
అయోధ్య: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించడానికి శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సన్నాహాలు చేస్తోంది. జనవరి 21, 22, 23 తేదీల్లో ఒక రోజు రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శుక్రవారం వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సాధువులు, హిందూ పీఠాధిపతులు కూడా హాజరుకానున్నారు. 136 పీఠాలకు చెందిన 25 వేల మందికి పైగా సభ్యుల్ని విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. జనవరి నెల అంతా అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment