సూర్యాపేట: పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని స్నేహితుడిపై ఓ యువకుడు గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గా యపరిచిన సంఘటన సోమవారం రాత్రి సూర్యాపేటలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని అన్నాదురైనగర్‌కు చెందిన బండ్ల శేఖర్(24) సెంట్రింగ్ ప ని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన గువ్వల గిరి శుభకార్యాల్లో టిఫిన్స్ చేసేందుకు వెళ్తుంటాడు. వీరిద్దరూ స్నేహితులు.
ఉదయం శేఖర్ పనికి వెళ్తుండగా గువ్వల గిరి కలిశాడు. ఇరువురు పాత గొడవలకు సంబంధించిన కేసు విషయమై మాట్లాడుకున్నారు. గతంలో గిరి తన స్నేహితులతో కలిసి శేఖర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ కేసు ఎలాగైనా కొట్టివేయించుకోవాలనే ఉద్దే శంతో శేఖర్‌ను మందలించాడు.
శేఖర్ వినకపోవడంతో సోమవారం రాత్రి గిరి గొడ్డలి తో అతన్ని వెంబడించి దాడి చేశాడు. ఈ ఘటనలో శేఖర్ తల నుంచి మెదడు బయటకు వచ్చింది. బాధితున్ని ఆటోలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. సీఐ మొగలయ్య ఘటన స్థలా న్ని సందర్శించి వివరాలు సేకరించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పో లీసులు తెలిపారు. గువ్వల గిరి పరారీలో ఉన్నాడు.
స్నేహితుడిపై గొడ్డలితో దాడి
Published Tue, Jun 21 2016 8:06 AM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
Advertisement
Advertisement