జీటీ ఎక్స్ప్రెస్లో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
కడప : ఎర్రచందనం స్మగ్లర్ల కోసం టాస్క్ఫోర్స్ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జీటీ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న 105మంది ఎర్రచందనం స్మగర్లను రైల్వే కోడూరులో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో బడా స్మగ్లర్లు ఉన్నట్లు సమాచారం. వీరంతా తమిళనాడు వాసులుగా అధికారులు గుర్తించారు.స్మగర్లను తిరుపతి అటవీశాఖ కార్యాలయానికి తరలించనున్నారు.
కాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్లు ఆదివారం రెచ్చిపోయి ఇద్దరు అటవీశాఖ అధికారులను హతమార్చడం, మరో ఆరుగురిని గాయపర్చడంతో పీలేరు కేంద్రంగా సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా మరోమారు చర్చనీయాంశమైంది. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్కు పీలేరు నియోజక వర్గం అడ్డాగా మారుతోంది.
పీలేరు నుంచి చెన్నై, బెంగళూరుకు వెళ్లే రహదారులు ఉన్నాయి. ఎర్రచందనం ఎక్కువగా ఉన్న శేషాచలం అడవులు దగ్గర కావటంతో పాటు స్మగ్లర్లకు రాజకీయ నేతలు, అధికారుల సహకారం ఇవన్నీ కూడా అక్రమరవాణా పెరగడానికి కారణాలు అవుతున్నాయి.