రామాలయం అక్షతల పంపిణీ ప్రారంభం | Ayodhya Ram Mandir: Akshat Distribution Begins On Occasion Of Bala Ram Idol Dedication - Sakshi
Sakshi News home page

Ram Mandir Akshat Distribution: రామాలయం అక్షతల పంపిణీ ప్రారంభం

Published Tue, Jan 2 2024 6:34 AM | Last Updated on Tue, Jan 2 2024 12:12 PM

Ayodhya axes distrubutation starts - Sakshi

అయోధ్య: అయోధ్యలోని భవ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు జరిగే విగ్రహ ప్రతిష్టకు గాను నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి అక్షతల పంపిణీని ప్రారంభించినట్లు ఆలయ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు.

బియ్యంతో పసుపు, నెయ్యి కలగలిపిన పవిత్ర అక్షతల పంపిణీ కార్యక్రమం మకర సంక్రాంతి వరకు, ఈ నెల 15 వరకు కొనసాగుతుందన్నారు. ప్రజలకు పంపిణీ చేసే అక్షతల ప్యాకెట్‌పై రామాలయం చిత్రంతోపాటు ఆలయ నిర్మాణం గురించిన వివరాలతో కూడిన కరపత్రం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల ఆలయాల పరిధిలోని 5 కోట్ల కుటుంబాల ప్రజలకు అక్షతలు అందుతాయని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement