ఉష్ణత)+ వాయువు(గాలి) = వేడిగాలి(గాడుపు) వాయువు + ఆకాశం = శూన్యం (కన్పించని ఆకాశం) ఇదే తీరుగా ఉష్ణతని కలిగించే శక్తి ఉన్న వాయువు (ఆక్సిజన్) మరో ఉష్ణత ఏమాత్రం ఉండని వాయువుతో (హైడ్రోజన్) కలిసినట్లయితే ఆ రెంటి సంయోగం ‘నీరు’గా మారుతుంది. (ఏ2+ౖ2 ఏ2ౖ అని తీర్మానించారు విజ్ఞాన శాస్త్రజ్ఞులు). పైన చెప్పుకున్న ఉదాహరణలో వేడిగా ఉన్న నీళ్లలో చన్నీళ్లని అతిమాత్రంగా కలిపితే ఎలా ఆ వేన్నీళ్లు కాస్తా చల్లబడిపోతాయో, అలా ఈ ఉష్ణత కలిగిన గాలి(ఆక్సిజన్) అలాగే ఉష్ణతలేని గాలి(హైడ్రోజన్) అనే రెంటి సంయోగంలో తీవ్రమైన ఉష్ణతకల వాయువు (ౖ2 లేదా ఆక్సిజన్) అనేది మరింత స్థాయి కలిగినదైన పక్షంలో నీరుగా కన్పిస్తున్న ఈ పదార్థానికి మండించగల శక్తి మాత్రమే ఎక్కువ అయి, ఆ నీరు దేన్నైనా మండించగలిగిందిగా అయిపోతుంది. ఇది నిజం కాబట్టే సాయి ఎప్పుడైతే నీటిని తెచ్చాడో, ఆ నీటిలో మండించగల ఉష్ణతాశక్తిని తన యోగశక్తితో పెంపొందేలా (అభివృద్ధి అయ్యేలా) చేసాడో వెంటనే ఆ నీరు తనలోని చల్లదనాన్ని కోల్పోయి, తనలో ఉన్న రెండవదైన ఉష్ణతాశక్తి ఆధిక్యంతో ఉండిపోయింది. అంటే నిప్పుగా అయింది. గుడ్డతోనో, పత్తితోనో చేయబడిన వత్తికి ఉన్న నూనె అనేది మండే అవకాశాన్నిచ్చేది కాబట్టి, ఈ నీటిలో ఉన్న దహించే శక్తి ఆ వత్తికంటుకుని దీపంగా వెలగడం ప్రాంభించింది. అయితే ఇక్కడ ‘మరి సాయి గొప్పదనమేంముంది?’ అనుకోకూడదు. తన యోగశక్తి ద్వారా సాయి నీటిని రెండు వాయువులుగా విభజించేసి, రెండవదైన ఉదజని (హైడ్రోజన్) శక్తిని పూర్తిగా కోల్పోయేలా చేసి ప్రాణశక్తిని (ఆక్సిజన్) మరింత పెంపుచేసి ఉండడమే. ఇలాంటిదే మరో ఉదాహరణ. శ్రీమద్రామాయణంలో ఆంజనేయస్వామి తోకకి రావణుని సేనలైన రాక్షసులు నిప్పు పెట్టారు. రావణ ఆజ్ఞకి అనుగుణంగా ఆంజనేయస్వామి ఆ తోకకున్న నిప్పుతో మొత్తం లంకని తగులబెట్టాడని చెప్పింది ఆ ఇతిహాసం. అంతవరకూ బాగానే ఉంది. మరి నిప్పుకి కాల్చివేయడమనేది లక్షణం కాబట్టి, ఆ ఆంజనేయస్వామి తోకకి ఉన్న నిప్పు లంకాజనాన్ని మంటలకి గురి చేసి చంపినట్లే. ఆంజనేయస్వామి శరీర భాగాలకు కూడా వ్యాపించి ఎందుకు ఆంజనేయుడ్ని గాయపరచలేదనేది ప్రశ్న కదా! సాయి కథలో నీటి నుండి నిప్పు కన్పిస్తూంటే, ఆ నిప్పుద్వారా వత్తులన్నీ మండి వెలుగుతుంటే, ఇక్కడ నిప్పులోని నిప్పుదనం(ఉష్ణత) లేకుండా ఆంజనేయునికి చల్లదనం గోచరించడమేమిటి? ఇక్కడ కూడా లోతుగా ఆలోచిస్తే తప్ప సమాధానం దొరకదు. దొరికినా మరింత లోతుగా భావిస్తే తప్ప ఆ సమాధానం అర్థం కాదు. నీటికుండే లక్షణం చల్లదనం. (శీతస్పర్శవత్య ఆపః) అలాగే నిప్పుకుండే లక్షణం ఉష్ణత. (ఉష్ణస్పర్శవత్తేజః) నీటికుండే చల్లదనాన్ని వేడిగా మార్చి దీపాలని వెలిగేలా చేస్తే, సీతమ్మ తన మంత్రశక్తితో అగ్నికుండే ఉష్ణతని చల్లబరిచింది. రెంటికీ ఎంత సామ్యముందో గుర్తించగలగాలి. గుర్తుంచుకోగలగాలి కూడా! ఏ చల్లదనమనేది లేని పక్షంలో దాన్ని నీరు అనమో, ఏ ఉష్ణత లేని పక్షంలో దాన్ని అగ్ని అనమో, చల్లదనమనేది నీటితో కలిసి మాత్రమే ఉంటుందో అలాగే వేడితనమనేది నిప్పుతో కలిసి మాత్రమే ఉంటుందో అలా కలిసి ఉన్న రెంటిలో నుంచి ఒకదాన్ని వేరు చేయడమనేది మంత్రశక్తితోనే సాధ్యం! ఆ మంత్రశక్తి అనేది దేవతల్లో ఉంటే ఆ దేవతలని ప్రార్థించి ప్రార్థించి ఉన్న కారణంగా ఆ తపస్సు శక్తే వ్యక్తుల్లో యోగశక్తిగా మారుతుంది. ఆ యోగశక్తి ఉన్న వ్యక్తి యోగిగా మారుతాడు. తనకున్న ఆ యోగశక్తి కారణంగానే ఇలాంటి లోకాతీతమైన కొన్నింటిని చేయగలుగుతాడు. శంకరాచార్యులవారు రాసిన సౌందర్యలహరిలో ఓ శ్లోకం (మహీం మూలాధారే..)లో యోగశక్తి గురించి మరింత వివరంగా కన్పిస్తుంది. మూలాధార చక్రాన్ని బాగా ఉపాసించినట్లయితే భూమిలోపల దాగి ఉండగల శక్తిని సాధకుడు సంపాదించగలడట. కపిల మహర్షి అలాగే తపస్సు చేస్తూ ఉండిపోయాడు. సగరుని పుత్రులైన అరవై వేల మందిని భస్మం చేసింది ఆ యోగశక్తితోనే. అలాగే మణిపూరక చక్రాన్ని బాగా ఉపాసించినట్లయితే నీటిని గురించిన మహాశక్తిమంతుడవుతాడు. దాంతో నీళ్లలో దాగి ఉండగలుగుతాడు. దుర్వాసో మహర్షి అలాగే తపస్సు చేసి ఆ యోగశక్తితోనే అంబరీషుని మీదికి కృత్య అనే రాక్షసిని పంపగలిగాడు. ఇదే తీరుగా మిగిలిన ఐదు చక్రాలనీ కూడా ఉపాసించినట్లయితే.. ఆయా లోకాతీత శక్తులు లభిస్తాయి ఉపాసించినవారికి. సాయి ఎవరితో మాట్లాడుతూ ఉన్నట్లు కన్పించినా నిరంతరమైన తన ఏకాగ్రతతో కూడిన ఉపాసన సాగిపోతూనే ఉంటూ ఉండేది. కాబట్టి అన్ని శక్తులు ఆయనకి లభించాయి. అంతటి శక్తిమంతుడు కాబట్టే కుల, మత, వర్గ, స్త్రీ, పురుష, బాల, వితంతు... వంటి భేదాలు ఆయనకి లేనే లేవు. అంతే కాక ఉరుసు – శ్రీరామనవమి జెండా ఉత్సవం, చందనోత్సవం వంటి ఈ ఆ మతాలకి సంబంధించిన పండుగలన్నీ ఆయనకి ఒకటిగానే అన్పించాయి, కన్పించాయి. మనకి మనం, అలాగే మన పక్కనున్న మరో కొంతమంది మాత్రమే కన్పిస్తాం గానీ పర్వతమెక్కిన వారికి అందరం కన్పిస్తాం! దాన్నే సమదృష్టి, సరైన దృష్టి అంటారు. - డా. మైలవరపు శ్రీనివాసరావు -
షిర్డీ సాయికి బంగారు పాదుకలు
ముంబై: గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఆగ్రాకు చెందిన సాయి భక్తుడు షిర్డీ సాయిబాబాకు రెండు కిలోల బంగారం పాదుకలు అర్పించారు. షిర్డీలో శనివారం నుంచి గురుపౌర్ణమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజున ఆగ్రాకు చెందిన అజయ్ గుప్తా, సంధ్య గుప్తా దంపతులు బంగారు పాదుకలు సమర్పించారు. ఇంతకుముందు సాయిబాబా కోసం 70 కిలోల వెండితో చేసిన సింహాసనాన్ని కూడా చేయించి కానుకగా సమర్పించారు. -
సాయిబాబా చరిత్రతో...
షిరిడీ సాయిబాబా జీవితం ఆధారంగా కొండవీటి సత్యం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిరిడీ సాయి’. సాయిబాబాగా మచ్చా రామలింగారెడ్డి నటించారు. క్రోసూరి సుబ్బారావు, ఎం.ఆర్. రెడ్డి, పి. వెంకట్, డి. శివప్రసాద్ నిర్మాతలు. ప్రస్తుతం డీఐ, 5.1 మిక్సింగ్ (సౌండ్ మిక్సింగ్) పనులు జరుగుతున్నాయి. చందూ ఆది ఆధ్వర్యంలో గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ‘‘సాయిబాబా చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి, ఈ సినిమా చేశాం’’ అని నిర్మాతలు అన్నారు. ప్రత్యేక పాత్రలను భానుచందర్, సీత చేశారు. విజేత కథానాయిక. ఈ చిత్రానికి కథ–మాటలు: దానం వెంకట్రావు, సంగీతం: కిషన్ కవాడియా, కెమెరా: వెంకట్. -
ఆయన గురువు... ఈయన కులదైవం
‘‘శిరిడీ సాయిబాబా మా గురువైతే, ఏడు కొండల వేంకటేశ్వరస్వామి మా కులదైవం. మా గురువుగారి కథతో ‘శిరిడిసాయి’ తీశా. ఇప్పుడు ఓ భక్తుడిగా మా వెంకన్నకి మాహాభక్తుడైన హథీరామ్ బాబా చరిత్ర ఆధారంగా ఈ చిత్రం నిర్మించా. నాకు ఈ అవకాశాలు కల్పించిన రాఘవేంద్రరావు, నాగార్జునలకు జీవితాంతం రుణపడి ఉంటా’’ అన్నారు నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి. ‘శిరిడిసాయి’ తర్వాత నాగార్జున,కె. రాఘవేంద్రరావు కలయికలో ఆయన నిర్మించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ ఈ నెల 10న రిలీజవుతోంది. మహేశ్‌రెడ్డి చెప్పిన విశేషాలు.... ► తిరుపతి కొండపై హాథీరామ్ బాబా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది? స్వామివారికి చేసే తోమాల సేవ, వెన్న సేవ తదితర అంశాల గురించి చిత్రంలో చూపించాం. స్వామివారికీ, హాథీరామ్ బాబాకీ మధ్య జరిగిన సంభాషణలు, ఆయన చరిత్రే ఈ సినిమా. స్వామివారిపై సినిమా తీయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఈ చిత్రంతో ఆ కోరిక తీరింది. ► ఇప్పుడున్న యువతకి స్వామివారి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. స్వామికి జరిగే పూజలు, విశిష్ఠత గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తీసిన చిత్రమిది. ‘ఓం నమో వేంకటేశాయ’ అనేది ఎన్నిసార్లు పలికితే అంత మంచి జరుగుతుంది. అందుకే, హాథీరామ్ బాబా చరిత్రకి ఆ పేరు పెట్టడం జరిగింది. ► ఓవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే, మరోవైపు ఈ ఆధ్యాత్మిక చిత్రం చేయడం నాగార్జున గొప్పతనం, మా అదృష్టం. వేరే చిత్రాలు అంగీకరించకుండా గడ్డం పెంచి, భక్తి శ్రద్ధలతో నాగార్జున ఈ చిత్రం చేశారు. తెరపై ఆయన్ని చూడగానే భక్తి భావంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చరిత్రలో నిలిచిపోయే విధంగా నటించారాయన. థియేటర్లో చూసిన ప్రేక్షకులకూ అదే భావన కలుగుతుంది. ► 500 ఏళ్ల క్రితం తిరుమల తిరుపతి ఏ విధంగా ఉండేదో... తెరపై ఆ వాతావరణం ప్రతిబింబించేలా చాలా జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరించాం. డీఓపీ ఎస్. గోపాల్‌రెడ్డి చిక్ మంగుళూరు, మహాబలేశ్వరంలలో లొకేషన్లు ఫైనలైజ్ చేశారు. కీరవాణి అద్భుతమైన స్వరాలందించారు. నాగార్జున–రాఘవేంద్రరావు కలయికలో భక్తి చిత్రమనగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం సహజం. వాటిని అందుకునే విధంగా దర్శకేంద్రులు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రం విడుదల తర్వాత తిరుపతి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతుంది. ► వ్యాపార దృక్పథంతో కాకుండా ఓ భక్తుడిగా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రం నిర్మించా. సాధారణంగా భక్తి చిత్రాలపై ఎవరూ ఇంత ఖర్చుపెట్టరు. మా ఎ.ఎం.ఆర్. గ్రూప్ సంస్థల్లో 4,000 మంది పనిచేస్తున్నారు. ఓ వ్యాపారవేత్తగా నేను కొందరికి తెలుసు. ‘శిరిడిసాయి’ విడుదల తర్వాత నా పేరు అందరికీ తెలిసింది. టీవీలో ఆ చిత్రం ప్రసారమైన ప్రతిసారీ 50, 60 ఫోనులు వస్తాయి. ఈ ‘ఓం నమో వేంకటేశాయ’కి ఇంకా మంచి పేరొస్తుంది. మా సంస్థ నిర్మించిన రెండూ భక్తి చిత్రాలే. మంచి కథలు లభిస్తే కమర్షియల్ చిత్రాలు కూడా నిర్మించాలనుంది. -
'బాబా చిత్ర పటాలు పూజ గదిలో ఉంచుకోవద్దు'
అనంతపురం కల్చరల్: ‘షిరిడీ సాయిబాబా ఓ ముస్లిం తెగకు చెందినవారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఆరాధిస్తూ చాలా మంది హిందువులు తప్పు చేస్తున్నారు. ఆయన చిత్రపటాలను పూజ గదిలో ఉంచుకోవద్ద’ని ద్వారకా శారద పీఠం అధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి సూచించారు. శనివారం అనంతపుర వచ్చిన ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా షిరిడీ సాయిని ఆరాధించడాన్ని వ్యతిరేకించడంతో పాటు ఆయన్ను పూజించబోమని, హిందూ ధర్మంతోనే ఉంటామని భక్తులతో ప్రమాణం చేయించారు. దీన్ని బాబా భక్తులు వ్యతిరేకించడంతో వివాదానికి దారితీసింది. సాయి భక్తుల నిరసన ఇదిలా ఉండగా జగద్గురు శంకరాచార్యస్వరూపానంద సరస్వతి షిర్డీసాయిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బాబా భక్తులు మండిపడ్డారు. సాయి సంఘం ప్రతినిధులు సాయినాథ్ మహరాజ్‌కీ జై అంటూ నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని పంపేయడంతో స్వామీజీ తన ఉపన్యాసం కొనసాగించారు. -
షిర్డీ సాయి చిత్రంతో... లిమిటెడ్ ఎడిషన్ వాచీ
♦ ధర రూ.3-4 లక్షలుండే అవకాశం ♦ రూపకల్పనలో స్విస్ కంపెనీ సెంచురీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఖరీదైన వాచీల తయారీలో ఉన్న స్విస్ కంపెనీ ‘సెంచురీ టైమ్స్ జెమ్స్’ భారతీయ దేవుళ్లను వాచీల్లో ప్రతిష్ఠించే పనిలో పడింది. ఇప్పటికే తిరుపతి వెంకటేశ్వర స్వామి చిత్రంతో కూడిన వాచీని ప్రవేశపెట్టి ఇక్కడి కస్టమర్లను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా షిర్డీ సాయినాథుని చిత్రంతో వాచీని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిసింది. మార్కెట్లోకి రావటానికి కొన్నాళ్లు పట్టొచ్చని రోడియో డ్రైవ్ మార్కెటింగ్ ప్రతినిధి సంజీవ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు వెల్లడించారు. ధర రూ.3-4 లక్షలు ఉండే అవకాశం ఉందన్నారు. లిమిటెడ్ ఎడిషన్‌లో భాగంగా మొత్తం 2,000 వాచీలను మాత్రమే సెంచురీ ద్వారా తయారు చేయిస్తామన్నారు. సెంచురీ వాచీలను ప్రమోట్ చేసేందుకు ప్రతి నగరంలో ఒక ప్రముఖ ఆభరణాల సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని అన్నారు. వాచీల విక్రయంలో ఉన్న బెంగళూరుకు చెందిన రోడియో డ్రైవ్ భాగస్వామ్యంతో సెంచురీ భారత్‌లో ప్రవేశించింది. వాచీల ధర రూ.3 లక్షలు-2 కోట్ల వరకు ఉంది. బాలాజీ వాచీలు 32 అమ్మకం.. సెంచురీ టైమ్స్ జెమ్స్ 2013లో వెంకటేశ్వరుడి చిత్రంతో కూడిన వాచీని ఆవిష్కరించింది. ఇప్పటి వరకు 32 అమ్ముడయ్యాయి. వీటిలో 18 వాచీలను తెలుగు రాష్ట్రాలకు చెందిన కస్టమర్లు ద క్కించుకున్నారు. 11 వాచీలు కర్నాటక, 3 వాచీలు తమిళనాడుకు చెందిన వారు కొనుగోలు చేశారు. విడుదలైనప్పుడు ధర రూ.27 లక్షలుంటే, ఇప్పుడు రూ.29 లక్షలుంది. లిమిటెడ్ ఎడిషన్‌లో భాగంగా 333 వాచీలనే రూపొందించారు. డయల్‌ను మెటాలిక్ తెలుపు రంగులో అందంగా తీర్చిదిద్దారు. డయల్ వెనుకవైపు గోపురం ఆకారాన్ని ఉంచారు. 18 క్యారట్ల రెడ్ గోల్డ్‌ను వాచీ తయారీకి వాడారు. 34 పచ్చలు, 34 కెంపులు, 13 వజ్రాలు వాచీకి అందాన్ని తెచ్చిపెట్టాయి. వాచీల విక్రయ ఆదాయంలో కొంత మొత్తాన్ని టీటీడీకి చెందిన బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రిసర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ద డిసేబుల్డ్కు ఇస్తున్నారు. -
సాయిబాబా మహిమలతో...
షిర్డీ సాయి మహిమలను తెలిపే కథతో శ్రీ మల్లాది వెంకటేశ్వరా ఫిలింస్ సంస్థ నిర్మించిన చిత్రం ‘సాయే దైవం’. 28 ఏళ్ల క్రితం ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’లో సాయిబాబాగా నటించిన విజయ్ చందర్ మరోసారి ఆ పాత్రలో నటించిన చిత్రం ఇది. చిత్రదర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘కొందరు భక్తులు వివరించిన సాయి మహిమలనే కథగా మార్చి ఈ సినిమా చేశాం. అద్భుతమైన ఆ మిహ మలు ప్రేక్షకులను పులకరింపజేస్తాయి. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మళ్లీ సాయి బాబా పాత్రలో నటించడం నా అదృష్టం’’ అని విజయ్‌చందర్ అన్నారు. -
కన్నుల పండువగా గురుపౌర్ణమి వేడుకలు
పోటెత్తిన భక్తజనం అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, అన్నదానం సిద్దిపేట టౌన్: పట్టణంలోని షిరిడీ సాయి మందిరంలో శనివారం గురుపౌర్ణమి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. వేకువజామున బాబాను ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం హారతి, క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం వర్షాల కోసం జలాభిషేకం చేశారు. దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనిపించింది. భక్తులకు బాబా ప్రసాదాన్ని అందజేశారు. గంటల తరబడి క్యూలో నిలుచొని స్వామిని దర్శించుకున్నారు. వేలాది మందికి అన్నదానం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు మందిరం భక్తులతో కిటకిటలాడింది. భక్తిశ్రద్ధలతో శతకోటి సాయినామ మహాయజ్ఞం నిర్వహించారు.కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండ కృష్ణమూర్తి, అధ్యక్షుడు గందె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కార్యదర్శి టీ నర్సయ్య, సహాయ కార్యదర్శి రాజమౌళి, కోశాధికారి నల్ల శివానందం తోపాటు పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
సాయిసమరం
-
కారులో దిగిన బాబా!
తమ కష్టాలు తీర్చేందుకు కలియుగంలో మానవ రూపంలో అవతరించిన భగవంతుని ప్రతిరూపంగా షిర్డీ సాయినాధుని భక్తులు కొలుస్తుంటారు. బాబాను నమ్మిస్తే తమ ఈతిబాధలన్నీ రూపుమాపుతాడని బలంగా విశ్వసిస్తుంటారు. అలాంటి వారికి మరింత నమ్మకం కలిగించే ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. జహీరాబాద్‌లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.. జహీరాబాద్ ఈడెన్ కాలనీలోని షిర్డీ సాయి మందిరం దగ్గర ఈ నెల 10న ఉదయం 9 గంటల సమయంలో ఓ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి సాయిబాబా వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి దిగాడు. నేరుగా గుడిలోకి నడుచుకుంటూ వెళ్లి పూజారితో మాట్లాడాడు. సాయికి హారతివ్వమని కోరాడు. అనంతరం హారతి కళ్లకు అద్దుకున్నాడు. ఆలయ ప్రాంగణంలో ఆయన తిరుగాడాడు. భక్తులతో ముచ్చటించాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంతకీ ఆరా తీస్తే.. అతను తెనాలికి చెందిన సాధువుగా గుర్తించారు. ఆ దృశ్యాలను మీరే చూడండి. -
సాయిలీల
-
బెదిరింపు లేఖ చివర్లో 'ఇస్లామ్ జిందాబాద్' అన్న రాతలు
-
షిర్డీ సంస్ధానానికి బెదిరింపు లేఖల కలకలం
-
మహా సమాధి ఉత్సవాలు
షిర్డీ, న్యూస్‌లైన్: షిర్డీ సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి 14 వరకు ‘95వ మహా సమాధి’ (పుణ్యతిథి) ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంస్థాన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మోరే కోరారు. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు 12న ఉదయం 4.30 గంట లకు కాకడ్ హారతి, ఐదు గంటలకు బాబా చిత్రపటం ఊరేగింపు, 5.15 గంటలకు ద్వారకామాయి లో బాబా సచ్ఛరిత పారాయణ పఠనం ఉంటుందన్నారు. ఆ తర్వాత బాబాకు మంగళ స్నానాలు, దర్శనాలు ఉంటాయని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న హారతి, తీర్థ ప్రసాదాల పంపిణీ, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు భజనలు, కీర్తనలు ఉంటాయని చెప్పారు. ధూప హారతి, రాత్రి ఏడున్నర నుంచి సాయినగర్ మైదాన్‌లో వివిధ కళాకారుల కార్యక్రమాలుంటాయని మోరే వివరించా రు. షిర్డీ పుర వీధుల్లో రాత్రి 9.15 గంటలకు బాబా పల్లకీ ఊరేగింపు ఉంటుందన్నారు. రాత్రి 10.30 గంటలకు శేజారతి ఉంటుందని చెప్పారు. మొదటిరోజు కావడంతో ద్వారకామాయిలో రాత్రంతా పారాయణ పఠనం చేసేందుకు వీలు కల్పిస్తామన్నారు. 13న కాకడ్ హారతి, అఖండ పారాయణ సమాప్తి, బాబా చిత్రపటం ఊరేగింపు, మంగళ స్నా నం, తర్వాత దర్శనానికి భక్తులను అనుమతించడం యథావిధిగా ఉంటుందని తెలిపారు. ఇక ఉదయం తొమ్మిది గంటల నుంచి భిక్షాటన, భజనలు, ఆరాధన తదితర కార్యక్రమాలుంటాయన్నారు. మధ్యాహ్నం హారతి, సాయంత్రం ఖండో బా మందిరం నుంచి ఊరేగింపు, ధూప హారతి, రాత్రి బాబా పల్లకీ ఊరేగింపు ఉంటుందని తెలిపారు. ఉత్సవాల చివ రి రోజున 14వ తేదీ ఉదయం ఐదు గంటలకు మం గళస్నానం, అనంతరం దర్శనం, మధ్యాహ్నం హారతి, తీర్థప్రసాదాలు పంపిణీ, సాయంత్రం ధూప హారతి, రాత్రి ఆలయ సమీపంలోని వేదికపై స్థానిక కళాకారులతో వివిధ భక్తి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. 9.15 గంటలకు ఊరేగింపు, 10.30 గంటలకు శేజారతి ఉంటుందన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించామని తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అందించే వీఐపీ పాస్‌లు, దర్శనాలు, ఇతర కార్యక్రమాలన్నింటిని రద్దు చేయనున్నామని మోరే వెల్లడించారు. -
షిర్డీసాయి ఆలయంలో చోరీ యత్నం
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: పట్టణంలోని ద్వారకానగర్ షిర్డీసాయి ఆలయంలో దుండగులు చోరీకి ప్రయత్నించారు. కాపలాదారు అప్రమత్తంగా ఉండడంతో వారు పారిపోయారు. సోమవారం రాత్రి కొందరు దుండగులు మత్స్యశాఖ కార్యాలయ సమీపంలో గల ద్వారకానగర్ షిర్డీ సాయి ఆలయం తలుపు విరగ్గొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించి కేకలు వేసిన కాపలాదారు మాధవయ్యపై రాయి విసిరారు. దీంతో మాధవయ్య మరింత బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. అప్పటికే ఐదుగురు యువకులు పారిపోతూ ఉండడాన్ని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులతో పాటు స్థానికులు కూడా గాలించినా ఫలితం లేకపోయింది. ఆలయంలో ఏ విధమైన వస్తువులు పోకపోవడంతో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు.