Sundupalli
-
ప్రాణభయంతో కేకలు.. ఆరుగుర్ని కాపాడిన ఎస్ఐ
సాక్షి, సుండుపల్లె (రాజంపేట) : పింఛా జలాశయం నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఆరుగురు ప్రాణాలను సుండుపల్లె ఎస్ఐ భక్తవత్సలం కాపాడారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సుండుపల్లె మండలం ఫించా జలాశయానికి నీటి ఉధృతి పెరిగింది. శుక్రవారం జలాశయ గేట్లు ఎత్తారు. బహుదా నదిలోకి వరదనీరు జోరుగా ప్రవాహించింది. ఈ నదీ పరీసర ప్రాంతాలలో మేకలను, బర్రెలను మేపుకుంటున్న కాపరులను నీరు చుట్టుముట్టింది. దీంతో బయట రాలేక రక్షించండంటూ ప్రాణభయంతో కేకలు వేశారు. ఒడ్డున ఉన్న వారు గమనించి ఎస్ఐకు సమాచారం ఇచ్చారు. దీంతో భక్తవత్సలం తన సిబ్బందితో , చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల సహకారంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి నీటిలో తాడు సహాయంతో దిగారు. మిట్టమీదపల్లెకు చెందిన ఆరుగురిని బయటికు తీసుకొచ్చారు. బయటపడిన వారిలో పెండ్లిమర్రి సరోజమ్మ, రాయవరం సుబ్రదమ్మ, రాయవరం బాబు, రాయవరం చెన్నయ్య, అన్నారపు కిరణ్‌కుమార్, నరసమ్మలు ఉన్నారు. ఎస్ఐ, పోలీసుల చొరవను స్థానికులు హర్షించారు. -
చెలరేగిన మంటలు
-
చెలరేగిన మంటలు: కారు దగ్ధం
సాక్షి, వైఎస్సార్ కడప: జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుండుపల్లె మండలం భాగంపల్లి వద్ద ఓ కారులో దట్టమైన మంటలు చెలరేగాయి. భారీ మంటలకు కారు పూర్తిగా దగ్ధమైంది. చిత్తూరు నుంచి వైఎస్సార్ కడపకి వస్తుంటే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్నవారు మంటలను గుర్తించి వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగి మంటల నుంచి తప్పించుకున్నారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఒక్కసారిగా దట్టమైన మంటలు చెలరేగడంతో తీవ్ర భయాందోళనకు గురైనట్లు కారులో ప్రయాణిస్తున్న వారు తెలిపారు. -
ఎర్రచందనం అక్రమరవాణా..నలుగురి అరెస్ట్
వైఎస్సార్ జిల్లా: సుండుపల్లి మండలం పేద్దినేనికాలువ సమీపంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు తమిళకూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆరు ఎర్రచందనం దుంగలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం కలసాపాడుకు చెందిన మాగలింగం, శివలింగం, తీర్థగిరిలతోపాటు వైఎస్సార్ జిల్లా ముడుంపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగార్జునను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కూంబింగ్ సమయంలో నిందితులు పోలీసులపై ఎదురుదాడికి పాల్పడ్డారని ఎస్ఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల బరువు 126 కేజీలు ఉందని వెల్లడించారు. అలాగే నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. సానిపాయి రేంజి అటవీశాఖ అధికారులు ముడుంపాడు సమీపంలోని పించా అటవీ ప్రాంతంలో 60 దుంగలు స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
సుండుపల్లిలో అధికారుల దౌర్జన్యం
-
అడవికి నిప్పు
సుండుపల్లి: అటవీశేషాచల ప్రాంతమైన రాజంపేట డివిజన్ సానిపాయిరేంజ్ అటవీ పరిధిలోని వానరాచపల్లిబీట్ సమీపంలో గురువారం అడవికి ఆకతాయిలు నిప్పుపెట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఎర్రచందనం అడవిలో పుష్కలంగా కలదు. స్మగ్లర్లు, కూలీలు అడవిలోకి వెల్లేందుకు నిప్పుపెట్టారా..? లేకపోతే పశువులు, మేకలు, గొర్రెల మేతకోసం కొండకు అగ్గిపెట్టారా తెలియలేదని అడవిఅంతా కాలిపోతోంది. అయితే గుట్టల్లో ఉన్న బోదను కాల్చివేస్తే వర్షం వచ్చే సమయంలో గడ్డిమొక్క ఇగురువేస్తుందనే నెపంతో అడవికి నిప్పుపెట్టినట్లు ఉంది. అందులో భాగంగా సానిపాయి అటవీ అధికారి వినాయక్ తనసిబ్బందితో రాత్రి 8గంటల ప్రాంతంలో ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలను ఆర్పేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నారు. అడవికి నిప్పు విషయంపై రేంజర్ వినాయక్‌ను సాక్షి ఫోన్‌ద్వారా అడుగగా వానరాచపల్లి సమీపంలో మేకలవారు నిప్పుపెట్టినట్లు ఉందని ఒక్క గంట సమయంలోపు ఎగిసిపడుతున్న అగ్నిజ్వాలలను ఆర్పివేస్తామని వారు తెలిపారు. అదేవిధంగా అడవికి నిప్పు మానవాళికి నిప్పు అని నిప్పుపెడితే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. అడవిలో నిప్పును ఆర్పేందుకు ఫారెస్టు ప్రొటెక్షన్ వాచర్లు, స్ట్రైకింగ్‌ఫోర్సు పాల్గొన్నారు. -
శివాలయంలో హుండీ చోరీ
వైఎస్సార్ కడప: జిల్లాలోని సుండుపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శివాలయంలో శుక్రవారం చోరీ జరిగింది. ఆలయ హుండీని గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి నగదు, కానుకలు దోచుకె ళ్లారు. హుండీలో సుమారు రూ.2లక్షల వరకు నగదు ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘దేశం’ నాయకుల వాగ్వాదం
సుండుపల్లి: రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వాగ్వాదం చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సుండుపల్లికి చెందిన ఓ నాయకుడు స్థానిక బహుదా నది నుంచి కొందరు ఇసుకను తరలిస్తున్నారనే కారణంగా వాహనాలు రాకుండా చేసేందుకు రోడ్డుకు మధ్యలో గుంతలు తీశారు. అయితే ఇదే ప్రాంతంలో కాంట్రాక్టు పనులు చేస్తున్న మరో టీడీపీ నాయకుడు తన పనులకు ఇసుక తీసుకెళ్లకూడదే ఉద్దేశంతోనే రోడ్డుకు అడ్డంగా గుంతలు తీశారంటూ విషయాన్ని ఎమ్మెల్యే మేడా దృష్టికి తీసుకెళ్లారు. శనివారం బూడిదగుంటరాచపల్లి సమీపంలో పంటలు పరిశీలించేందుకు వచ్చిన మేడా ఈ విషయమై ఇద్దరు నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే తన వాహనం ఎక్కి తిరుపతికి వెళ్లిపోయారు. నాయకులు కూడా ఎవరిదారిన వారు వెళ్లారు. టీడీపీ నాయకుల వాగ్వాదం విషయం సుండుపల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది. -
కొండ్రెడ్డిగారిపల్లిలో అగ్ని ప్రమాదం
రాయచోటి : వైఎస్ఆర్ జిల్లా సుండుపల్లి మండలం కొండ్రెడ్డిగారిపల్లిలో సోమవారం అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. గ్రామానికి చెందిన వీరనాగయ్య, అతని కుటుంబసభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దాంతో వారంతా వెంటనే అప్రమత్తమై ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులు వెంటనే స్పందించి.. మంటలు ఆర్పివేశారు. అయితే ఇంట్లోని నగదు, సామగ్రి అంతా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. -
కువైట్‌లో సుండుపల్లి వాసి మృతి
సుండుపల్లిః మండలంలోని అగ్రహారంకు చెందిన ఎస్.నూరుల్లా జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లి అక్కడ మృతి చెందాడు. కువైట్‌లో గత మంగళవారం మాళియా దగ్గర టీ తాగి వస్తుండగా కాలుజారి పడ్డాడు. తలకు తీవ్రమైన గాయమైంది. దీంతో బంధువులు వైఎస్సార్సీపీ కువైట్ అడహక్ కమిటీ సభ్యులు రెహమాన్‌ఖాన్, ఇలియాజ్‌లు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస వదిలాడు. నూరుల్లా మృతదేహం స్వదేశానికి రావడానికి వైఎస్సార్సీపీ అడహక్ కమిటీ సభ్యులు రెహమాన్‌ఖాన్, ఇలియాజ్‌తోపాటు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లాఅధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి చొరవ చూపడంతో బుధవారం మృతదేహారం అగ్రహారానికి చేరింది. మృతునికి భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మొదటి కుమార్తె నసీనాకు వివాహమైంది. రెండవ కుమార్తె నస్రీన్ 8వ తరగతి చదువుతోంది. జెడ్పీటీసీ సభ్యుడు హకింసాబ్ మృతదేహాన్ని పరిశీలించి అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయనవెంట మండల కోఆప్షన్ మెంబర్ పండూస్, మండల ఉపసర్పంచ్ సిరాజుద్దీన్, వైఎస్సార్సీపీ గౌరవసలహాదారుడు క్రిష్ణంరాజు, బీసీ మండల కన్వీనర్ సూరి, ఎస్టీ మండల కన్వీనర్ చిన్నప్ప, మైనార్టీ నాయకుడు ప్రసాద్, రాజ పాల్గొన్నారు. -
'నా 24 ఎకరాల భూమిని పేదలకు ఇచ్చేయండి'
సుండుపల్లి: ఆయన పేరు మల్లు శివారెడ్డి. గతంలో వైఎస్సార్ జిల్లా రాయచోటి సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. బిడ్డలు విదేశాల్లో స్థిరపడ్డారు. ముందునుంచి సేవాభావంగల ఆయన పేదలకు శాశ్వత సాయం చేయాలనుకున్నారు. తనకున్న 24 ఎకరాల వ్యవసాయభూమిని పేదలకు వితరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సంబేపల్లి మండలం శెట్టిపల్లి గ్రామ పంచాయతీ నరసారెడ్డిగారిపల్లెలో తనకు 24 ఎకరాల భూమి ఉందని, దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు ఇవ్వాలని ఆయన కోరారు. గతంలో ఈయన సుండుపల్లి మండలంలో కస్తూర్బా ఉన్నత పాఠశాలకు 5 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చారు. వైఎస్సార్సీపీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న శివారెడ్డికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో సత్సంబంధాలు ఉండేవి. -
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు
సుండుపల్లి (వైఎస్సార్ జిల్లా) : అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు దాడిచేసిన సంఘటన వానరాసపల్లి అటవీ సమీపంలో మంగళవారం జరిగింది. ఎక్సైజ్ పోలీసులు ఈ దాడుల్లో సుమారు 1200 లీటర్ల ఊట బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 70 లీటర్ల నాటుసారా కూడా స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా కాస్తే కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. -
నలుగురు ఎర్రచందనం దొంగలు అరెస్ట్
వైఎస్సార్ (సుండుపల్లి) : సుండుపల్లి మండలం కృష్ణారెడ్డి చెరువు సమీపంలో నలుగురు ఎర్రచందనం దొంగల్ని పోలీసులు శనివారం పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.3 లక్షల విలువ చేసే 6 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన దొంగలంతా తమిళనాడుకు చెందినవారే. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక తవ్వకాలను వ్యతిరేకిస్తూ ధర్నా
సుండుపల్లి (వైఎస్సార్ జిల్లా) : అక్రమ ఇసుక తవ్వకాలను వ్యతిరేకిస్తూ సుండుపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో గ్రామస్తులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు పోలీసులు మధ్య తోపులాట జరిగింది. -
రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాజంపేట మండలం రామాపురం చెక్‌పోస్ట్ వద్ద అటవీ శాఖ అధికారులు ఆదివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు.అందులోభాగంగా అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దాంతో స్మగ్లర్లు భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అటవీశాఖ అధికారులు వాహనాన్ని పోలీసులకు అప్పగించారు.వాహనాన్ని స్టేషన్‌కు తరలించి పోలీసులు సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్పు ప్రారంభించినట్లు చెప్పారు.పట్టుబడిన ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 లక్షలు ఉంటుందని వెల్లడించారు. అలాగే అదే జిల్లాలోని సుండుపల్లి మండలం గొల్లపల్లి వద్ద గత అర్థరాత్రి నుంచి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.ఈ నేపథ్యంలో అధిక మొత్తంలో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.