నలుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లపై పీడీయాక్ట్ | PD Act on the Four ' red ' smugglers | Sakshi
Sakshi News home page

నలుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లపై పీడీయాక్ట్

Published Wed, Mar 16 2016 8:33 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

PD Act on the Four ' red ' smugglers

ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టుచేసి, రిమాండ్‌లో ఉన్న నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లపై బుధవారం పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు నమోదుచేశారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు తమిళనాడుకు చెందిన ఆర్ముగకుమార్ (48), చిత్తూరుకు చెందిన ఏ.కమల్‌కిషోర్ (32), కర్ణాటకకు చెందిన మీర్జాబేగ్ (39), సప్జర్ షరీఫ్ (29) అనే స్మగ్లర్లపై పీడీ నమోదు చేసినట్లు చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ బుధవారం తెలిపారు.

వీరిలో ఆర్ముగకుమార్, కమల్‌కిషోర్, మీర్జాబేగ్ అంతర్జాతీయ స్మగ్లర్లు. నిందితులు నలుగురు ఇప్పటివరకు విదేశాలకు 430 టన్నుల ఎర్రచందనం దుంగలను జిల్లా నుంచి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే జుడీషియల్ కస్టడీలో ఉన్న నలుగురిని కడప కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement