
స్మగ్లర్లను మీడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు
వైఎస్సార్ జిల్లా: సుండుపల్లి మండలం పేద్దినేనికాలువ సమీపంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు తమిళకూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆరు ఎర్రచందనం దుంగలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం కలసాపాడుకు చెందిన మాగలింగం, శివలింగం, తీర్థగిరిలతోపాటు వైఎస్సార్ జిల్లా ముడుంపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగార్జునను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కూంబింగ్ సమయంలో నిందితులు పోలీసులపై ఎదురుదాడికి పాల్పడ్డారని ఎస్ఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల బరువు 126 కేజీలు ఉందని వెల్లడించారు. అలాగే నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. సానిపాయి రేంజి అటవీశాఖ అధికారులు ముడుంపాడు సమీపంలోని పించా అటవీ ప్రాంతంలో 60 దుంగలు స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment