వైఎస్సార్ (సుండుపల్లి) : సుండుపల్లి మండలం కృష్ణారెడ్డి చెరువు సమీపంలో నలుగురు ఎర్రచందనం దొంగల్ని పోలీసులు శనివారం పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.3 లక్షల విలువ చేసే 6 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన దొంగలంతా తమిళనాడుకు చెందినవారే. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.