peleru
-
అన్నమయ్య: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పీలేరులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. వివరాల ప్రకారం.. పీలేరులోని ఎంజేఆర్ కాలేజీ వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, తుఫాన్ వాహనం నంద్యాల నుంచి తిరువన్నమలైకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది కూడా చదవండి: ‘జయలక్ష్మి’ ఆస్తుల సీజ్‌కు రంగం సిద్ధం -
పీలేరులో అధికారుల నిర్లక్ష్యం
-
కిశోరా.. ఇది తగునా
పీలేరు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుడు కిశోర్‌కుమార్ రెడ్డి ఆగడాలు మితిమీరుతున్నాయని ఉద్యోగ వర్గాలు కలవరపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికీ ఫోన్ చేసి దుర్భాషలాడుతుండడంతో హడలిపోతున్నారు. వయసు, అర్హతలకు కూడా విలువ ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులతో మొర పెట్టుకున్నా ఫలితం ఉండటం లేదు. సర్దుకుపోండని ఉచిత సలహాలిస్తున్నారని అధికారులు ఆవేదన చెందుతున్నారు. కలికిరిలో పనిచేస్తున్న ఓ వీఆర్వో ఒత్తిడి తట్టుకోలేక రెండేళ్ల సర్వీసు ఉన్నా ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రాజీనామా పత్రాన్ని ఉన్నతాధికారులకు పోస్టు ద్వారా పంపాడు. చిత్తూరు, సాక్షి: మాజీ ముఖ్యమంత్రి సోదరుడు..ఇటీవల అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి వైఖరితో ఉద్యోగవర్గాలు వేసారుతున్నాయి. ఈయన బాధిత ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. కలికిరి మండలంలో ఎక్కువ చుక్కల భూములున్నాయి. వీటి లెక్కలు తేల్చాలని ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలో రెవెన్యూ ఉద్యోగులు ఆ పనిలో బిజీ అయ్యారు. ఇదే సమయంలో కలికిరి గ్రామ పరిధిలోనే సైనిక్ స్కూల్ పక్కనే ఉన్న విలువైన చుక్కల భూమిని తన అనుచరుల పేరుపై రెగ్యులరైజ్ చేయాలని కిశోర్ ఒత్తిడి చేసినట్లు తెలిసింది. రెవెన్యూ రికార్డుల్లో పట్టా మంజూ రు చేసినట్లు ఉండటంతో తహసీల్దార్ నటరాజ రెండుసార్లు దరఖాస్తును తిరస్కరించారు. దీంతో తహసీల్దార్‌పై కిశోర్ పలుమార్లు ఫోన్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తిడి చేసినా రెగ్యులరైజ్ చేయలేమని తహసీల్దార్ కిశోర్‌కు తేల్చిచెప్పారు. కోపోద్రిక్తుడైన కిశోర్ ‘నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. నీ అంతు చూస్తా. వెంటనే లీవ్ పెట్టి వెళ్లిపో’ అని తహసీల్దార్‌ను బెదిరించాడు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ‘కొంచెం చూసుకుని వెళ్లు’ అని సమాధానం రావడంతో అవాక్కవడం తహసీల్దార్ వంతయింది. ఒత్తిడిని తట్టుకోలేక నెల రోజులు సెలవుపై వెళ్లాడు. ఇదే క్రమంలో కలికిరి గ్రామ వీఆర్వో కూడా 15 రోజులు సెలవుపై వెళ్లారు. నోరు తెరిస్తే బూతులే.. వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేసేందుకు ప్రభుత్వం డీఆర్డీఏ వెలుగు ద్వారా మండలానికి ఒక ట్రాక్టర్ కేటాయించింది. ఒక్కసారి కూడా రైతులు ట్రాక్టర్‌ను ఉపయోగించుకోలేదు. స్థానిక ఏపీఎం ఒక రైతుకు నెలసరి బాడుగకు ఇచ్చాడు. ఈ సమాచారం తెలుసుకున్న కిశోర్ శుక్రవారం ఏపీఎంను పిలిచి దుర్భాషలాడారని తెలిసింది. ఎవర్నడిగి ట్రాక్టర్ బాడుగకు ఇచ్చావు.. ఏం తమాషాలు చేస్తున్నావా? ప్రభుత్వం మాది. అంటూ తిట్ల దండకం ఎత్తుకున్నారని భోగట్టా. దీంతో ఆ ఏపీఎం లీవుపై వెళ్లడానికి సిద్ధమయ్యాడు. మిగతా మండలాల్లోనూ ఇదే పరిస్థితి.. పీలేరు నియోజకవర్గంలోని మిగతా మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్లారి ఫోన్ అంటేనే అధికారులు హడలిపోయే పరిస్థితి ఉంది. కొన్నాళ్ల క్రితం పీలేరు ఎంపీడీఓ వసుంధరమ్మకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. పెన్షన్లు నేను చెప్పిన వారికే ఇవ్వాలని బెదిరించడంతో ఆమె కన్నీరుమున్నీరయింది. హౌసింగ్‌లో ప్రోగ్రెస్ లేదని వాయల్పాడు హౌసింగ్ ఏఈ సదాశివారెడ్డిని తిడుతున్నారని సమాచారం. వైఎస్సార్సీపీ వాళ్లకు ఇళ్లను ఎలా కేటాయిస్తావని ప్రశ్నిస్తున్నారని తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని చెబున్నారని అధికారులు వాపోతున్నారు. -
శిల్ప ఆత్మహత్య కేసు : ప్రొఫెసర్‌పై వేటు
సాక్షి, పీలేరు : జూనియర్ డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసుపై ప్రభుత్వం స్పందించింది. ఆత్మహత్యకు ప్రొఫెసర్ రవికుమార్ కారణమని బంధువులు ఆందోళనకు దిగడంతో రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. శిల్ప ఆత్మహత్యపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయాలని ఆదేశించారు. డీఎంఈ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రొఫెసర్లను కాకుండా ఒక్క రవికుమార్నుమాత్రమే సస్పెండ్ చేయడంపై జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా ఇద్దరు ఫ్రొఫెసర్లు డాక్టర్ కిరీటి, శివకుమార్లను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శిల్ప ఆత్మహత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. శిల్పను ప్రొఫెసర్ రవికుమార్ లైంగిక వేధింపులకు గురిచేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా నిన్న సాయంత్రం విడుదలైన పీజీ ఫలితాల్లో శిల్ప ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారనే కోపంతోనే కావాలని ప్రొఫెసర్లు ఫెయిల్ చేశారని, ఆ బాధతోనే శిల్ప ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.వెయ్యి కోసం మహిళ హత్య!
పోలీసుల అదుపులో నిందితులు అనాథలుగా మిగిలిన ఇద్దరు చిన్నారులు పీలేరు: మండలంలోని కంచెంవారిపల్లెలో బుధవారం తెల్లవారుజామున ఒక మహిళను దుండగులు రూ.1000 కోసం హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. పీలేరు మండలం తలపుల పంచాయతీ చిన్నయ్యగారిపల్లెకు చెందిన జె.మల్లయ్య కుమార్తె ఈశ్వరమ్మ(35)ను 15 ఏళ్ల క్రితం వేపులబైలు పంచాయతీ కంచెంవారిపల్లెకు చెందిన నరసింహులుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమార్తె భార్గవి(14), కుమారుడు నరేంద్ర(5) ఉన్నారు. మూడేళ్ల క్రితం నరసింహులు మృతిచెందాడు. ఈశ్వరమ్మ కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. మంగళవారం వితంతు పెన్షన్ రూ.1000 తీసుకుంది. రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేసి ఇంట్లో పడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈశ్వరమ్మ ఇంటిపక్కన శవమై పడి ఉండడాన్ని మరిది లక్ష్మినారాయణ గుర్తిం చాడు. ఈ విషయాన్ని ఇరుగు పొరుగు వారికి, బంధువులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న పీలేరు ఎస్ఐ సురేష్‌బాబు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈశ్వరమ్మ ఐదేళ్లుగా స్థానిక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో సహాయకురాలిగా పనిచేస్తోంది. అనాథలైన చిన్నారులు అనారోగ్యంతో తండ్రి మృతిచెందాడు. తల్లి హత్యకు గురికావడంతో పిల్లలు భార్గవి, నరేంద్ర అనాథలయ్యారు. భార్గవి స్థానిక జంగంపల్లె ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కుమారుడు నరేంద్ర అంగన్వాడీ కేంద్రానికి వె ళుతున్నాడు. తల్లికోసం చిన్నారులు విలపిస్తుంటే పలువురు కంటతడి పెట్టారు. అది పెన్షన్ డబ్బు పోలీసులు కంచెంవారిపల్లెకు చేరుకుని హత్యకు దారి తీసిన కారణాలపై గ్రామస్తులను ఆరా తీశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చంద్ర, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈశ్వరమ్మ మంగళవారం తీసుకున్న వితంతు పెన్షన్ రూ.1000ల కోసం గొంతునులిమి చంపేసినట్లు చంద్ర అంగీకరించినట్టు సమాచారం. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు రూరల్ సీఐ మహేశ్వర్ తెలిపారు. -
'చికెన్ కోసం చిత్తుగా తన్నుకున్నారు'
చిత్తూరు : వాళ్లిద్దరూ బాధ్యత గల పోలీసులు. అయితే ఆ విషయాన్ని వాళ్లిద్దరూ మరచారు. చికెన్ ముక్కల కోసం చిత్తు చిత్తుగా కొట్టుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పీలేరు పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చంద్ర, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చలపతి...ఓ దాబాలో విందును ఏర్పాటు చేసుకున్నారు. అయితే చికెన్ పంపకాల్లో తేడా రావడంతో... ఇద్దరు వాగ్వాదానికి దిగారు. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు కొట్లాటకు దిగారు. అడ్డొచ్చిన ఇతర సిబ్బందిపై కూడా చేయిచేసుకున్నారు. చితకబాదుకుని చివరకు తీవ్రంగా గాయపడి ఇద్దరూ ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటనపై పీలేరు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. -
భర్తను కడతేర్చిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని చంపేసిందన్న బంధువులు పోలీసుల అదుపులో మృతుడి భార్య, అత్తామామలు పీలేరు: మండలంలోని దేశిరెడ్డిగారిపల్లెలో ఓ వివాహిత తల్లిదండ్రులతో కలసి భర్తను హతమార్చింది. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పీలేరు మండలం బాలంవారిపల్లె పంచాయతీ పరిధిలోని దే శిరెడ్డిగారిపల్లెకు చెంది వీరయ్య, సరస్వతమ్మల ఏకైక కుమార్తె సుజాతను 17 ఏళ్ల కిందట ఎర్రావారిపాళ్యం మండలం వీఆర్ అగ్రహారానికి చెందిన రామకృష్ణ కుమారుడు మోహన్రావ్తో వివాహం జరిగింది. సుజాత ఒక్కటే సంతానం కావడంతో ఇల్లరికం వచ్చేశాడు. ఆటో నడపడం, కూలే జీవనాధారంగా కుటుంబాన్ని పోషించేవాడు. వీరి కుమార్తె మౌనిక తొమ్మిదో తరగతి, కుమారుడు మధుసూదన్ ఏడో తరగతి చదువుతున్నారు. మృతుడు మద్యానికి బానిస కావడంతో తరచూ ఇంటిలో గొడవలు జరిగేవి. ఏడాది కిందట మోహన్రావ్పై భార్య సుజాత పీలేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కొంత కాలం జైలుకు వెళ్లి వచ్చాడు. నూతన సంవత్సరం కావడంతో గురువారం పిల్లలను ఆటోలో తలకోనకు తీసుకుపోయి రాత్రి ఇంటికి వచ్చాడు. అప్పటికే మద్యం తాగిన మోహన్‌రావు మత్తుగా నిద్రపోయాడు. భార్య సుజాత, మామ వీరయ్య, ఇతర కుటుంబ సభ్యులు రోకలిబండతో తలపై కొట్టడంతో నిద్రలోనే మృతిచెందాడు. స్థానికులు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ టి.నరసింహులు, ఎస్ఐ సిద్ధతేజమూర్తి సిబ్బందితో దేశిరెడ్డిగారిపల్లెకు చేరుకున్నారు. స్థానికులు, బంధువులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పథకం ప్రకారం భార్య, అత్తమామలు హత్య చేశారని మృతుడి అన్న సుధాకర్, వదిన పార్వతి, బంధువులు ఆరోపించారు. భార్య, అత్తమామలు మరో వ్యక్తితో కలసి నిద్రలో హత్యచేశారని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సుజాత, మామ వీరయ్య, అత్త సరస్వతమ్మ, ఇద్దరు పిల్లలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పథకం ప్రకారం భార్య, మామే హత్య చేశారని పోలీసులు చెపుతున్నారు. -
జీటీ ఎక్స్‌ప్రెస్‌లో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
-
జీటీ ఎక్స్‌ప్రెస్‌లో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
కడప : ఎర్రచందనం స్మగ్లర్ల కోసం టాస్క్‌ఫోర్స్ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జీటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న 105మంది ఎర్రచందనం స్మగర్లను రైల్వే కోడూరులో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో బడా స్మగ్లర్లు ఉన్నట్లు సమాచారం. వీరంతా తమిళనాడు వాసులుగా అధికారులు గుర్తించారు.స్మగర్లను తిరుపతి అటవీశాఖ కార్యాలయానికి తరలించనున్నారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్లు ఆదివారం రెచ్చిపోయి ఇద్దరు అటవీశాఖ అధికారులను హతమార్చడం, మరో ఆరుగురిని గాయపర్చడంతో పీలేరు కేంద్రంగా సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా మరోమారు చర్చనీయాంశమైంది. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పీలేరు నియోజక వర్గం అడ్డాగా మారుతోంది. పీలేరు నుంచి చెన్నై, బెంగళూరుకు వెళ్లే రహదారులు ఉన్నాయి. ఎర్రచందనం ఎక్కువగా ఉన్న శేషాచలం అడవులు దగ్గర కావటంతో పాటు స్మగ్లర్లకు రాజకీయ నేతలు, అధికారుల సహకారం ఇవన్నీ కూడా అక్రమరవాణా పెరగడానికి కారణాలు అవుతున్నాయి.