axes
-
రామాలయం అక్షతల పంపిణీ ప్రారంభం
అయోధ్య: అయోధ్యలోని భవ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు జరిగే విగ్రహ ప్రతిష్టకు గాను నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి అక్షతల పంపిణీని ప్రారంభించినట్లు ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. బియ్యంతో పసుపు, నెయ్యి కలగలిపిన పవిత్ర అక్షతల పంపిణీ కార్యక్రమం మకర సంక్రాంతి వరకు, ఈ నెల 15 వరకు కొనసాగుతుందన్నారు. ప్రజలకు పంపిణీ చేసే అక్షతల ప్యాకెట్‌పై రామాలయం చిత్రంతోపాటు ఆలయ నిర్మాణం గురించిన వివరాలతో కూడిన కరపత్రం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల ఆలయాల పరిధిలోని 5 కోట్ల కుటుంబాల ప్రజలకు అక్షతలు అందుతాయని చెప్పారు. -
భూ వివాదంలో ఇద్దరి దారుణ హత్య.. 13 మంది నిందితుల అరెస్టు
రెబ్బెన(ఆసిఫాబాద్): భూవివాదంలో ఇద్దరిని హత్య చేసిన 13 మందిని పట్టుకున్నట్లు సీఐ అల్లం నరేందర్, ఎస్సై భూమేష్ వెల్లడించాడు. వారి వివరాల ప్రకారం... గత సోమవారం జక్కులపెల్లి శివారులోని వ్యవసాయ భూమి విషయంలో మండల బక్కయ్య కుటుంబీలకు, మండల మెంగయ్య కుటుంబీలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత ఆదివారం బక్కయ్య కుటుంబ సభ్యులు అదే భూమిలో పత్తి విత్తనాలు వేశారు. విషయం తెలుసుకున్న మెంగయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులు సోమవారం మధ్యాహ్నం కత్తులు, గొడ్డళ్లు, రాళ్లు, కారంపొడితో భూమి వద్దకు వెళ్లారు. వారి రాకకు గమనించి బక్కయ్య అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వారు వెంట తెచ్చుకున్న కర్రలు, కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయగా బక్కయ్య కుమారుడు మండల నర్సయ్యతో పాటు అతడి సోదరి గిరుగుల బక్కక్క అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. మండల ఇందిరా ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాలుగు బృందాలతో ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టి పరారీలోని 13మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి ఉపయోగించిన మూడు గొడ్డళ్లు, రెండు కత్తులు, నాలుగు కర్రలను స్వాధీనం చేసుకున్నారు. మండల మల్లేష్, మండల గణేష్, మండల వెంకటేష్, గిరుగుల భీంరావు, గిరుగుల రాకేష్, మండల రంగక్క, గిరుగుల రజిత, మండల రజిత, మండల రుక్మ, రాటే భూమక్క, రాటే భూడయ్య, గిరుగుల దుర్గక్క, గిరుగుల సౌమ్యలను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
58 కోట్ల ఫేస్బుక్ ఖాతాలు ఔట్, ఎందుకు?
శాన్ఫ్రాన్సిస్కో: డేటా లీక్ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారీ ఎత్తున ఫేక్ అకౌంట్లను తొలగించింది. కేవలం మూడు నెలల్లోనే ఈ ఖాతాలకు చెక్ పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 58.3కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్టు తెలిపింది. అంతేకాదు ఫేస్బుక్లో లక్షలాది నకిలీ ఖాతాలను రూపొందించే పయత్నాలను నిరోధిస్తున్నామని వెల్లడించింది. భారీ ఎత్తున డేటా బ్రీచ్ ఆరోపణలతో యూజర్ల గోప్యత ప్రశ్నార్థకంగా మారడంతో తన ఫ్లాట్‌పాంలో సెక్యూరిటీ అంశాలను సమీక్షిస్తోంది. ఇందులో భాగంగా నకిలీ అకౌంట్లను ఏరివేసేందుకు సన్నద్ధమైంది. యూజర్ డేటా దుర్వినియోగం విచారణలో భాగంగా తమ ప్లాట్‌ఫాంపై దాదాపు 200 యాప్స్‌ను తొలగించినట్టు ప్రకటించిన ఫేస్బుక్ తాజాగా ఈ చర్య తీసుకోవడం విశేషం 2018 మొదటి మూడునెలల్లో 583 మిలియన్ల నకిలీ ఖాతాలను రద్దు చేసింది. ఈ మేరకు ఫేస్బుక్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. లైంగిక వేధింపులు, హింసాత్మక చిత్రాలు, తీవ్రవాద ప్రచారాలు లేదా ద్వేషపూరిత ప్రసంగం లాంటి కమ్యూనిటీ ప్రమాణాలను దృష్టిలోవుంచుకుని ఆయా ఖాతాలను డిలిట్ చేసినట్టు వెల్లడించింది. దీంతోపాటు 837 మిలియన్ల పోస్టులను తొలగించామని వివరించింది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా బ్రీచ్ కుంభకోణం తరువాత ఫేస్బుక్ దిద్దుబాటు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ మిలియన్ల కొద్దీ నకిలీ ఖాతాలను నిరోధిస్తున్నట్టు చెప్పింది. అయినప్పటికీ నకిలీ ప్రొఫైల్స్ బెడద భారీగా ఉందని చెప్పింది. ఇది యాక్టివ్ అకౌంట్లను 3-4 శాతం ప్రభావితం చేస్తున్నట్టు పేర్కొంది. -
స్నేహితుడిపై గొడ్డలితో దాడి
సూర్యాపేట: పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని స్నేహితుడిపై ఓ యువకుడు గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గా యపరిచిన సంఘటన సోమవారం రాత్రి సూర్యాపేటలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని అన్నాదురైనగర్‌కు చెందిన బండ్ల శేఖర్(24) సెంట్రింగ్ ప ని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన గువ్వల గిరి శుభకార్యాల్లో టిఫిన్స్ చేసేందుకు వెళ్తుంటాడు. వీరిద్దరూ స్నేహితులు. ఉదయం శేఖర్ పనికి వెళ్తుండగా గువ్వల గిరి కలిశాడు. ఇరువురు పాత గొడవలకు సంబంధించిన కేసు విషయమై మాట్లాడుకున్నారు. గతంలో గిరి తన స్నేహితులతో కలిసి శేఖర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ కేసు ఎలాగైనా కొట్టివేయించుకోవాలనే ఉద్దే శంతో శేఖర్‌ను మందలించాడు. శేఖర్ వినకపోవడంతో సోమవారం రాత్రి గిరి గొడ్డలి తో అతన్ని వెంబడించి దాడి చేశాడు. ఈ ఘటనలో శేఖర్ తల నుంచి మెదడు బయటకు వచ్చింది. బాధితున్ని ఆటోలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. సీఐ మొగలయ్య ఘటన స్థలా న్ని సందర్శించి వివరాలు సేకరించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పో లీసులు తెలిపారు. గువ్వల గిరి పరారీలో ఉన్నాడు. -
మాజీ సర్పంచ్‌పై గొడ్డళ్లతో దాడి
ఈపూరు: గుంటూరు జిల్లా ఈపూరు మండలం గోపవారిపల్లి మాజీ సర్పంచ్ కట్ల కోటేశ్వరరావుపై గుర్తుతెలియని దుండగులు గొడ్డళ్లతో దాడిచేశారు. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయుకుడు అయిన కోటేశ్వరరావు లక్ష్యంగా సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా గొడ్డళ్లతో దాడి చేశారని, తీవ్రంగా గాయపడ్డ ఆయన్ని చికిత్స నిమిత్తం నర్సరావుపేట ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
టీ డబ్బులు అడిగితే నరికాడు
కడప : టీ డబ్బులు అడిగిన పాపానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన వైఎస్ఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మోచంపేటకు చెందిన షేక్ రహీం(48) ఎస్ఎఫ్ఎస్ వీధిలో టీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మోలా(25) అనే వ్యక్తి బుధవారం అక్కడకు వచ్చి టీ తాగాడు. తీరా టీ కి డబ్బులు అడిగితే మోలా వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో ఊగిపోయిన మోలా ..టీ కొట్టు యజమానిపై గొడ్డలితో దాడి చేసి... గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన రహీంను చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు గురువారం మరణించారు. కడప వన్ టౌన్ సీఐ కె.రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న మోలా కోసం గాలిస్తున్నారు. (అర్బన్ క్రైం) -
భార్య చేతిలో భర్త దారుణ హత్య
వేధింపులు తాళలేక ఘాతుకం * మృతుడిది నేర చరిత్రే * జైలు నుంచి విడుదలైన కొద్ది రోజులకే.. తాండూర్ : భార్య చేతిలో భర్త దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానంతో వేధించడాన్ని తాళలేక.. తనను తాను కాపాడుకోవడానికి గొడ్డలితో నరికి చంపింది. ఈ సంఘటన మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధి పోచంపల్లిలో సోమవారం వేకువజామున జరిగింది. తాండూర్ సీఐ రమేశ్‌బాబు కథనం ప్రకారం.. పోచంపల్లికి చెందిన గొర్లపల్లి బుచ్చయ్య(42)కు భార్య శాంత, కూతురు లావణ్య, కుమారులు నవీన్, కల్యాణ్ ఉన్నారు. కూలీ పని చేసి జీవించే బుచ్చయ్య 2008లో భూమి విషయమై తగాదా పడి తన అన్న మల్లయ్యతోపాటు మరో వ్యక్తి దుగుట లింగయ్యలను హత్య చేసి జైలుకు వెళ్లాడు. ఆరున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలయ్యాడు. ఆరు నెలలు మంచిర్యాలలో ఉన్న బుచ్చయ్య కుటుంబం నెల రోజుల క్రితం స్వగ్రామమైన పోచంపల్లికి వచ్చింది. భార్య శాంతపై అనుమానం పెంచుకుని వివాహేతర సంబంధాలు అంటగడుతూ వేధిస్తున్నాడు. ఆదివారం కుటుంబంతో సహా చర్చికి వెళ్లి వచ్చినప్పటి నుంచి భార్యాపిల్లలతో గొడవపడుతున్నాడు. భార్యను కొడుతుండగా అడ్డుకోబోయిన పిల్లలనూ చితకబాదాడు. రాత్రంతా గొడవ జరిగింది. సోమవారం వేకువజామున భార్యతో గొడవపడి చంపుతానంటూ గొడ్డలి తీయబోయాడు. ఈ క్రమంలో శాంత వేధింపులు తాళలేక, ప్రాణ రక్షణ కోసం పక్కనే ఉన్న గొడ్డలితో బుచ్చయ్య తల, మెడపై నరికింది. దీంతో బుచ్చయ్య కేకలు వేస్తూ బయటకు వచ్చి అక్కడికక్కడే చనిపోయాడు. సంఘటన స్థలాన్ని సీఐ రమేశ్‌బాబు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, బుచ్చయ్య పలు కేసులున్నాయి. మాదారంటౌన్షిప్లో దొంగతనం కేసు, తాండూర్, ఆషిపాబాద్ పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి. -
వేధిస్తున్నాడని.. చంపేసింది
* భర్తను గొడ్డలితో నరికి హతమార్చిన భార్య * శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ శివారులో ఘటన శంషాబాద్ రూరల్: మద్యానికి బానిసైన భర్త నిత్యం వేధిస్తుండడంతో భరించలేని భార్య ఆయనను గొడ్డలితో నరికి చంపేసింది. ఈ సంఘటన శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దోమ మండలం మోత్కూరుకు చెందిన దీమ వెంకటయ్య(37) కుల్కచర్ల మండలం బండి ఎల్కచర్ల నివాసి అయిన తన అక్క కూతురు కమలమ్మ అలియాస్ చిన్నమ్మను పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారులు నవీన్(9), శ్రీకాం త్(6) ఉన్నారు. వెంకటయ్య మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నాడు. ఇదిలాఉండగా మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం కాసులబాద్ నివాసి సిద్ధులు కమలమ్మకు పెద్దమ్మ కొడుకు వరుస. ఇతను ఏడాది క్రితం శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడకు వలస వచ్చి గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీఫాంలో పనిచేస్తున్నాడు. సోదరి అయిన కమలమ్మ మోత్కూరులో గొడవపడుతుండడంతో ఆయన దంపతులను నెల రోజుల క్రితం తీసుకొచ్చి తాను పనిచేసే పౌల్ట్రీఫాంకు సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పనికి కుదిర్చాడు. అయినా వెంకటయ్య ప్రవర్తనలో మార్పు రాలేదు. గురువారం రాత్రి 9 గంటలకు మద్యం తాగి వచ్చిన వెంకటయ్య భార్యతో గొడవపడ్డాడు. దీంతో కమలమ్మ వెళ్లి సిద్ధులుకు విషయం చెప్పి ఆయనను తీసుకొచ్చింది. గొడ్డలితో మెడ నరికి.. వెంకటయ్య మరోమారు కమలమ్మ, సిద్దులుతోనూ గొడవపడ్డాడు. తమనెక్క డ చంపేస్తాడోనని కమలమ్మ భయపడి అక్కడే ఉన్న కారం పొడిని భర్త ముఖం పై చల్లింది. దీంతో వెంకటయ్య కింద పడిపోయాడు. వెంటనే కమలమ్మ గొడ్డలి తీసుకుని ఆయన మెడపై నరకడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గొడ్డలిని గదిలోనే ఓ చోట దాచిపెట్టి, దానికి ఉన్న కట్టెను పొదల్లో పడేశారు. తర్వాత సిద్ధులు అక్కడి నుంచి వెళ్లి దుస్తులు మార్చుకున్నాడు. శుక్రవారం ఉదయం ఏమి తెలియనట్లుగా సిద్ధులు తన మామ చనిపోయాడంటూ స్థానికులకు చెప్పా డు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మొదట్లో తమకేమి తెలియదని బుకాయించిన కమలమ్మ, సిద్ధులు చివరకు నేరాన్ని అంగీకరించారు. హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఠాణాకు తరలించారు. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృ తదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయ్యో పాపం.. తండ్రి హత్యకు గురికావడం.. తల్లి జైలు కు వెళ్లాల్సి రావడంతో చిన్నారులు నవీ న్, శ్రీకాంత్‌లు అనాథలయ్యారు. -
కర్రలు, గొడ్డళ్లు, బాంబులతో దాడి
కంచరగుంట (దుర్గి), న్యూస్‌లైన్: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని కక్ష పెంచుకొని బాంబులు, గొడ్డళ్లు, కర్రలతో దాడిచేసిన సంఘటన కంచరగుంట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ దాడిలో బాలిక తండ్రి మరణించాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నెల రోజుల కిందట గ్రామానికి చెందిన శ్రీపతి చెన్నయ్య(42) కుమార్తె పట్ల అదే గ్రామానికి చెందిన చవ్వాకుల మస్తానయ్య కుమారుడు శ్రీనివాసరావు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై చెన్నయ్య దుర్గి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఇరువర్గాల పెద్దలు రాజీ కుదుర్చి శ్రీనివాసరావుతో క్షమాపణ చెప్పించారు. కక్ష పెంచుకున్న శ్రీనివాసరావు వర్గీయులు పది మంది బుధవారం మధ్యాహ్నం చెన్నయ్య పొలంలో పురుగు మందు పిచికారి చేస్తుండగా గొడ్డళ్లు, కర్రలు, బాంబులతో దాడి చేశారు. పక్క పొలంలో ఉన్న శ్రీపతి శ్రీను, కొండలు గమనించి కేకలు వేయడంతో వారిపైనా దాడి చేశారు. చుట్టుపక్కలవారంతా అక్కడికి చేరుకోవడంతో శ్రీనివాసరావు వర్గీయులు ఆయుధాలు అక్కడ పడేసి పరారయ్యారు. గాయపడిన చెన్నయ్య, శ్రీను, కొండలును ప్రైవేటు వాహనంలో మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చెన్నయ్య మృతి చెందారు. తీవ్రగాయాలైన శ్రీనును గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని రూరల్ ఎస్పీ జె. సత్యనారాయణ, గురజాల డీఎస్పీ ఇంజారపు పూజ పరిశీలించారు. తొమ్మిది మంది నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.