
ఎర్రచందనం స్మగ్లర్ల వెనుక కిరణ్: భూమన
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాల్సిన అవసరముందన్నారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ది సాధ్యం కాదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ జాతీయపార్టీల మద్దతు కూడగట్టారని తెలిపారు.
కేంద్రానికి సీఎం కిరణ్ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల వెనక సీఎం హస్తముందని అన్నారు. సీఎం సోదరుడి ప్రోత్సాహం వల్లే స్మగ్లర్లు చెలరేగిపోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు నిజమైన స్నేహితుడు చంద్రబాబేనని కరుణాకర రెడ్డి ఎద్దేవా చేశారు.