సాక్షి, వైఎస్సార్ కడప: జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుండుపల్లె మండలం భాగంపల్లి వద్ద ఓ కారులో దట్టమైన మంటలు చెలరేగాయి. భారీ మంటలకు కారు పూర్తిగా దగ్ధమైంది. చిత్తూరు నుంచి వైఎస్సార్ కడపకి వస్తుంటే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్నవారు మంటలను గుర్తించి వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగి మంటల నుంచి తప్పించుకున్నారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఒక్కసారిగా దట్టమైన మంటలు చెలరేగడంతో తీవ్ర భయాందోళనకు గురైనట్లు కారులో ప్రయాణిస్తున్న వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment