అడవికి నిప్పు
సుండుపల్లి: అటవీశేషాచల ప్రాంతమైన రాజంపేట డివిజన్ సానిపాయిరేంజ్ అటవీ పరిధిలోని వానరాచపల్లిబీట్ సమీపంలో గురువారం అడవికి ఆకతాయిలు నిప్పుపెట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఎర్రచందనం అడవిలో పుష్కలంగా కలదు. స్మగ్లర్లు, కూలీలు అడవిలోకి వెల్లేందుకు నిప్పుపెట్టారా..? లేకపోతే పశువులు, మేకలు, గొర్రెల మేతకోసం కొండకు అగ్గిపెట్టారా తెలియలేదని అడవిఅంతా కాలిపోతోంది. అయితే గుట్టల్లో ఉన్న బోదను కాల్చివేస్తే వర్షం వచ్చే సమయంలో గడ్డిమొక్క ఇగురువేస్తుందనే నెపంతో అడవికి నిప్పుపెట్టినట్లు ఉంది. అందులో భాగంగా సానిపాయి అటవీ అధికారి వినాయక్ తనసిబ్బందితో రాత్రి 8గంటల ప్రాంతంలో ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలను ఆర్పేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నారు. అడవికి నిప్పు విషయంపై రేంజర్ వినాయక్‌ను సాక్షి ఫోన్‌ద్వారా అడుగగా వానరాచపల్లి సమీపంలో మేకలవారు నిప్పుపెట్టినట్లు ఉందని ఒక్క గంట సమయంలోపు ఎగిసిపడుతున్న అగ్నిజ్వాలలను ఆర్పివేస్తామని వారు తెలిపారు. అదేవిధంగా అడవికి నిప్పు మానవాళికి నిప్పు అని నిప్పుపెడితే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. అడవిలో నిప్పును ఆర్పేందుకు ఫారెస్టు ప్రొటెక్షన్ వాచర్లు, స్ట్రైకింగ్‌ఫోర్సు పాల్గొన్నారు.