
మైసూరు: కోడికూరతో భోజనం చేసిన సుమారు 30 మందికి పైన విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. ఈ సంఘటన చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తలూకాలోని యడవనహళ్లి గ్రామంలోని మొరార్జీదేశాయ్ వసతి పాఠశాలలో జరిగింది. ఆదివారం రాత్రి సుమారు 30 మందికి పైన విద్యార్థులు చికెన్ భోజనం తిన్నారు.
కొంతసేపటికి వాంతులు, విరోచనాలు ప్రారంభం కావడంతో 15 మందిని బేగూరు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో 15 మందిని చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. విద్యాశాఖ అధికారులు, పోలీసులు విద్యార్థులతో మాట్లాడి కారణాలపై ఆరా తీశారు. అపరిశుభ్రమైన వంట పాత్రలు, నాణ్యత లేని చికెన్ వల్లే ఇలా జరిగి ఉంటుందని అనుమానం.
చదవండి: వందేభారత్ స్టాప్ కోసం సుప్రీంలో పిటిషన్.. సీరియస్ అయిన చీఫ్ జస్టిస్
Comments
Please login to add a commentAdd a comment