Sri Swaroopanandendra Saraswati
-
స్వామివారిని దర్శించుకున్న స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
-
చాతుర్మాస్య దీక్ష చేపడుతున్న విశాఖ శారదా పీఠాధిపతి
-
లోక కల్యాణం కోసమే మహాకుంభాభిషేకం
పెందుర్తి : లోక కల్యాణం కోసం నిరంతరం విశాఖ శ్రీశారదాపీఠం పాటుపడుతోందని, అందులో భాగంగా పీఠంలో అష్టబంధన మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీజీ చెప్పారు. దేశం, రాష్ట్రానికి అమ్మవారి కరుణ, కటాక్షం ఉండాలన్నది పీఠం ఆకాంక్ష అన్నారు. పీఠం వార్షిక వేడుకల్లో భాగంగా రెండో రోజు సోమవారం అష్టబంధన మహాకుంభాభిషేకం వేడుకగా నిర్వహించారు. స్వామీజీ అనుగ్రహభాషణ చేస్తూ ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలని ప్రకృతీష్టి జరిపామని వెల్లడించారు. పీఠం గుంటూరు జిల్లా కన్వీనర్, విరంచి ఫ్యాషన్స్ అధినేత మర్రెడ్డి రామకృష్ణారెడ్డి, మృదుల దంపతులు కిలో స్వర్ణ కిరీటాన్ని స్వామీజీ చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించారు. కళాతపస్వి ఐ.వి.ఎన్ శాస్త్రిని సంగీత శాస్త్ర విశారద బిరుదుతో స్వామీజీ సత్కరించారు. -
14న అష్టబంధన మహాకుంభాభిషేకం
పెందుర్తి: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ క్షేమం కోరుతూ విశాఖ శ్రీశారదాపీఠంలో ఈ నెల 14న అష్టబంధన మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వెల్లడించారు. ఈ నెల 10 నుంచి 5 రోజుల పాటు పీఠం వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయని చెప్పారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠంలో గురువారం స్వామీజీ మాట్లాడుతూ... శారదాపీఠం లో సుధా దేవాలయం(రాజశ్యామల అమ్మవారి దేవాలయం) పునఃప్రతిష్ఠలో భాగంగా శిలా దేవాలయాన్ని నిర్మించామని, ఈ నెల 10న దేశం నలుమూలల నుంచి వచ్చే పండితుల చేతుల మీదుగా ఆలయ ప్రతిష్ఠాపనతో పాటు యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయని వెల్లడించారు. తొలిరోజు గణపతిపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, దీక్షాధారణ, రాజశ్యామల యాగం, వనదుర్గ యాగం ప్రారంభం, వాల్మికీ రామాయణం, దేవీ భాగవత పారాయణాలు, మేధా దక్షిణామూర్తికి పంచామృతాభిషేకా లు, రుగ్వేద పారాయణం, నిత్య పీఠ పూజ, సాంస్కృ తిక కార్యక్రమాలు, రెండో రోజు దాసాంజనేయస్వామికి పంచామృతాభిషేకాలు, రాజశ్యామల యాగం, వనదుర్గ యాగం, నీరాజన మంత్రపుష్పం, కృష్ణ యజుర్వేద పారాయణం, నిత్య పీఠ పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. తెలం గాణ సీఎం కేసీఆర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విశిష్ట అతిథులుగా పాల్గొంటారని స్వామీజీ చెప్పారు. సమావేశంలో ఉత్తర పీఠాధిపతి బాలస్వామి, ధర్మాధికారి కామేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు. -
రాజధానిలో వంద అడుగుల ఆది శంకరాచార్య విగ్రహం
♦ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వెల్లడి ♦ వేంకటేశ్వరస్వామికి సువర్ణ వక్ష స్థలం బహూకరణ సాక్షి, గుంటూరు: నూతన రాజధాని అమరావతిలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వంద అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సంకల్పించామని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తెలిపారు. అద్వైత స్థాపనతో హిందూ జాతిని ఏకతాటిపైకి తెచ్చి జాగృతపరిచిన మహనీయుడు ఆదిశంకరాచార్యులు అని కొనియాడారు. ఆదివారం గుంటూరులోని బృందావన్గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవ స్థానంలో స్వామివారికి మర్రెడ్డి రామకృష్ణా రెడ్డి, మృదుల దంపతులు శ్రీవత్స చిహ్నాంకిత రత్న ఖచ్చిత సువర్ణ వక్షస్థలాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత స్వామివారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అనంతరం విశేష పూజలు చేశారు. ఆ తర్వాత స్వామివారి చేతుల మీదుగా సువర్ణ వక్షస్థలాన్ని దేవస్థానానికి బహూకరించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి దేవస్థానంలో విష్వక్సేన ఆరాధన పుణ్యవా చన, అజసహస్ర దీపారాధన, రక్షా సూత్రదా రణ, నవగ్రహారాధన, అష్టదిక్పాలక పూజ, వాస్తు మండపారాధన, వాస్తు పర్యాగ్నికర ణ, మహాసుదర్శన హోమం, మçహాసంప్రోక్ష ణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంత రం ఆదిశంకరాచార్య స్వామి జయంతిని పురస్కరించుకుని ఆదిశంకరాచార్య ఆరాధన నిర్వహించారు. భక్తులను ఉద్దేశించి స్వామివారు అనుగ్రహ భాషణ చేశారు. అనంతరం అన్నదాన ప్రసాదం నిర్వహించారు. -
భద్రతా సిబ్బందిపై సీబీఐ విచారణ జరిపించండి
* అన్యమత ప్రచారం చేసే వారిని శిక్షించేందుకు ప్రత్యేక చట్టం అవసరం * విశాఖ శారద మఠం పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి తిరుమల: అన్యమత ప్రచార ఘటనల నేపథ్యంలో టీటీడీ భద్రతా సిబ్బందిపై సీబీఐ విచారణ జరిపించాలని విశాఖ శారద మఠం పీఠాధిపతి శ్రీస్వరూపనందేంద్ర సరస్వతి మహాస్వామి డిమాండ్ చేశారు. గురువారం ఉదయం ఆయన స్థానిక శారద మఠంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వానికి హిందూ మతంపై గౌరవం ఉంటే సీబీఐ విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓ వ్యక్తి తన బృందంతో స్వేచ్ఛగా మతప్రచారం చేయడం వెనుక భద్రతా సిబ్బంది సహకారం ఉందనే సందేహాన్ని ఆయన వ్యక్తం చే శారు. ఆ ఘటన జరిగిన వెంటనే టీటీడీ ఈవో, జేఈవో స్పందించి అన్యమత ప్రచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయించడంతో పాటు టీటీడీ సిబ్బందితో ప్రమాణం చేయించడం గొప్ప విషయమన్నారు. ఇదే తరహాలో దేవాదాయ శాఖలో కూడా చేయించాలన్నారు. హిందూ ఆల యాల వద్ద అన్యమత ప్రచారం చేసే వారిని శిక్షించేందుకు నిర్భయ చట్టం తరహాలో ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. టీటీడీ చేతగానితనం వల్లే పీఠాధిపతులు, మఠాధిపతుల సమావేశాలు జరగడం లేదన్నారు. త్వరలో ఆగమ సలహామండలితో సమావేశమై ఆలయంలో జరగాల్సిన కార్యక్రమాలు జరిగే సమయం, పద్ధతులపై చర్చిస్తామన్నారు. స్వామికి విశ్రాంతి లేకుండా దర్శనాలకోసమే ఎక్కవ సమయాన్ని కేటాయించడం సరికాదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. శ్రీవారికి వచ్చిన ఆదాయం హిందూ మత ప్రచారానికే వినియోగించాలన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన తిరుచానూరు చేరుకుని పద్మావతీ అమ్మవారిని దర్శించు కున్నారు. -
'స్వరూపానందేంద్రకి టీడీపీ నేతలు క్షమాపణలు చెప్పాలి'
శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామికి క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలను ఉత్తరాంధ్ర సాధూ పరిషత్ బుధవారం విశాఖపట్నంలో డిమాండ్ చేసింది. పీఠాధిపతులు, స్వామీజీలను కించపరచడం తగదని టీడీపీ నేతలకు హితవు పలికింది. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ సీఎంగా రాత్రి పూట ప్రమాణ స్వీకారం చేయకూడదని చంద్రబాబుకు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి సూచించిన సంగతిని ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సాధూ పరిషత్ గుర్తు చేసింది. స్వామీజీలను కించపరిస్తే చట్టపరమైన చర్యలకు సిద్దమని పరిషత్ హెచ్చరించింది. సోమవారం గాజువాకలోని శ్రీ షిర్డీసాయిబాబా ఆలయంలో శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి భక్తులనుద్దేశించి ప్రసంగిస్తూ... ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వర్షాలు కురవడం లేదని, గతంలోనూ ఆయన పాలనలో ఇదే దుస్థితి ఏర్పడిందని తెలిపారు. అలాగే చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజునే ఐదుగురు చనిపోయారని, ప్రతీరోజు ఎంతోమంది చనిపోతున్నారని చెప్పారు. గతంలో ఇలా ప్రమాణ స్వీకారం చేసిన వారు దుష్ఫలితాలు పొందారని ఈ సందర్బంగా స్వామీజీ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో స్వామీజీ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. దాంతో ఉత్తరాంధ్ర సాధూ పరిషత్‌పై విధంగా స్పందించింది. -
బాబు పాలనలో వర్షాలు రావు
-
బాబు పాలనలో వర్షాలు రావు
పెదగంట్యాడ(విశాఖపట్నం): ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వర్షాలు కురవడం లేదని, గతంలోనూ ఆయన పాలనలో ఇదే దుస్థితి ఏర్పడిందని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజునే ఐదుగురు చనిపోయారని, ప్రతీరోజు ఎంతోమంది చనిపోతున్నారని వ్యాఖ్యానించారు. గాజువాకలోని శ్రీ షిర్డీసాయిబాబా ఆలయంలో భక్తులనుద్దేశించి ప్రసంగించినప్పుడుపై వ్యాఖ్యలు చేశారు. సూర్యాస్తమయం తరువాత ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయాలకు మంచిది కాదన్నారు. గతంలో ఇలా ప్రమాణ స్వీకారం చేసిన వారు దుష్ఫలితాలు పొందారని గుర్తు చేశారు. బాబుకు అధికారం.. ప్రజలకు కరువుకాలం: రాఘవులు సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరువుకాలం కూడా వస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. గతంలో ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కరువు వచ్చిందని, ఇప్పుడూ ఆంధ్రప్రదేశ్‌లో అదే పరిస్థితి నెలకొందని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు.