
షిర్డీ సాయికి బంగారు పాదుకలు
ముంబై: గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఆగ్రాకు చెందిన సాయి భక్తుడు షిర్డీ సాయిబాబాకు రెండు కిలోల బంగారం పాదుకలు అర్పించారు. షిర్డీలో శనివారం నుంచి గురుపౌర్ణమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజున ఆగ్రాకు చెందిన అజయ్ గుప్తా, సంధ్య గుప్తా దంపతులు బంగారు పాదుకలు సమర్పించారు. ఇంతకుముందు సాయిబాబా కోసం 70 కిలోల వెండితో చేసిన సింహాసనాన్ని కూడా చేయించి కానుకగా సమర్పించారు.