షిర్డీ, న్యూస్‌లైన్: షిర్డీ సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి 14 వరకు ‘95వ మహా సమాధి’ (పుణ్యతిథి) ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంస్థాన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మోరే కోరారు. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు 12న ఉదయం 4.30 గంట లకు కాకడ్ హారతి, ఐదు గంటలకు బాబా చిత్రపటం ఊరేగింపు, 5.15 గంటలకు ద్వారకామాయి లో బాబా సచ్ఛరిత పారాయణ పఠనం ఉంటుందన్నారు. ఆ తర్వాత బాబాకు మంగళ స్నానాలు, దర్శనాలు ఉంటాయని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న హారతి, తీర్థ ప్రసాదాల పంపిణీ, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు భజనలు, కీర్తనలు ఉంటాయని చెప్పారు.
ధూప హారతి, రాత్రి ఏడున్నర నుంచి సాయినగర్ మైదాన్‌లో వివిధ కళాకారుల కార్యక్రమాలుంటాయని మోరే వివరించా రు. షిర్డీ పుర వీధుల్లో రాత్రి 9.15 గంటలకు బాబా పల్లకీ ఊరేగింపు ఉంటుందన్నారు. రాత్రి 10.30 గంటలకు శేజారతి ఉంటుందని చెప్పారు. మొదటిరోజు కావడంతో ద్వారకామాయిలో రాత్రంతా పారాయణ పఠనం చేసేందుకు వీలు కల్పిస్తామన్నారు. 13న కాకడ్ హారతి, అఖండ పారాయణ సమాప్తి, బాబా చిత్రపటం ఊరేగింపు, మంగళ స్నా నం, తర్వాత దర్శనానికి భక్తులను అనుమతించడం యథావిధిగా ఉంటుందని తెలిపారు.
ఇక ఉదయం తొమ్మిది గంటల నుంచి భిక్షాటన, భజనలు, ఆరాధన తదితర కార్యక్రమాలుంటాయన్నారు. మధ్యాహ్నం హారతి, సాయంత్రం ఖండో బా మందిరం నుంచి ఊరేగింపు, ధూప హారతి, రాత్రి బాబా పల్లకీ ఊరేగింపు ఉంటుందని తెలిపారు. ఉత్సవాల చివ రి రోజున 14వ తేదీ ఉదయం ఐదు గంటలకు మం గళస్నానం, అనంతరం దర్శనం, మధ్యాహ్నం హారతి, తీర్థప్రసాదాలు పంపిణీ, సాయంత్రం ధూప హారతి, రాత్రి ఆలయ సమీపంలోని వేదికపై స్థానిక కళాకారులతో వివిధ భక్తి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. 9.15 గంటలకు ఊరేగింపు, 10.30 గంటలకు శేజారతి ఉంటుందన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించామని తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అందించే వీఐపీ పాస్‌లు, దర్శనాలు, ఇతర కార్యక్రమాలన్నింటిని రద్దు చేయనున్నామని మోరే వెల్లడించారు.
మహా సమాధి ఉత్సవాలు
Published Sun, Oct 6 2013 2:39 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement