
సాయిబాబా చరిత్రతో...
షిరిడీ సాయిబాబా జీవితం ఆధారంగా కొండవీటి సత్యం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిరిడీ సాయి’. సాయిబాబాగా మచ్చా రామలింగారెడ్డి నటించారు. క్రోసూరి సుబ్బారావు, ఎం.ఆర్. రెడ్డి, పి. వెంకట్, డి. శివప్రసాద్ నిర్మాతలు. ప్రస్తుతం డీఐ, 5.1 మిక్సింగ్ (సౌండ్ మిక్సింగ్) పనులు జరుగుతున్నాయి.
చందూ ఆది ఆధ్వర్యంలో గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ‘‘సాయిబాబా చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి, ఈ సినిమా చేశాం’’ అని నిర్మాతలు అన్నారు. ప్రత్యేక పాత్రలను భానుచందర్, సీత చేశారు. విజేత కథానాయిక. ఈ చిత్రానికి కథ–మాటలు: దానం వెంకట్రావు, సంగీతం: కిషన్ కవాడియా, కెమెరా: వెంకట్.