తమ కష్టాలు తీర్చేందుకు కలియుగంలో మానవ రూపంలో అవతరించిన భగవంతుని ప్రతిరూపంగా షిర్డీ సాయినాధుని భక్తులు కొలుస్తుంటారు. బాబాను నమ్మిస్తే తమ ఈతిబాధలన్నీ రూపుమాపుతాడని బలంగా విశ్వసిస్తుంటారు. అలాంటి వారికి మరింత నమ్మకం కలిగించే ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. జహీరాబాద్‌లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది..
జహీరాబాద్ ఈడెన్ కాలనీలోని షిర్డీ సాయి మందిరం దగ్గర ఈ నెల 10న ఉదయం 9 గంటల సమయంలో ఓ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి సాయిబాబా వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి దిగాడు. నేరుగా గుడిలోకి నడుచుకుంటూ వెళ్లి పూజారితో మాట్లాడాడు. సాయికి హారతివ్వమని కోరాడు. అనంతరం హారతి కళ్లకు అద్దుకున్నాడు. ఆలయ ప్రాంగణంలో ఆయన తిరుగాడాడు. భక్తులతో ముచ్చటించాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంతకీ ఆరా తీస్తే.. అతను తెనాలికి చెందిన సాధువుగా గుర్తించారు. ఆ దృశ్యాలను మీరే చూడండి.