పెందుర్తి: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ క్షేమం కోరుతూ విశాఖ శ్రీశారదాపీఠంలో ఈ నెల 14న అష్టబంధన మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వెల్లడించారు. ఈ నెల 10 నుంచి 5 రోజుల పాటు పీఠం వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయని చెప్పారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠంలో గురువారం స్వామీజీ మాట్లాడుతూ... శారదాపీఠం లో సుధా దేవాలయం(రాజశ్యామల అమ్మవారి దేవాలయం) పునఃప్రతిష్ఠలో భాగంగా శిలా దేవాలయాన్ని నిర్మించామని, ఈ నెల 10న దేశం నలుమూలల నుంచి వచ్చే పండితుల చేతుల మీదుగా ఆలయ ప్రతిష్ఠాపనతో పాటు యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయని వెల్లడించారు.
తొలిరోజు గణపతిపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, దీక్షాధారణ, రాజశ్యామల యాగం, వనదుర్గ యాగం ప్రారంభం, వాల్మికీ రామాయణం, దేవీ భాగవత పారాయణాలు, మేధా దక్షిణామూర్తికి పంచామృతాభిషేకా లు, రుగ్వేద పారాయణం, నిత్య పీఠ పూజ, సాంస్కృ తిక కార్యక్రమాలు, రెండో రోజు దాసాంజనేయస్వామికి పంచామృతాభిషేకాలు, రాజశ్యామల యాగం, వనదుర్గ యాగం, నీరాజన మంత్రపుష్పం, కృష్ణ యజుర్వేద పారాయణం, నిత్య పీఠ పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. తెలం గాణ సీఎం కేసీఆర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విశిష్ట అతిథులుగా పాల్గొంటారని స్వామీజీ చెప్పారు. సమావేశంలో ఉత్తర పీఠాధిపతి బాలస్వామి, ధర్మాధికారి కామేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment