Red Sandal Wood Smugglers
-
కడపలో స్మగ్లర్ల పట్టివేత
సాక్షి, వైఎస్సార్ కడప: మైదుకూరులో ఇద్దరు అంతరాష్ట్ర స్మగ్లర్లు పట్టుబడ్డారు. పోలీసుల తనిఖీల్లో ఎర్రచందనం కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టుబడగా, అందులో ఉన్న 90 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి బరువు 3.30 టన్నులుగా ఉంది. పట్టుబడిన స్మగ్లర్లు తమిళనాడుకు చెందిన ఉలగంధన్ వెల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాణా దత్తలుగా అధికారులు గుర్తించారు. వీరి నుంచి 1 వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. -
ఎర్రచందనం అక్రమరవాణా..నలుగురి అరెస్ట్
వైఎస్సార్ జిల్లా: సుండుపల్లి మండలం పేద్దినేనికాలువ సమీపంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు తమిళకూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆరు ఎర్రచందనం దుంగలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం కలసాపాడుకు చెందిన మాగలింగం, శివలింగం, తీర్థగిరిలతోపాటు వైఎస్సార్ జిల్లా ముడుంపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగార్జునను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కూంబింగ్ సమయంలో నిందితులు పోలీసులపై ఎదురుదాడికి పాల్పడ్డారని ఎస్ఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల బరువు 126 కేజీలు ఉందని వెల్లడించారు. అలాగే నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. సానిపాయి రేంజి అటవీశాఖ అధికారులు ముడుంపాడు సమీపంలోని పించా అటవీ ప్రాంతంలో 60 దుంగలు స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
ఎర్రచందనం స్మగ్లర్ల రాక తగ్గింది
పీలేరు, న్యూస్‌లైన్: ఎర్రచందనం అంతర్రాష్ట్ర స్మగ్లర్ల రాక తగ్గిందని అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ అన్నారు. మంగళవారం పీలేరు సర్కిల్ కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తిరుమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులపై దాడి చేసిన విషయం తెలిసిందేనన్నారు. అప్పటి నుంచి సాయుధ బలగాలతోనే కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు కావాలని ఫారెస్ట్ సిబ్బంది కోరారని తెలిపారు. ఇందులో భాగంగా ఆయుధాలను ఎలా ఉపయోగించాలి, వాటి రక్షణ తదితర అంశాలపై ఈ నెల 6 నుంచి తిరుపతి సమీపంలోని కల్యాణిడ్యాం పోలీస్ శిక్షణ కళాశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. మొదటి విడతలో 120 మంది హాజరయ్యారని, ఒక్కొక్క బ్యాచ్‌కు రెండు వారాల పాటు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఫారెస్ట్ రేంజ్‌కి ఏపీఎస్పీ స్పెషల్ పోలీస్ ప్లాటూన్స్‌ను నియమించామన్నారు. తిరుపతి, ప్రొద్దుటూరు, భాకరాపేట, తదితర ఫారెస్ట్ రేంజ్లన్నింటికీ సాయుధ బలగాలను ప్రత్యేకంగా నియమించామన్నారు. ఇకపై కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులపై స్మగ్లర్లు దాడులకు పాల్పడితే ఆత్మరక్షణ కోసం ఆయుధాలను ఉపయోగిస్తారని తెలిపారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు, అడవిలోకి వెళ్లి చెట్లు నరికే కూలీల తాకిడి తగ్గిందన్నారు. ప్రతి సార్వత్రిక ఎన్నికల్లోనూ పీలేరు నియోజకవర్గంలో అదనపు బలగాలను నియమిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లోనూ అవసరం మేరకు నియమిస్తామని తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వాల్మీకిపురం సర్కిల్ పరిధిలోని గుర్రంకొండ పోలీస్ స్టేషన్, పీలేరు సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసినట్టు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం క్రైం రేటు తగ్గిందని, లా అండ్ ఆర్డర్ సమస్య ఎక్కడా లేదని, గ్రేవ్ కేసులు బాగా తగ్గాయన్నారు. ఎస్పీ పీహెచ్డీ.రామకృష్ణ, మదనపల్లె డీఎస్పీ కేవీ.రాఘవరెడ్డి, పీలేరు సీఐ నరసింహులు, ఎస్ఐ ఎస్.విశ్వనాథరెడ్డి, ఇతర ట్రైనీ ఎస్ఐలు, ఏఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్ల వెనుక కిరణ్: భూమన
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాల్సిన అవసరముందన్నారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ది సాధ్యం కాదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ జాతీయపార్టీల మద్దతు కూడగట్టారని తెలిపారు. కేంద్రానికి సీఎం కిరణ్ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల వెనక సీఎం హస్తముందని అన్నారు. సీఎం సోదరుడి ప్రోత్సాహం వల్లే స్మగ్లర్లు చెలరేగిపోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు నిజమైన స్నేహితుడు చంద్రబాబేనని కరుణాకర రెడ్డి ఎద్దేవా చేశారు. -
జీటీ ఎక్స్‌ప్రెస్‌లో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
-
జీటీ ఎక్స్‌ప్రెస్‌లో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
కడప : ఎర్రచందనం స్మగ్లర్ల కోసం టాస్క్‌ఫోర్స్ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జీటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న 105మంది ఎర్రచందనం స్మగర్లను రైల్వే కోడూరులో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో బడా స్మగ్లర్లు ఉన్నట్లు సమాచారం. వీరంతా తమిళనాడు వాసులుగా అధికారులు గుర్తించారు.స్మగర్లను తిరుపతి అటవీశాఖ కార్యాలయానికి తరలించనున్నారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్లు ఆదివారం రెచ్చిపోయి ఇద్దరు అటవీశాఖ అధికారులను హతమార్చడం, మరో ఆరుగురిని గాయపర్చడంతో పీలేరు కేంద్రంగా సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా మరోమారు చర్చనీయాంశమైంది. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పీలేరు నియోజక వర్గం అడ్డాగా మారుతోంది. పీలేరు నుంచి చెన్నై, బెంగళూరుకు వెళ్లే రహదారులు ఉన్నాయి. ఎర్రచందనం ఎక్కువగా ఉన్న శేషాచలం అడవులు దగ్గర కావటంతో పాటు స్మగ్లర్లకు రాజకీయ నేతలు, అధికారుల సహకారం ఇవన్నీ కూడా అక్రమరవాణా పెరగడానికి కారణాలు అవుతున్నాయి. -
ఎర్రచందనం స్మగ్లర్ల దాడి: ఇద్దరు అటవీ అధికారులు మృతి
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఆదివారం ఉదయం రెచ్చిపోయారు. కడప - చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని తుంబురు తీర్థం అటవీ శాఖ ఉద్యోగులపై స్మగ్లర్లు రాళ్ల వర్షం కురిపించారు. ఆ ఘటనలో అటవీ శాఖకు చెందిన డిప్యూటీ రేంజ్ అధికారి, అసిస్టెంట్ బిట్ అధికారి మృతి చెందారు. మరో ఇద్దరు బీట్ కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఆ ఇద్దరు అధికారులు నీతి నిజాయితితో విధులు నిర్వర్తించేవారని అటవీ శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు.