chicken curry
-
గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని.. ఒక్కసారిగా భీమ్లానాయక్..
సంగారెడ్డి: మద్యం మత్తులో పచ్చి చికెన్ తినడంతో గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధి నవాబుపేట పంచాయతీ రాములు తండాలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నుర మండలం కొత్తగూడం తండాకు చెందిన భీమ్లానాయక్(40) నాలుగు నెలల నుంచి రాములు తండాలోని అత్తగారి ఇంటి వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దసరా సెలవులు కావడంతో భీమ్లానాయక్ ఇద్దరు కూతుళ్లు గురువారం హాస్టల్ నుంచి తండాకు వచ్చారు. వారి కోసం తెచ్చి ఉంచిన మాంసాన్ని మద్యం మత్తులో ఉన్న భీమ్లానాయక్ తిన్నాడు. దీంతో చికెన్ ముక్కలు గొంతులో ఇరుక్కోవడంతో కుటుంబ సభ్యులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికాంత్రావ్ తెలిపారు. -
‘చికెన్ కర్రీలో ఎలుక’ ఎపిసోడ్లో ట్విస్ట్!
రెస్టారెంట్లో చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక కనిపించడం.. ఆ వార్త ప్రముఖంగా వార్తల్లో, సోషల్ మీడియా ద్వారా వైరల్ అవ్వడం తెలిసిందే. అయితే.. ముంబై బాంద్రాలో జరిగిన ఈ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కస్టమర్లు ఫుల్‌గా తాగొచ్చి అల్లరి చేయడమే కాకుండా.. తప్పుడు కేసు బనాయించారని రెస్టారెంట్ మేనేజర్ వాపోతున్నాడు. ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. అనురాగ్ సింగ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి బాంద్రా వెస్ట్ పరిధిలోని పాలి నాకాలోని పాపా పంచావో దా దాబా రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు వెళ్లాడు. అక్కడ చికెన్, బ్రెడ్‌తో మటన్ తాలి ఆర్డర్ చేశారు. ఫుడ్ తింటుండగా మాంసం ముక్క రుచిలో తేడా అనిపించడంతో పరీక్షించి చూడగా అందులో చనిపోయిన చిన్న ఎలుక కనిపించింది. దీనిపై కంగుతిన్న కస్టమర్ రెస్టారెంట్ మేనేజర్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. మేనేజర్ తీరుపై ఆగ్రహంతో బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా బాంద్రా పోలీసులు రెస్టారెంట్ మేనేజర్, చెఫ్‌తో పాటు సర్వర్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తాగి వచ్చి డ్రామాలు గత 22 ఏళ్లుగా రెస్టారెంట్ నడుస్తోంది. ఇంతవరకు ఇలాంటివి జరగలేదు. మద్యం మత్తులో ఆ ఇద్దరూ మా రెస్టారెంట్‌కు వచ్చారు. వచ్చాక కూడా తాగుతూ కనిపించారు. మందు కోసం డిమాండ్ చేశారు. మాది కేవలం ఫుడ్ డైనింగ్ మాత్రమని స్పష్టం చేసినా వినిపించుకోలేదు. సర్వర్‌తో గొడవ పడ్డారు. చివరకు చచ్చిన ఎలుకతో డ్రామాకు దిగారు. డబ్బు ఇస్తేనే సైలెంట్‌గా వెళ్లిపోతామని చెప్పారు. మేం ఒప్పుకోకపోవడంతో ఇంత రాద్ధాంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీ గమనిస్తే.. వాస్తవాలు బయటపడతాయి అని మేనేజర్, సర్వర్లు చెబుతున్నారు. బెయిల్‌పై విడుదల అయితే రెస్టారెంట్ పేరును దెబ్బ తీయడంతోపాటు డబ్బు వసూలు చేసే ఉద్దేశంతోనే రెస్టారెంట్‌పై అపవాదు మోపారని నిందితుల తరపు న్యాయవాది చెబుతున్నారు. మంగళవారం నిందితులు ముగ్గురినీ బెయిల్‌పై విడుదల చేశారు పోలీసులు. కలుషిత ఆహారం నేరం కింద కేసు నమోదు అయ్యిందని.. ఎలుక బయటపడిందిగా చెబుతున్న ప్లేట్‌ను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు పంపామని.. నివేదిక వస్తే అసలు విషయం బయటపడుతుందని బాంద్రా పోలీస్ అధికారి చెబుతున్నారు. @MumbaiPolice Rat found in our gravy at #papaPanchodadhaba near Pali naka Bandra West . No manager or owner is ready to listen . We called police and 100 as well . No Help yet . @mumbaimirror @TOIMumbai pic.twitter.com/YRJ4NW0Wyk — Stay_Raw (@AMINKHANNIAZI) August 13, 2023 చదవండి: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే.. -
కోడికూర తిని 30 మంది విద్యార్థులకు అస్వస్థత
మైసూరు: కోడికూరతో భోజనం చేసిన సుమారు 30 మందికి పైన విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. ఈ సంఘటన చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తలూకాలోని యడవనహళ్లి గ్రామంలోని మొరార్జీదేశాయ్ వసతి పాఠశాలలో జరిగింది. ఆదివారం రాత్రి సుమారు 30 మందికి పైన విద్యార్థులు చికెన్ భోజనం తిన్నారు. కొంతసేపటికి వాంతులు, విరోచనాలు ప్రారంభం కావడంతో 15 మందిని బేగూరు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో 15 మందిని చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. విద్యాశాఖ అధికారులు, పోలీసులు విద్యార్థులతో మాట్లాడి కారణాలపై ఆరా తీశారు. అపరిశుభ్రమైన వంట పాత్రలు, నాణ్యత లేని చికెన్ వల్లే ఇలా జరిగి ఉంటుందని అనుమానం. చదవండి: వందేభారత్ స్టాప్ కోసం సుప్రీంలో పిటిషన్.. సీరియస్ అయిన చీఫ్ జస్టిస్ -
చికెన్ కాకుండా వంకాయ కూర వండిందని.. భార్యపై భర్త సీరియస్.. ఆపై
సాక్షి, మంచిర్యాల జిల్లా: చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో నచ్చిన కూర వండలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. రాత్రి చికెన్ వండాలని కోరితే.. వంకాయ కూర వండిందని అదే రాత్రి భార్యను గోడ్డలితో దారుణంగా హత్యచేశాడు. భార్య గాలిపెల్లి శంకరమ్మ (45) నిద్రిస్తున్న సమయంలో భర్త గాలిపెల్లి పోశం (50) గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపి పరారయ్యారు. నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు వీపరీతంగా పెరిగిపోతున్నాయని పోలీసులు చెబుతున్నారు. చిన్న కారణాలపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారని, ఇది వరకు మాటలకు పరిమితమయిన వాళ్లు ఇప్పుడు చేతలకు దిగుతున్నారని తెలిపారు. పెరిగిపోతోన్న కోప తాపాలను అదుపులో పెట్టుకోవాలని, భార్యాభర్తలిద్దరికీ ఓపిక, సహనం ఉండాలని సూచిస్తున్నారు. చదవండి: పెళ్లయిన పది రోజులకే నవవధువు ఆత్మహత్య -
ఈ వీడియో చూస్తే.. రెస్టారెంట్లో చికెన్ కర్రీ ఆర్డర్ చేయరు!
ఇంటి వంట ఎంత రుచి, శుచిగా ఉన్నా రెస్టారెంట్లను అప్పుడప్పుడు సందర్శించాల్సిందే. ఇదే ప్రస్తుత ట్రెండ్. కొన్ని పుడ్ ఐటమ్స్ ఫలానా రెస్టారెంట్లో బాగుంది అని తెలిస్తే చాలు.. క్యూలో ఉండి ఆ వంటకాన్ని ఇంటికి తెచ్చుకోవడమో, లేదా అక్కడే తినడమో చేస్తుంటారు. రెస్టారెంట్లో పుడ్ అనగానే రుచి వరకు ఓకే గానీ నాణ్యత విషయంలో మాత్రం అంతంత మాత్రమేనన్న ఘటనలు బోలెడు ఉన్నాయి. ఇక వెజ్ పరిస్థితి ఎలా ఉన్నా నాన్‌వెజ్ వంటకాల విషయంలో మాత్రం కొన్ని రెస్టారెంట్లు క్వాలిటీ పరంగా షాక్‌లు ఇస్తూనే ఉంటాయి. తాజాగా పంజాబ్‌లోని లుధియానాలో ఓ కస్టమర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. చికెన్ కర్రీలో ఎలుకలుంటాయ్ వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి లుధియానాలోని ప్రకాష్ ధాబాకు వెళ్లాడు. వెయిటర్ తన వద్దకు రాగానే.. ఆ వ్యక్తి తనకు నచ్చిన చికెన్ కర్రీ ఆర్డర్ చేశాడు. కాసేపు అనంతరం ఆర్డర్ తన టేబుల్ ముందుకు వచ్చింది. ఇక ఆకలిగా ఉన్న ఆ కస్టమర్.. ఓ పట్టు పట్టాలని తినేందుకు రెడీ అయ్యాడు. అంతలో చికెన్ గ్రేవీలో ఎలుక కనిపించింది. చికెన్ ముక్క అనుకుని గబుక్కున నోట్లో వేసుకుందామని చూసిన ఆ కస్టమర్ దెబ్బకు హడలిపోయాడు. సిబ్బందికి ఈ విషయం చెప్పగా.. వాళ్లు పట్టించుకోకపోవడమే కాకుండా.. అసలు తమది తప్పే కాదన్నట్టుగా మాట్లాడారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ కస్టమర్. ఆ వీడియోలో.. "ప్రకాష్ ధాబా లూథియానా. ఇండియా చికెన్ కర్రీలో ఎలుకను వడ్డించండి. రెస్టారెంట్ యజమాని ఫుడ్ ఇన్స్పెక్టర్కి లంచం ఇవ్వడంతో ఇంత స్వేచ్ఛగా ప్రవర్తిస్తున్నారా ??? అనేక భారతీయ రెస్టారెంట్లలోని కిచెన్‌లో ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి" అని పోస్ట్ కింద క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఇదిలా ఉండగా రెస్టారెంట్ యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఆ కస్టమర్ కావాలనే తమ హోటల్ గుడ్ విల్ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం కస్టమర్‌కే సపోర్ట్ చేశారు. అంత పెద్ద తప్పు చేసి మళ్లీ బుకాయిస్తున్నారా అంటూ మండి పడుతున్నారు. ఇంకొందరు...అసలు ఆ రెస్టారెంట్ లైసెన్స్‌ని క్యాన్సిల్ చేసేయాలని ఫైర్ అవుతున్నారు. లుధియానాలో ఇదేం కొత్త కాదు. చాలా రెస్టారెంట్లలో ఇదే పరిస్థితి ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Parkash dhaba Ludhiana. India Serve rat in chicken curry. Restaurant owner bribe the food inspector and go free??? Very poor standards in Kitchen of many Indian restaurants. Be aware . pic.twitter.com/chIV59tbq5 — NC (@NrIndiapolo) July 3, 2023 -
ఆహా ఏమి రుచి.. అంకాపూర్ దేశీ కోడి కూరకు 50 ఏళ్లు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ ‘అంకాపూర్ దేశీ చికెన్’.. ఈ పేరు వింటే చాలు మాంసం ప్రియులకు నోట్లో నీళ్లూరుతాయి. ఎన్ని రకాల చికెన్ ఐటమ్స్ ఉన్నా.. ఈ దేశీ (నాటు) కోడి కూర రుచే వేరంటే అతిశయోక్తి కాదు. నాన్‌వెజ్ ప్రియులు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా అంకాపూర్ వచ్చి మరీ ఈ కోడి కూరను ఆస్వాదిస్తుంటారు. 50 ఏళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో ప్రారంభమైన ఈ దేశీ కోడి కూర ఇప్పటికీ తిరుగులేని బ్రాండ్ ఇమేజ్‌తో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అంకాపూర్ గ్రామానికి చెందిన దుబ్బ గౌడ్, లక్ష్మి దంపతులకు వచ్చిన ఆలోచన.. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ ఊరి పేరును మార్మోగిస్తోంది. ఈ పేరుతో అనేకచోట్ల హోటళ్లు, ఆర్డర్ మెస్‌లు ఏర్పాటు కావడం విశేషం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అనేక మంది జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులు ఈ అంకాపూర్ దేశీ కోడి కూరను రుచి చూసి మెచ్చుకున్న వారే కావడం గమనార్హం. కల్లు తాగే వారి కోసం.. గీత కార్మికుడైన బుర్ర దుబ్బగౌడ్ కల్లు తాగేందుకు తన వద్దకు వచ్చే వారికి.. నాటు కోడి కూర వండి విక్రయించేవాడు. క్రమంగా దుబ్బగౌడ్ దగ్గరికి కల్లు కోసం వచ్చేవారి సంఖ్య పెరిగింది. దీంతో దుబ్బ గౌడ్, అతని భార్య లక్ష్మి దేశీ కోడి కూరతో పాటు బాతు కూర, ఆమ్లెట్లు వేసివ్వడం ప్రారంభించారు. ఇందుకోసం గ్రామంలోని తమ ఇంటి వద్దనే దేశీ కోళ్లు, బాతులు పెంచడం ప్రారంభించారు. గిరాకీ పెరగడంతో మునిపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల నుంచి రెండున్నర రూపాయల నుంచి మూడు రూపాయలకు ఒక కోడిని కొనుగోలు చేసి నలుగురు వ్యక్తులు తినడానికి సరిపడా కిలో బియ్యంతో అన్నం వండి రూ.5కు అందించడంతో క్రమంగా వారి వ్యాపారం పుంజుకుంది. లాభాల బాటలోకి వచ్చిన ఈ దంపతులను చూసి అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి రామగౌడ్, తాళ్లపల్లి మల్లాగౌడ్, బోండ్ల భాజన్న కూడా దేశీ కోడి కూర వంటకం ప్రారంభించారు. పదేళ్ల పాటు గ్రామంలోని గాంధీ చౌరస్తాలో నాటు కోడి కూర వ్యాపారం చేసిన దుబ్బ గౌడ్, లక్ష్మి దంపతులు పోటీ అధికం కావడంతో విరమించుకుని జీవనోపాధి కోసం హోటల్ పెట్టుకున్నారు. ప్రస్తుతం వీరు కాలం చేశారు. ఈ దంపతులు ప్రారంభించిన దేశీ కోడి కూర రుచి, అంకాపూర్ పేరు క్రమంగా అంతర్జాతీయ స్థాయికి విస్తరించాయి. డెలివరీ @ ‘డోర్ స్టెప్’ ఒక కోడి ఆర్డర్ చేసిన వారు తమ గ్రామ శివారులో ఎక్కడ కూర్చున్నా తోటలు, పంట పొలాలు, ఇళ్లకు నేరుగా వెళ్లి అందిస్తున్నారు. భోజనం తరువాత గిన్నెలను సైతం వారే తీసుకెళుతున్నారు. వండి నేరుగా తెచ్చి ఇస్తుండడంతో పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పంట పొలాల్లో, మామిడి తోటల్లో భోజనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు నిజామాబాద్, ఇతర గ్రామాల్లో కూడా ఆర్డర్ మెస్‌లు ప్రారంభించారు. అంకాపూర్ గ్రామం జాతీయ రహదారికి పక్కనే ఉండడంతో ఇక్కడ ఎర్రజొన్న సీడ్ వ్యాపారం అభివృద్ధి చెందింది. సుమారు 40 సీడ్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. మరోవైపు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావడంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తరచూ అంకాపూర్‌ను సందర్శిస్తున్నారు. దేశీ కోడి కూరను రుచి చూసి వివిధ ప్రాంతాల్లో దీని గురించి చెప్పడంతో ప్రాచుర్యం పొందింది. అంకాపూర్ దేశీ కోడి ఆర్డర్ మెస్‌ల నిర్వాహకులు కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో దేశీ కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఒరిజినల్ కోడి అయితే ఎక్కువ ధర.. అంకాపూర్ దేశీ కోడి (క్రాస్ బ్రీడ్) కూరను సొంతంగా తయారు చేసిన ప్రత్యేకమైన మసాలాలు దట్టించి వండటంతో దానికి మంచి రుచి వస్తుంది. కోరిన వారికి ఎల్లిగడ్డ కారం సైతం ప్రత్యేకంగా ఒక గిన్నెలో పెట్టి ఇస్తారు. భోజన ప్రియులు, ముఖ్యంగా నాన్‌వెజ్ ప్రియులు ఈ కూరను ఇష్టంగా తింటున్నారు. అయితే 50 ఏళ్ల క్రితం కిలోకు రూ.5తో ప్రారంభమైన ఈ దేశీ కోడి కూర, అన్నం ధర ప్రస్తుతం రూ.1,000 వరకు ఉంటోంది. గ్రామంలో సుమారు పది మంది ఆర్డర్ మెస్‌లు నెలకొల్పారు. ప్రస్తుతం రూ.700కు నలుగురికి సరిపడా ఫారంలో పెంచిన దేశీ కోడి కూర, అన్నం చేసి ఇస్తున్నారు. ఆర్డర్ మెస్‌లోనే తినేవారికి రూ.130కు ప్లేట్ చొప్పున వడ్డిస్తున్నారు. ఇక గ్రామాల్లో పెరిగిన ఒరిజినల్ దేశీ కోడికి మాత్రం రూ.1,000 వరకు తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాలకూ విస్తరణ.. పాతికేళ్ల క్రితం వరకు కేవలం అంకాపూర్ గ్రామానికే పరిమితమైన ఆర్డర్ మెస్‌లు ప్రస్తుతం విస్తరించాయి. ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో సైతం అంకాపూర్ దేశీ కోడి కూర పేరుతో ఆర్డర్ మెస్‌లు వెలిసాయి. హైదరాబాద్‌లోని కొంపల్లి, మేడ్చల్ తదితర ప్రాంతాలకు నిజామాబాద్, పెర్కిట్, మామిడిపల్లి కేంద్రాలకు విస్తరించాయి. నిజామాబాద్ జిల్లాలో సుమారు వందకు పైగా అంకాపూర్ దేశీ కోడి కూర అందించే ఆర్డర్ మెస్‌లు ఉండగా.. ఒక్క ఆర్మూర్ మండలంలోనే 50కి పైగా ఆర్డర్ మెస్‌లు ఉన్నాయి. అయితే ఈ దేశీ కూర మెస్‌లను అంకాపూర్ వాసులే కాకుండా వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం ఏర్పాటు చేసి ఆర్మూర్ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. విదేశాలకూ పార్శిల్స్.. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పలువురు అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం అక్కడ స్థిరపడిన వారి కోసం బంధువులు అంకాపూర్ దేశీ కోడి కూరను ఇక్కడ ప్రత్యేకంగా ప్యాక్ చేయించి కొరియర్ ద్వారా పంపిస్తున్నారు. ప్రత్యేక మసాలాలతో ప్రత్యేక రుచి.. ఇంట్లో వండే చికెన్‌లా కాకుండా మేము ప్రత్యేకంగా తయారు చేసిన కొన్ని మసాలాలు దట్టించి దేశీ కోడి కూరను వండుతాం. చాలా రుచికరంగా ఉంటుండటంతో భోజన ప్రియులు తినడానికి ఆసక్తి చూపుతున్నారు. –కుంట నారాయణ గౌడ్, ఆర్డర్ మెస్ నిర్వాహకుడు, అంకాపూర్ అంతర్జాతీయ గుర్తింపుతో ఆనందం అంకాపూర్ దేశీ కోడి కూర తినడానికి వివిధ ప్రాంతాల నుంచి భోజన ప్రియులు వస్తున్నారు. కోరిన విధంగా వారికి వండి పెడుతున్నాము. అంతర్జాతీయ స్థాయిలో అంకాపూర్‌కు గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. – తాళ్లపల్లి శ్రీకాంత్, ఆర్డర్ మెస్ నిర్వాహకుడు, అంకాపూర్ అంకాపూర్‌ను మించి పెర్కిట్‌లో వ్యాపారం.. దేశీ కోడి తినాలనుకున్న భోజన ప్రియులు కోరిన విధంగా వండి ఇస్తున్నాము. అంకాపూర్ కంటే పెర్కిట్, మామిడిపల్లిలో దేశీ కోడి ఆర్డర్ మెస్ వ్యాపారం చాలా ఎక్కువగా జరుగుతోంది. పట్టణ ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు. – జీవన్‌గౌడ్, ఆర్డర్ మెస్ నిర్వాహకుడు, పెర్కిట్, ఆర్మూర్ -
కోడి కూరతో అన్నం పెట్టమన్నాడు.. ఆ మాటకు గొడ్డలితో నరికేశాడు
కూనవరం (తూర్పుగోదావరి): కోడి కూర వండలేదని చెల్లెలిని హతమార్చాడో అన్న కూనవరం మండలం కన్నాపురంలో గురువారం రాత్రి ఈ ఘోరం జరిగింది. ఎస్సై వెంకటేష్ కథనం ప్రకారం.. కన్నాపురానికి కొవ్వాసి నందా కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటాడు. అతడి సోదరి సోమమ్మ(20)ను చాన్నాళ్ల క్రితం మరొకరికి దత్తత ఇచ్చారు. వారం రోజుల క్రితం ఆమె తన అన్న నందా ఇంటికి వచ్చింది. కోడి కూర వండాలని సోదరికి చెప్పి గురువారం నందా బయటకు వెళ్లాడు. మద్యం తాగి అర్ధరాత్రి ఇంటికి వచ్చి, కోడి కూరతో అన్నం పెట్టాలని చెల్లెలికి చెప్పాడు. కోడి కూర వండలేదని ఆమె చెప్పడంతో కోపోద్రిక్తుడై బయటకు వెళ్లిపోయాడు. తెల్లవారుజామున వచ్చి మళ్లీ ఆమెతో గొడవ పడ్డాడు. అక్కడే ఉన్న గొడ్డలితో ఆమెను నరికేశాడు. సంఘటన స్థలంలోనే సోమమ్మ మృతి చెందింది. ఎటపాక సీఐ గజేంద్రకుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నందా పరారీలో ఉన్నాడు. చదవండి: (లక్షలాది రూపాయలు వడ్డీకిచ్చి.. మనోవేదనతో) -
కాలం మారింది.. ఇక మీ టేబుల్ వద్దకు వెయిటర్స్ రారు, అంతా మీ చేతుల్లోనే!
తరాలు మారుతున్న కొద్దీ ప్రజల్లో అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు, అభిరుచులు ఆలోచనా విధానాల్లో విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. తదనుగుణంగా ఆధునిక జీవనశైలి అలవర్చుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచం డిజిటల్ వైపు పరుగులు తీస్తోంది. అందుకు హోటళ్లు, రెస్టారెంట్ పరిశ్రమలు సైతం మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో ఆయా రంగాలు.. సాధారణ ముద్రిత మెనూల స్థానంలో ‘డిజిటల్ మెనూ’ను ప్రవేశపెడుతున్నాయి. వెయిటర్స్‌తో సంబంధం లేకుండా కూర్చున్న చోటు నుంచే వినియోగదారులు ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి, బిల్లు చెల్లింపులు చేసేందుకు ‘నో టచ్ ఆర్డరింగ్’ పేరుతో క్యూఆర్ కోడ్ సాయంతో డిజిటల్ మెనూను తీసుకొస్తున్నాయి. – సాక్షి, అమరావతి నో వెయిటింగ్.. ఈజీ ఆర్డర్ టేబుల్‌పై ఉంచిన ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లో రెస్టారెంట్లో లభించే పదార్థాల వివరాలను పొందుపరుస్తారు. దానికే సంబంధిత బ్యాంకు ఖాతాను జత చేస్తారు. వినియోగదారులు స్మార్ట్ ఫోన్‌తో కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా డిజిటల్ మెనూను వీక్షించవచ్చు. నచ్చిన ఆహారాన్ని వెయిటర్ సాయం లేకుండానే ఆర్డర్ చేయొచ్చు. ఇక్కడ ‘కిచెన్ టు టేబుల్’ (కేవోటీ)విధానంలో కోరిన ఆహారం జాప్యం లేకుండానే అందుతుంది. ఎలా తయారు చేస్తున్నారో చూడొచ్చు.. అన్య దేశాలకు చెందిన సంస్థల్లో ప్రత్యేకమైన డిజిటల్ మెనూ అందుబాటులో ఉంది. వాటిలో ట్యాబ్‌లను డిజిటల్ మెనూలుగా డైనింగ్ టేబుళ్లకు జోడిస్తున్నారు. మరోవైపు ‘సెల్ఫ్ ఆర్డరింగ్ కియోస్క్’లో మనం ఆర్డర్ చేసే పదార్థాన్ని 3డీ రూపంలో ముందుగానే చూపిస్తున్నారు. ఇక ఇంటరాక్టివ్ డిస్ప్లే టేబుల్స్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువు వచ్చేలోగా కిచెన్‌లో అది తయారు చేసే విధానాన్ని వీక్షించవచ్చు. టెక్నాలజీ వైపు.. కోవిడ్ తర్వాత భారతదేశంలోని దాదాపు మూడింట ఒకవంతు రెస్టారెంట్లు క్యూఆర్ కోడ్ ఆర్డరింగ్ టెక్నాలజీని చురుకుగా ఉపయోగిస్తున్నట్టు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2021 చివరి నాటికి దేశంలోని 80 శాతం రెస్టారెంట్లు క్యూఆర్ కోడ్లు, ఇతర ఆన్లైన్ ఆర్డరింగ్ టెక్నాలజీలోకి వస్తాయని అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లలో మాత్రమే డిజిటల్ మెనూ అమలవుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని హరిత హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లలో డిజిటల్ మెనూ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు పర్యాటక శాఖ చర్యలు చేపడుతోంది. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత 14 చోట్ల అందుబాటులోకి తేనున్నామని ఏపీటీడీసీ ఎండీ సత్యనారాయణ చెప్పారు. శ్రామిక శక్తి సామర్థ్యం పెంపు రద్దీగా ఉండే హోటళ్లలో వెయిటర్‌కు ఆర్డర్ ఇచ్చేందుకు గంటల పాటు ఎదురు చూసే అవస్థలు తప్పుతాయి. ముఖ్యంగా శ్రామిక శక్తి కొరతను, పని భారాన్ని అధిగమించొచ్చు.ఈ డిజిటల్ మెనూలను బహుళ భాషల్లో సులభంగా సృష్టించవచ్చు. -
చికెన్ కర్రీ అదరగొట్టిన రణు మండల్ .. వీడియో వైరల్
రణు మండల్ పేరు గుర్తుందా! అదేనండి ఒకే ఒక్క పాటతో ఓవర్ నైట్ సింగర్ గా మారడమే కాకుండా సెలబ్రిటీ స్టేటస్ సొంతం కూడా చేసుకుంది. అదే ఊపులో బాలీవుడ్ లో పాటలు పాడే అవకాశాలు కూడా వచ్చాయి. ఏమైందో గానీ ఆమె జీవితంలో అనుకోకుండా వచ్చిన అదృష్టం ఆమెను స్టార్ సింగర్ గా మార్చలేకపోయింది. సినిమాలో పాటల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియా లో మాత్రం ట్రెండింగ్ లో ఉంటుంది రాను మండల్. తాజాగా మరోసారి నెట్టింట ఆమె వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. కానీ ఈ సారి పాటతో కాకుండా, ఆమె వంటతో వైరల్ గా మారింది. తాజాగా ఓ యూట్యూబర్.. రాను మండల్ ఇంటికి వెళ్ళాడు. సింగర్ దగ్గర పాట కామన్ అనుకున్నాడో ఏమో వంట వండించాలని ఫిక్స్ అయ్యి తనతో చికెన్ కర్రీ వండించాడు. ఆ వీడియోను తన యూట్యూబ్ చానెల్లో పెట్టాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాను మండల్.. చికెన్ కర్రీ వండుతూ.. పాటలు పాడుతూ.. యూట్యూబ్ వీక్షకులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేసింది. చదవండి:Fake Jalakanya Video: మైపాడు బీచ్‌లో జలకన్య? అసలు నిజం ఏంటంటే.. -
ప్రాణం తీసిన కోడి కూర వివాదం
భోగాపురం: కోడి కూర కోసం రేగిన వివాదం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మృతుడి ఇంట విషాదం నింపింది. మండలంలోని గుడివాడ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, తోటి కూలీలు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... కూలీ పనులు చేసుకుని ఒకే చోట ఉంటూ జీవనం సాగిస్తున్న ఐదుగురు కూలీలు కోడి కూర కోసం గొడవ పడ్డారు. ఈ వివాదంలో కాకి అప్పన్న(38)ను నక్క ప్రసాద్ గజం బద్దతో కొట్టి చంపాడు. నెల్లిమర్లకు చెందిన నక్క ప్రసాద్, బొద్దాన ఆదినారాయణ, శొట్యాన శ్రీను, కాకి అప్పన్న, దర్మాపు రమణ కలిసి నెల్లిమర్లకు చెందిన మేస్త్రీ తివనాల రమణ దగ్గర కూలీ పనులు చేస్తున్నారు. మేస్త్రీ రమణ విశాఖపట్నంకు చెందిన ఉదయ్ అనే బిల్డర్ వద్ద మండలంలోని గుడివాడలో అపార్ట్మెంట్ నిర్మాణానికి సంబంధించి కొన్ని పనులను కాంట్రాక్టు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఐదుగురికి అపార్ట్మెంట్ వద్ద నివాసం ఉండేలా జార్జపుపేట గ్రామానికి చెందిన పాపయ్యమ్మను వంటకు పెట్టి వారికి మెస్ ఏర్పాటు చేశాడు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం పాపయ్యమ్మ వారికి కోడి కూరతో భోజనం తయారు చేసి సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. బయటకు వెళ్లిన ఐదుగురిలో ప్రసాద్, అప్పన్న, రమణ, శ్రీను రాత్రి అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అందరూ కలిసి భోజనం చేసే సమయంలో ప్రసాద్, అప్పన్నల మధ్య కోడి కూర కోసం గొడవ జరిగింది. కోపోద్రేకానికి గురైన ప్రసాద్ గజం బద్దతో అప్పన్నపై దాడికి దిగాడు. మిగిలిన ముగ్గురు ప్రసాద్‌ను అడ్డుకోవడంతో వారిపై కూడా దాడి చేశాడు. దీంతో వారు భయపడి అక్కడి నుంచి పారిపోయారు. అప్పన్న ఒక్కడే కావడంతో అతనిపై విచక్షణరహితంగా దాడి చేసి చేయి విరిచి తల, మర్మాంగాలపై దాడి చేసి హతమార్చి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న అప్పన్న భార్య లక్ష్మి తన పిల్లలు లావణ్య, ఉమశంకర్‌తో కలిసి ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సామాజిక ఆస్పత్రికి తరలించి నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. శొట్యాన శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ యు.మహేశ్ తెలిపారు. -
రష్మిక ‘కోలిపట్టు’ కూరకి ఉపాసన ఫిదా
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు, నటుడు రామ్‌చరణ్ భార్య ఉపాసన కామినేని సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా ఆమె నిత్యం వార్తల్లో ఉంటారు. కోవిడ్ సమయంలో ప్రజల్లో హెల్దీ ఫుడ్ పట్ల అవగాహన పెంచేందుకు `యువర్ లైఫ్ పేరుతో వెబ్ పోర్టల్‌ని, ఓ సోషల్ మీడియాని ప్రారంభించింది. ముందుగా దీనికి గెస్ట్ ఎడిటర్‌గా స్టార్ హీరోయిన్ సమంతని నియమించింది. వీరిద్దరూ కలిసి ఇటీవల హెల్దీ ఫుడ్ విషయంలో ఆవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలతో పాటు హెల్త్ టిప్స్‌ని, ఆరోగ్య కరమైన వంటలకు సంబంధించిన విషయాల్ని వీడియోల రూపంలో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా సమంత స్థానంలో క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్నని గెస్ట్ ఎడిటర్‌గా ఉపాసన సెలెక్ట్ చేసింది. హెల్డీ ఫుడ్‌లో భాగంగా చికెన్‌తో ‘కోలిపట్టు’ కూర వండి ఉపాసనకు రుచి చూపించింది రష్మిక. కోలిపట్టు కూర రుచి చూసిన ఉపాసన రష్మికకు వంద మార్కులేసింది. రష్మిక సూపర్ చెఫ్ అని ప్రశంసించింది. రష్మికకు ఎవరైన చెఫ్‌గా అవకాశం ఇస్తే సూపర్ వంట చేస్తుందని పొగడ్తలతో ముంచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
హైదరాబాద్‌కు అంకాపూర్ చికెన్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకే కాదు సరుకులకు సైతం రవాణా సదుపాయం కల్పిస్తున్నాయి. ఒక ఊరు నుంచి మరో ఊరుకు ప్రయాణికులను చేరవేసినట్లుగానే సరుకులను చేరవేస్తున్నాయి. ఇంటికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులు మొదలుకొని అత్యవసరమైన మందులు, ఆహార పదార్థాలు, పిండివంటల వరకు కార్గో బస్సుల్లో పరుగులు తీస్తున్నాయి. టికెట్టేతర ఆదాయ సముపార్జనలో భాగంగా కార్గో, పార్శిల్ రంగంలోకి అడుగుపెట్టిన ఆర్టీసీ ఇప్పుడు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో లభించే ప్రత్యేక హస్తకళా వస్తువులు, ఆహార పదార్థాలు, పిండి వంటలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. ఇప్పటి వరకు గ్రేటర్లో 5.2 లక్షలకుపైగా పార్శిళ్లను వినియోగదారులకు అందజేసింది. జూన్ నుంచి రూ.2కోట్లకుపైగా ఆదాయాన్ని ఆర్జించింది. మరోవైపు అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్ వంటి సంస్థల తరహాలో నేరుగా వినియోగదారుల ఇళ్ల వద్దకే వస్తువులను చేరవేసేందుకు సన్నద్ధమవుతోంది. కొద్దిరోజుల్లో ఆర్టీసీ పార్శిల్, కార్గో సేవలు ఆన్లైన్లోనే లభించనున్నాయి. అంకాపూర్ టు హైదరాబాద్... నిజామాబాద్‌లోని అంకాపూర్‌లో లభించే చికెన్‌కు హైదరాబాద్‌లో ఎంతో క్రేజ్ ఉంటుంది. ఆ ఊళ్లో చికెన్ కర్రీను తయారు చేసి విక్రయించే వ్యక్తులకు ఇటీవల కాలంలో ఆర్టీసీ పార్శిళ్ల ద్వారా డిమాండ్ పెరిగింది. ప్రత్యేకమైన మసాలాలతో, ఎంతో రుచిగా వండడం వల్ల అంకాపూర్ నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజు వందలాది పార్శిళ్లు రవాణా అవుతున్నాయి. పార్శిల్ చార్జీలతో సహా కిలోకు రూ.650 చొప్పున తీసుకుంటున్నారు. “వీకెండ్స్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఒకటి, రెండు రోజులు ముందే ఆర్డర్ ఇస్తారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకల్లా పార్విళ్లు జూబ్లీ బస్‌స్టేషన్, ఎంజీబీఎస్‌లకు చేరుతాయి. ప్రతిరోజూ 30 నుంచి 50 కిలోల చికెన్ హైదరాబాద్‌కు పార్శిల్ చేస్తున్నారు. పిండివంటల నుంచి.. హస్తకళల దాకా.. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో లభించే పిండివంటలను కూడా ఆర్టీసీ వినియోగదారులకు చేరువ చేస్తోంది. సిద్దిపేట సకినాలు, అప్పచ్చులు, కరీంనగర్లో ప్రత్యేకంగా వండే సర్వపిండి వంటివి ఇప్పుడు హైదరాబాద్‌లో ఆర్టీసీ పార్శిళ్ల ద్వారా పొందవచ్చు. “ఒకరోజు ముందు ఆర్డర్ చేస్తే తయారీ సంస్థల నుంచి సేకరించి వినియోగదారులకు అందజేస్తాం’ అని చెప్పారు ఆర్టీసీ ప్రత్యేక అధికారి కృష్ణకాంత్. నిర్మల్ బొమ్మలు, పెంబర్తి హస్తకళా వస్తువులు, పోచంపల్లి, గద్వాల్ చీరలు, చేనేత వస్త్రాలను వినియోగదారులకు చేరవేసేందుకు ఆర్టీసీ పార్శిల్ సేవలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం 150 కార్గో బస్సుల ద్వారా ఈ సదుపాయాన్ని అందజేస్తున్నారు. నేరుగా ఇంటి వద్దకే సేవలు.. ఇటు వినియోగదారుల నుంచి అటు తయారీదారులు, వ్యాపార సంస్థల నుంచి అనూహ్య స్పందన లభించడంతో నేరుగా వినియోగదారులకు ఇంటి వద్దే పార్శిళ్లను అందజేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులను ఆన్లైన్లో బుక్ చేసుకొంటే చాలు. ఆయా సంస్థల నుంచి అందిన వెంటనే పార్శిల్ సర్వీసుల ద్వారా ఆర్టీసీ ఏజెంట్లకు, అక్కడి నుంచి వినియోగదారుల ఇంటికి చేరుస్తారు. చార్జీలు చాలా తక్కువ.. సిరిసిల్లకు కొన్ని వస్తువులను పంపిస్తున్నాను. బయట కంటే చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. రూ.150తోనే పని అయిపోయింది. చాలా బాగుంది. – శ్రీపతిరావు, వినియోగదారు ఇదే మొదటిసారి.. కార్గో సేవలను వినియోగించుకోవడం ఇదే మొదటిసారి. ఇంటి నుంచి కొన్ని వస్తువులను నిర్మల్‌కు పంపిస్తున్నా. మిగతా సంస్థల కంటే ఆర్టీసీని నమ్ముకోవడం మంచిది కదా. – బూదయ్య, వినియోగదారు ఆర్టీసీ వల్లే పార్శిల్ ఆలోచన.. అంకాపూర్ నుంచి హైదరాబాద్‌కు చికెన్ పంపించవచ్చనే ఆలోచన ఆర్టీసీ పార్శిల్ సేవల వల్లే వచ్చింది. అప్పటి వరకు లోకల్‌గానే విక్రయించేవాళ్లం. ఇప్పుడు చాలా బాగుంది. – చంద్రమోహన్, చికెన్ తయారీదారు, అంకాపూర్ స్పందన బాగుంది.. పార్శిల్ సేవలకు స్పందన చాలా బాగుంది. జేబీఎస్ నుంచి ప్రతిరోజూ రూ.85 వేలకు పైగా ఆదాయం లభిస్తోంది. వందలాది పార్శిళ్లను వివిధ ప్రాంతాలకు పంపిస్తున్నాం, – ప్రణీత్, డిపో మేనేజర్, పికెట్ -
విషాదం: కోడి కూర వండలేదని..
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దసరా పండగ రోజు కోడికూర వండలేదని భార్యను హతమార్చాడో భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సన్నయ్య మద్యానికి బానిసగా మారాడు. దసరా పండగ రోజు (ఆదివారం) మద్యం తాగివచ్చి, భార్య సీతమ్మ(38)ను కోడికూర వండమని చెప్పగా.. ఆమె వండలేదు. దీంతో కోపోద్రిక్తుడైన సన్నయ్య భార్యను కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లిపోయాడు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులుకు సమచారం ఇవ్వగా.. అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: (నడిరోడ్డుపై యువతి దారుణ హత్య : షాకింగ్ వీడియో) -
విషాదం : చికెన్ కర్రీలో మసాలకు బదులు..
సాక్షి, చిత్తూరు : వృధ్యాప్యంలో ఉన్న అమ్మమ్మ చేసిన పొరపాటు ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. చికెన్ కర్రీలో మసాల అనుకుని విష గుళికలు కలిసింది ఆ వృద్ధురాలు. విషగుళికలు కలిపిన ఆహారం తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గుడిపాల మండలంలోని ఏఎల్‌పురం గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులు తవణంపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన రోహిత్, జీవాగా గుర్తించారు. (చదవండి : ‘అమ్మ’మ్మలే హతమార్చారు..) వడ్డేపల్లికి చెందిన ఇద్దరు పిల్లలు అమ్మమ్మ ఊరైన ఏఎల్‌పురానికి వెళ్లారు. దీంతో వాళ్ల అమ్మమ్మ చికెన్ వండి... పిల్లలకు పెడదామని నిర్ణయించుకుంది. చికెన్ చేసే సమయంలో చికెన్ మసాలా బదులు విష గుళికలు కలిపింది. గుళికలు వేసిన చికెన్ తినడంతో ఆ ఇద్దరు బాలులు మృతి చెందారు. కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. -
నచ్చిన కూర చేయలేదని ఆత్మహత్య..!
అన్నానగర్ : కుత్తాలమ్ సమీపంలో తల్లి కోడి కూర చేయలేదని మనస్తాపం చెందిన ఓ కార్మికుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. నాగై జిల్లా, కుత్తాలమ్ సమీపం తిరుమంజేరి జేజేనగర్‌కు చెందిన రామచంద్రన్ కుమారుడు రాజా (22) కూలీ. ఇతను బుధవారం తన తల్లి కొలంజియమ్మాల్‌కు చికెన్ తెచ్చి కూర చేయమని చెప్పాడు. అయితే, కొలంజియమ్మాల్ తనకు ఆరోగ్యం బాగోలేదని, చేయలేనని చెప్పింది. దీంతో మనస్తాపం చెందిన రాజా, వ్యవసాయానికి ఉపయోగించే పరుగుల మందు తాగి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మయిలాడుదురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజా మృతి చెందాడు. కుత్తాలమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ రవిచంద్రన్ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. -
కోడికూర తెచ్చిన తంటా!
చెన్నై : కోడికూర అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. కూర తక్కువగా వడ్డించడంలో గొడవ జరగడంతో అన్నపై తమ్ముడు కిరోసిన్ కుమ్మరించి నిప్పటించాడు. వివరాలు.. కారైకుడి సమీపానగల సూరైకుడి ప్రాంతానికి చెందిన రాజు భార్య మీనాళ్. వీరికి ప్రతాప్ (24), ప్రదీష్ (21) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రతాప్ అదే ప్రాంతంలోని సెలూన్ షాపులో పనిచేస్తున్నాడు. మద్యం అలవాటు ఉంది. మంగళవారం వారి ఇంట్లో కోడికూర చేశారు. మధ్యాహ్నం భోజనం చేసి వెళ్లిన ప్రతాప్ మళ్లీ రాత్రి భోజనం చేసేందుకు వచ్చాడు. ఆ సమయంలో అతనికి కోడికూర తక్కువగా వడ్డించినట్లు సమాచారం. దీంతో అతను ప్లేటును గాల్లోకి విసిరాడు. దీన్ని తమ్ముడు ప్రదీష్ నిలదీశాడు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. తర్వాత ప్రదీష్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన ప్రదీష్ వాకిట్లో నిద్రిస్తున్న ప్రతాప్‌పై కిరోసిన కుమ్మరించి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. తండ్రి రాజు, తల్లి మీనా, స్థానికులు బాధితుడిని కారైకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన సెట్టినాడు పోలీసులు, ప్రదీష్ కోసం గాలిస్తున్నారు. -
చికెన్ కుర్మాలో శెనగలు.. భారీ ఫైన్
లండన్: చికెన్ కుర్మాలో శెనగలు వేసి వండిన భారతీయ రెస్టారెంట్ షెఫ్‌కు అధికారులు భారీ జరిమానా విధించారు. తూర్పు ఇంగ్లండ్ ప్రాంతం గ్రిమ్స్బీలో 'మసాలా' ఇండియన్ రెస్టారెంట్లో బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ ఉద్దీన్ షెఫ్‌గా పనిచేస్తున్నాడు. మసాలా రెస్టారెంట్ లో తయారు చేసిన చికెన్ కుర్మాను ఆహార శాఖ అధికారులు 2016 లో తనిఖీ చేశారు. కుర్మాలో 6.8 మిల్లీగ్రాముల శెనగలు ఉన్నట్లు కనుగొన్నారు. మరోసారి తనిఖీ చేసినప్పుడు కూడా అటువంటి కల్తీనే గుర్తించారు. దీనిపై సంబంధిత షెఫ్‌ను అధికారులు విచారించగా... కుర్మాలో శెనగలు ఎలా కలిశాయో తనకు తెలియదని, తాను వాటిని కలుపలేదని షెఫ్ మహ్మదుద్దీన్ అధికారులకు తెలిపారు. అయితే, శెనగలు లేకుండానే చికెన్ కుర్మా చేస్తున్నట్లు మెనూలో పేర్కొని, వాటిని కలపటం నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. అంతే కాకుండా, కొందరు 5 మిల్లీ గ్రాములకు మించి శెనగలు ఆహారంలో ఉంటే అలెర్జీతో ఇబ్బందులు పడతారని, అవేమీ పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా వాటిని కలిపి ఆహార పదార్థాలు వండారని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు గాను షెఫ్ మహ్మదుద్దీన్కు 2,300 పౌండ్ల జరిమానా విధించారు. ( గ్రిమ్స్బీలోని 'మసాలా' ఇండియన్ రెస్టారెంట్ ) -
దిల్ఫుల్ దావత్
కడుపు నిండా తినాలి అంటే... పెట్టే చెయ్యి ఉండాలి. మనసు నిండా తినాలి అంటే... కొసరి కొసరి పెట్టే చెయ్యి ఉండాలి. తెలంగాణా ఆతిథ్యానికి ‘అదబ్ ఔర్ ఖాతిర్దానీ’ అని పేరుంది. అంటే.. సౌహార్ద్రం, అతిథి మర్యాదల సంస్కారం. తెలుగు రుచుల్లో ఇది తెలంగాణ ప్రత్యేకత. మనసు నిండా తినండి. ఈ... దిల్ఫుల్ దావత్ ఫ్రమ్ తెలంగాణ. సర్వప్ప కావల్సినవి: బియ్యప్పిండి - కప్పు / 165 గ్రాములు తెల్ల నువ్వులు - పావు కప్పు (వేడినీళ్లలో నానబెట్టి, నీళ్లు వడకట్టి, పక్క నుంచాలి); శనగపప్పు - 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు (వేయించి, పొట్టు తీసి, పలుకులు చేయాలి); పచ్చిమిర్చి - 5 (తరగాలి; పచ్చిమిర్చి ముద్ద - అర టీ స్పూన్; జీలకర్ర - టీ స్పూన్; వెల్లుల్లి - 10 రెబ్బలు(తరగాలి); ఉల్లిపాయ - 1 (తరగాలి); కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఉల్లికాడలు (సన్నగా తరగినవి) - పావు కప్పు; కారం - పావు టీ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు (సన్నగా తరగాలి); ఉప్పు - రుచికి తగినంత ; నీళ్లు - ముప్పావు కప్పు (తగినన్ని); నూనె - 3 టీ స్పూన్లు తయారీ: నువ్వులను, శనగపప్పును విడివిడిగా గంట నానబెట్టి, వడకట్టాలి. ఉల్లి తరుగును కచ్చాపచ్చాగా దంచాలి. పెద్ద గిన్నెలో బియ్యప్పిండి, నువ్వులు, శనగపప్పు, పల్లీల పలుకులు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు-ముద్ద, కారం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లి తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు వేసి, కలిపి గట్టి ముద్ద చేయాలి. మందపాటి గిన్నె (సర్వ) అడుగున నెయ్యి రాసి, పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రొట్టెలా చేత్తో వెడల్పుగా వతి, సన్నని మంట మీద కాల్చాలి. (పిండిని రొట్టెలా చేసి, పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవచ్చు) బగారా రైస్ కావల్సినవి: బాస్మతి బియ్యం/బియ్యం - 2 కప్పులు ఉల్లిపాయలు - 3 (సన్నగా నిలువుగా తరగాలి); బిర్యానీ ఆకు - 3పచ్చిమిర్చి - 7 (సన్నగా తరగాలి); కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు పుదీనా ఆకులు - గుప్పెడు; అల్లం -వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత; నెయ్యి / నూనె - అర కప్పు; నీళ్లు - 5 కప్పులు లవంగాలు - 10; యాలకులు - 7; కరివేపాకు - 2 రెమ్మలు తయారీ: గిన్నెలో నూనె వేడి చేసి, ఉల్లి తరుగు గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. అందులో పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కరివేపాకు, పుదీనా ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సన్నని మంట మీద పచ్చివాసన పోయేవరకు వేయించాలి.దీంట్లో బియ్యం వేసి 2 నిమిషాలు వేయించాలి. ఉప్పు కూడా వేసి మరో మారు కలిపి, 5 కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర, వేయించిన ఉల్లి తరుగు చల్లి దించాలి. నోట్: పోపులో పచ్చిబఠాణీలు, మొక్కజొన్న గింజలు, బీన్స్ వేసి కూడా బగారా రైస్ చేసుకోవచ్చు. దీనిలోకి మాంసాహార వంటకాలే కాదు బంగాళదుంప కూర, గుత్తి వంకాయ కూర, పప్పు వంటి శాకాహార రుచులను కూడా వడ్డించవచ్చు. పచ్చి పులుసు కావల్సినవి చింతపండు - నిమ్మకాయ పరిమాణం (వేడి నీళ్లలో నానబెట్టి, గుజ్జు తీయాలి)ఉప్పు - తగినంతనీళ్లు - 3 కప్పులు పచ్చిమిర్చి - 4 జీలకర్ర - టీ స్పూన్; కొత్తిమీర - టేబుల్‌స్పూన్; పసుపు - పావు టీ స్పూన్; ఉల్లిపాయ - 1; ఎండుమిర్చి - 2; వెల్లుల్లి - 4 రెబ్బలు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు - రెమ్మ ధనియాల పొడి - అర టీ స్పూన్ తయారీ చింతపండు గుజ్జులో నీళ్లు కలపాలి. రోట్లో పచ్చిమిర్చి, ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, పసుపు వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఈ మిశ్రమాన్ని చింతపండు రసంలో కలపాలి. స్టౌ మీద మూకుడు పెట్టి నూనె వేసి అందులో మిగిలిన జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ధనియాల పొడి వేసి, వేయించి ఈ పోపు మిశ్రమాన్ని చింతపండు రసంలో కలపాలి. తీపి కావాలనుకున్నవారు టీ స్పూన్ పంచదార/బెల్లం కలుపుకోవచ్చు. ఉల్లిపాయ తరుగు పైన వేసి, అన్నంలోకి వడ్డించాలి. నాటు కోడి కూర కావల్సినవి: నాటు కోడి ముక్కలు - అరకేజీ; పచ్చిమిర్చి - 4, టొమాటోలు - 2(తరగాలి); అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు; గరం మసాలా (లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు) - 2 టీ స్పూన్లు; ఉల్లిపాయలు - 2, ఎండుమిర్చి - 2; పసుపు - అర టీ స్పూన్; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూన్; ఎండుకొబ్బరి - 2 టీ స్పూన్లు; నూనె - 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు తయారీ నాటుకోడి ముక్కలలో కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం- వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్కనుంచాలి. మందపాటి గిన్నె/కుకర్‌లో నూనె వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసి, కలపాలి. అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి, వేగాక కలిపి ఉంచిన చికెన్ వేసి 10 నిమిషాలు ఉడికించాలి. టొమాటో వేసి మగ్గనివ్వాలి. 2 కప్పుల నీళ్లు పోసి, ఉప్పు, కారం, ఎండుకొబ్బరి వేసి మరో 15 నిమిషాలు ఉడికించాలి. కుకర్‌లో అయితే 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. దించే ముందు సిద్దం చేసుకున్న గరం మసాలా, కొత్తిమీర వేయాలి. రోటీలు, అన్నంలోకి ఈ కూరను వడ్డించాలి. ఉప్పుడు పిండి కావల్సినవి: బియ్యపు రవ్వ-కప్పు; పెసరపప్పు-టేబుల్ స్పూన్; ఎండుమిర్చి- 2; పల్లీలు - టేబుల్ స్పూన్, కరివేపాకు - రెమ్మ; ఉప్పు - తగినంత; అల్లం - చిన్న ముక్క; జీలకర్ర - టీ స్పూన్; ఆవాలు - అర టీ స్పూన్; నీళ్లు - రెండున్నర కప్పులు; కొత్తిమీర - కొన్ని ఆకులు తయారీ మందపాటి గిన్నె స్టౌ మీద పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పెసరపప్పు వేసి దోరగా వేయించాలి. కరివేపాకు, ఎండుమిర్చి, దంచిన అల్లం వేసి కొద్దిగా వేగాక నీళ్లు పోసి, కలిపి మూత పెట్టాలి. ఉప్పు కలిపిన తర్వాత బియ్యపు రవ్వ పోస్తూ కలపాలి.మంట తగ్గించి, ఉడకనివ్వాలి. మాడకుండా జాగ్రత్తపడుతూ ఎక్కువసేపు మగ్గనిస్తే రుచి పెరుగుతుంది. చివరగా కొత్తిమీర చల్లి ఆవకాయ లేదా టొమాటో చెట్నీతో వడ్డించాలి. చేప వేపుడు కావల్సినవి చేప ముక్కలు - 6 కారం - అర టీ స్పూన్మొక్కజొన్న పిండి - టీ స్పూన్ ఉప్పు - తగినంత నిమ్మరసం - అర టీ స్పూన్ గుడ్డు - 1 నూనె - తగినంత ధనియాల పొడి - టీ స్పూన్ గరం మసాలా - అర టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్ కొత్తి మీర - టీ స్పూన్ నూనె - 3 టేబుల్ స్పూన్లు (తగినంత) తయారీ గిన్నెలో చేప ముక్కలు వేసి కారం, మొక్కజొన్నపిండి, ఉప్పు, నిమ్మరసం, గుడ్డు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి అరగంట పక్క నుంచాలి. కడాయిలో నూనె వేసి అందులో చేప ముక్కలు వేసి, వేయించాలి.చేప ముక్కలు వేగిన తర్వాత కొత్తిమీర చల్లి దించాలి. గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలను అలంకరించి చేప ముక్కలను అన్నంలోకి సైడ్ డిష్‌గా వడ్డించాలి. ఇవి స్నాక్స్‌గానూ బాగుంటాయి. తలకాయ కూర కావల్సినవి తలకాయ మాంసం - అర కేజీ ఉల్లిపాయలు - 4 టొమాటోలు - 2 పచ్చిమిర్చి 4 అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు పసుపు - టీ స్పూన్ కారం -టీ స్పూన్ గరం మసాలా - 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత, ఎండుకొబ్బరి-2 టీ స్పూన్లు, నూనె - తగినంత తయారీ తలకాయ మాంసం శుభ్రం కడిగి, కుకర్‌లో ఉప్పు, పసుపు, కారం వేసి 7-8 నిమిషాలు ఉడకనివ్వాలి.ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి వేసి ముద్ద చేయాలి. కడాయిలో నూనె వేడయ్యాక ఉల్లి ముక్కలు, మెత్తగా రుబ్బిన ఉల్లి ముద్ద వేసి వేయించాలి. గరం మసాలా, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసి మగ్గించాలి. కుకర్‌లో ఉడికించిన తలకాయ కూర వేసి తగినన్ని నీళ్లు పోసి, కొబ్బరి, ఉప్పు వేసి కలిపి గ్రేవీ చిక్కబడేవరకు ఉడికించి, దించాలి. పులుసుకైతేచింతపండు గుజ్జు, టీ స్పూన్ బెల్లం కలిపి ఉడికించాలి. నల్లి బొక్క కూర కావల్సినవి: మేక/గొర్రె కాలి ఎముకలు +మటన్ - 750 గ్రా.లు (నల్లి అంటే ఎముకలో ఉండే మూలిగ) ఉల్లిపాయలు - 3 (సన్నగా తరగాలి) వెల్లుల్లి - 10 రెబ్బలు (సన్నగా తరగాలి అల్లం పేస్ట్ - టేబుల్ స్పూన్; గరం మసాలా - టీ స్పూన్ నూనె - అర కప్పు; బిర్యానీ ఆకులు - 2; యాలకులు - 4లవంగాలు - 6; కారం - అర టీ స్పూన్, ఎండుకొబ్బరి - పావు కప్పు; దాల్చిన చెక్క - చిన్న ముక్క; మిరియాలు - 6 ధనియాల పొడి - టేబుల్ స్పూన్; ఉప్పు - తగినంత టొమాటో గుజ్జు - అర కప్పు; పెరుగు - కప్పు తయారీ మటన్ ముక్కలను కడిగి పక్కనుంచాలి.మందపాటి గిన్నె స్టౌ మీద పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో యాలకులు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి.అల్లం-వెల్లుల్లి ముద్ద, కారం, ధనియాలపొడి వేసాక మటన్ వేసి, వేయించాలి. దీంట్లో 2 కప్పుల నీళ్లు, ఉప్పు వేసి 20 నిమిషాలు ఉడికించాలి. ఎముక నుంచి మటన్ ముక్క విడిపడేవరకు ఉడకాలి. దీంట్లో టొమాటో గుజ్జు, పెరుగు, కొబ్బరి వేసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి దించాలి. నోట్: కావల్సితే కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసి ఉడికించుకోవచ్చు. ఈ కూర రోటీలు, అన్నంలోకి రుచిగా ఉంటుంది. గంగవాయిల్ కూర- మామిడికాయ పప్పు కావల్సినవి: మామిడికాయ - 1 గంగవాయిల్ కూర - 3 కప్పులు కందిపప్పు - కప్పు ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి) పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేయాలి) ఎండుమిర్చి - 2 కారం - అర టీ స్పూన్పసుపు - పావు టీ స్పూన్ జీలకర్ర- ఆవాలు - టీ స్పూన్ వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్ ఉప్పు - తగినంతనూనె - 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి - అర టీ స్పూన్ తయారీ పప్పు కడిగి, ఉడికించాలి. ఆకు కూరను శుభ్రం చేసి పక్కన ఉంచాలి. మామిడికాయ పై తొక్కతీసి ముక్కలు చేయాలి) స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, పసుపు వేసి వేయించాలి. దీంట్లో మామిడికాయ ముక్కలు, గంగవాయిలు కూర వేసి మగ్గనివ్వాలి. దీంట్లో పప్పు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి ఉడికనివ్వాలి. మామిడికాయ ముక్క ఉడికాక.. చివరగా కొత్తిమీర వేసి, దించాలి. రోటీ లేదా అన్నంలోకి వడ్డించాలి. కర్టెసీ కె. కుమార్, చెఫ్ ఐశ్వర్యా మల్టీ క్యుజిన్, నిజామాబాద్ -
'చికెన్ కోసం చిత్తుగా తన్నుకున్నారు'
చిత్తూరు : వాళ్లిద్దరూ బాధ్యత గల పోలీసులు. అయితే ఆ విషయాన్ని వాళ్లిద్దరూ మరచారు. చికెన్ ముక్కల కోసం చిత్తు చిత్తుగా కొట్టుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పీలేరు పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చంద్ర, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చలపతి...ఓ దాబాలో విందును ఏర్పాటు చేసుకున్నారు. అయితే చికెన్ పంపకాల్లో తేడా రావడంతో... ఇద్దరు వాగ్వాదానికి దిగారు. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు కొట్లాటకు దిగారు. అడ్డొచ్చిన ఇతర సిబ్బందిపై కూడా చేయిచేసుకున్నారు. చితకబాదుకుని చివరకు తీవ్రంగా గాయపడి ఇద్దరూ ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటనపై పీలేరు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.