'చికెన్ కోసం చిత్తుగా తన్నుకున్నారు' | fight between constables for chicken curry in peleru | Sakshi
Sakshi News home page

'చికెన్ కోసం చిత్తుగా తన్నుకున్నారు'

Published Mon, Feb 23 2015 2:06 PM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

'చికెన్ కోసం చిత్తుగా తన్నుకున్నారు' - Sakshi

'చికెన్ కోసం చిత్తుగా తన్నుకున్నారు'

చిత్తూరు : వాళ్లిద్దరూ బాధ్యత గల పోలీసులు. అయితే  ఆ విషయాన్ని వాళ్లిద్దరూ మరచారు. చికెన్ ముక్కల కోసం చిత్తు చిత్తుగా కొట్టుకున్నారు.  చిత్తూరు జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పీలేరు పోలీస్‌ స్టేషన్ ట్రాఫిక్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చంద్ర, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చలపతి...ఓ దాబాలో విందును ఏర్పాటు చేసుకున్నారు.

 

అయితే చికెన్ పంపకాల్లో తేడా రావడంతో... ఇద్దరు వాగ్వాదానికి దిగారు. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు కొట్లాటకు దిగారు. అడ్డొచ్చిన ఇతర సిబ్బందిపై కూడా చేయిచేసుకున్నారు. చితకబాదుకుని చివరకు తీవ్రంగా గాయపడి ఇద్దరూ ఆస్పత్రి పాలయ్యారు.  ఈ సంఘటనపై పీలేరు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement