బాబు పాలనలో వర్షాలు రావు | No rains in Chandrababu rule says Sri Swaroopanandendra Saraswati | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 1 2014 3:46 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వర్షాలు కురవడం లేదని, గతంలోనూ ఆయన పాలనలో ఇదే దుస్థితి ఏర్పడిందని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజునే ఐదుగురు చనిపోయారని, ప్రతీరోజు ఎంతోమంది చనిపోతున్నారని వ్యాఖ్యానించారు. గాజువాకలోని శ్రీ షిర్డీసాయిబాబా ఆలయంలో భక్తులనుద్దేశించి ప్రసంగించినప్పుడుపై వ్యాఖ్యలు చేశారు. సూర్యాస్తమయం తరువాత ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయాలకు మంచిది కాదన్నారు. గతంలో ఇలా ప్రమాణ స్వీకారం చేసిన వారు దుష్ఫలితాలు పొందారని గుర్తు చేశారు. బాబుకు అధికారం.. ప్రజలకు కరువుకాలం: రాఘవులు సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరువుకాలం కూడా వస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. గతంలో ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కరువు వచ్చిందని, ఇప్పుడూ ఆంధ్రప్రదేశ్‌లో అదే పరిస్థితి నెలకొందని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement