
రణు మండల్ పేరు గుర్తుందా! అదేనండి ఒకే ఒక్క పాటతో ఓవర్ నైట్ సింగర్ గా మారడమే కాకుండా సెలబ్రిటీ స్టేటస్ సొంతం కూడా చేసుకుంది. అదే ఊపులో బాలీవుడ్ లో పాటలు పాడే అవకాశాలు కూడా వచ్చాయి. ఏమైందో గానీ ఆమె జీవితంలో అనుకోకుండా వచ్చిన అదృష్టం ఆమెను స్టార్ సింగర్ గా మార్చలేకపోయింది. సినిమాలో పాటల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియా లో మాత్రం ట్రెండింగ్ లో ఉంటుంది రాను మండల్.
తాజాగా మరోసారి నెట్టింట ఆమె వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. కానీ ఈ సారి పాటతో కాకుండా, ఆమె వంటతో వైరల్ గా మారింది. తాజాగా ఓ యూట్యూబర్.. రాను మండల్ ఇంటికి వెళ్ళాడు. సింగర్ దగ్గర పాట కామన్ అనుకున్నాడో ఏమో వంట వండించాలని ఫిక్స్ అయ్యి తనతో చికెన్ కర్రీ వండించాడు. ఆ వీడియోను తన యూట్యూబ్ చానెల్‌లో పెట్టాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాను మండల్.. చికెన్ కర్రీ వండుతూ.. పాటలు పాడుతూ.. యూట్యూబ్ వీక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసింది.
చదవండి:Fake Jalakanya Video: మైపాడు బీచ్‌లో జలకన్య? అసలు నిజం ఏంటంటే..
Comments
Please login to add a commentAdd a comment