Ranu Mondal
-
వీళ్లంతా.. రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్లయిపోయి..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ మేళాకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారు. వీరిలోని కొందరు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఇలాంటివారిలో వైరల్ గర్ల్ మోనాలిసా ఒకరు. ఈమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా తన అందమైన కళ్లు కారణంగా సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. మహాకుంభ్‌లో దండలు, పూసలు అమ్మేందుకు వచ్చిన ఆమె అనూహ్య రీతిలో సోషల్ మీడియాలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు.ప్రియా ప్రకాష్ వారియర్ ప్రియా ప్రకాష్ వారియర్.. మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’లోని ఒక చిన్న క్లిప్ వైరల్ కావడంతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయారు. దీంతో ఆమెకు ‘ది వింక్ గర్ల్’ అనే పేరొచ్చింది.భుబన్ బద్యాకర్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన పల్లీల విక్రేత భుబన్ కస్టమర్లను ఆకర్షించడానికి ‘కచ్చా బాదం’ పాటను రూపొందించి పాడాడు. ఈ పాట కారణంగానే భుబన్ రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయారు.అంజలి అరోరానాడు వైరల్‌గా మారిన కచ్చా బాదం పాటకు ఆమె నృత్యం చేసిన వీడియో సోషల్ మీడియాలో తుఫాను సృష్టించింది. దీంతో అంజలి అరోరా రాత్రికి రాత్రే సన్సేషనల్ స్టార్‌గా మారిపోయారు. కచ్చాబాదం ఆమె ఇంటి పేరుగా మారిపోయింది.రాణు మండల్రాణు మండల్ ఒక రైల్వే స్టేషన్లో లతా మంగేష్కర్ పాడిన ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’ పాట పాడి, రాత్రికి రాత్రే సంచలనంగా మారారు. సోషల్ మీడియాలో ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తాయి.దనానీర్ ముబీన్19 ఏళ్ల పాకిస్తానీ యువతి దనానీర్ ముబీన్‌కు చెందిన ‘పావ్రీ హో రహి హై’ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దీంతో దనానీర్ రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మారిపోయారు.సంజీవ్ శ్రీవాస్తవమధ్యప్రదేశ్లోని విదిశకు చెందిన ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవ డ్యాన్సింగ్ అంకుల్‌గా పేరొందారు. సంజీవ్ శ్రీవాస్తవ బాలీవుడ్ హీరో గోవింద శైలిలో నృత్యం చేయడంతో రాత్రికిరాత్రే స్టార్‌గా మారిపోయారు.ఇది కూడా చదవండి: వీళ్లంతా ఐఐటీ బాబాలు.. మంచి ఉద్యోగాలు వదిలి.. -
చికెన్ కర్రీ అదరగొట్టిన రణు మండల్ .. వీడియో వైరల్
రణు మండల్ పేరు గుర్తుందా! అదేనండి ఒకే ఒక్క పాటతో ఓవర్ నైట్ సింగర్ గా మారడమే కాకుండా సెలబ్రిటీ స్టేటస్ సొంతం కూడా చేసుకుంది. అదే ఊపులో బాలీవుడ్ లో పాటలు పాడే అవకాశాలు కూడా వచ్చాయి. ఏమైందో గానీ ఆమె జీవితంలో అనుకోకుండా వచ్చిన అదృష్టం ఆమెను స్టార్ సింగర్ గా మార్చలేకపోయింది. సినిమాలో పాటల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియా లో మాత్రం ట్రెండింగ్ లో ఉంటుంది రాను మండల్. తాజాగా మరోసారి నెట్టింట ఆమె వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. కానీ ఈ సారి పాటతో కాకుండా, ఆమె వంటతో వైరల్ గా మారింది. తాజాగా ఓ యూట్యూబర్.. రాను మండల్ ఇంటికి వెళ్ళాడు. సింగర్ దగ్గర పాట కామన్ అనుకున్నాడో ఏమో వంట వండించాలని ఫిక్స్ అయ్యి తనతో చికెన్ కర్రీ వండించాడు. ఆ వీడియోను తన యూట్యూబ్ చానెల్లో పెట్టాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాను మండల్.. చికెన్ కర్రీ వండుతూ.. పాటలు పాడుతూ.. యూట్యూబ్ వీక్షకులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేసింది. చదవండి:Fake Jalakanya Video: మైపాడు బీచ్‌లో జలకన్య? అసలు నిజం ఏంటంటే.. -
Ranu Mondal: ఓవర్‌నైట్ సెన్సెషన్ మరోసారి వార్తల్లోకి..
రాను మండల్.. పరిచయం అక్కర్లేని పేరు. బెంగాల్‌లోని రణఘాట్‌లో వీధుల్లో ఈమె పాడిన పాటతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె పాడిన పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శ్రీలంక గాయకుడు, రచయిత యోహానీ రాసిన ‘ మానికే మాఘే హితే’ అనే పాటను మండల్ పాడారు. దీంతో రాను మండల్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో బాలీవుడ్ డైరెక్టర్ హృశికేష్ మోండల్ దర్శకత్వం వహించిన ‘మిస్ నాను మరియా’ సినిమాలో పాటపాడటానికి అవకాశం ఇచ్చారు. దీనికి బాలీవుడ్ సింగర్ హిమేష్ రేష్మియా ఆమెను ప్రోత్సహించారు. సూపర్ స్టార్ రియాలిటీ షోలో పాట పాడటానికి హిమేష్.. మండల్‌ను ఆహ్వానించారు. హిమేష్ చిత్రం .. హ్యపీ హర్డీ అండ్ హీర్ సినిమాలో రెండు మండల్‌తో రెండు పాటలను పాడించారు. ఆ తర్వాత.. ఒక కార్యక్రమంలో అభిమాని పట్ల మండల్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. ఒక పెద్ద సెలబ్రిటీలాగా ప్రవర్తిస్తోందని నెటిజన్లు ఆమె తీరుపై మండిపడ్డారు. ప్రస్తుతం మండల్ పాడిన పాట మరోసారి సోషల్ మీడియాలో సెన్సెషన్‌గా మారడంతో ఆమెకు మరో అవకాశం వస్తుందేమో చూడాలి. చదవండి: Ranu Mondal Biopic: ‘ఆమె పాత్ర పోషించడాన్ని అవమానంగా భావించారు’ -
‘ఆమె పాత్ర పోషించడాన్ని అవమానంగా భావించారు’
రాను మండల్.. ఈ పేరు ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్. బెంగాల్‌లోని రణఘాట్ వీధుల్లో పాడిన పాట ఓ అనామకురాలిలా ఉన్న ఈమెను ఓవర్‌నైట్ స్టార్‌ని చేసింది. ఎంతలా అంటే ఆమెపై బయోపిక్ తీసేంతలా. ప్రముఖ డైరెక్టర్ హృషికేశ్ మోండల్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పేరు మిస్ రాను మరియా. ఆమెకు మొదటిసారి బాలీవుడ్ ఫిల్మ్‌లో పాడే అవకాశం ఇచ్చిన హిమేష్ రేష్మియా ఈ చిత్రానికి పని చేయనున్నారు. బెంగాలీ నటి ఈషికా డే ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ బయోపిక్‌లో నటించడానికి తొలుత వేరే నటులను అనుకున్నామని, కానీ వాళ్లు రాను మండల్ పాత్ర పోషించడాన్ని అవమానకరంగా భావించారని డైరెక్టర్ హృషికేశ్ మోండల్ తెలిపాడు అయితే ఆ నటీమణుల పేర్లను మాత్రం బహిర్గతం చేయకపోవడం గమనార్హం. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ పాత్ర కోసం మొదట బెంగాలీ మూవీ ‘బరివాలి’తో ఉత్తమ సహాయ నటి అవార్డు గెలుచుకున్న సుదీప్త చక్రబర్తిని సంప్రదించాం. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని ఆమె ఎంతో కోరుకున్నారు. అయితే ఇంతకుముందు కమిట్ అయిన సినిమాల వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేక మా ఆఫర్‌ను వదులుకున్నారు’ చివరకు ‘పుర్బా పశీమ్ దక్షిణ్’ ఫేమ్ ఈషికాను సంప్రదించగా, ఆమె వెంటనే ఓకే చెప్పారు’అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. మొదట బెంగాలీలో మాత్రమే ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్న మేకర్స్ అనంతరం హిందీలోనూ తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ మూవీలో రాను మొండల్ జీవితంలో ఎదురొన్న సమస్యలను చూపించనున్నారు.కాగా ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించనున్న ఈషికా డే సేక్రెడ్ గేమ్స్, గోల్పర్ మాయజల్, లాల్ కప్తాన్ వంటి వెబ్ సీరిస్, సినిమాలతో గుర్తింపు పొందారు. ఆమె ప్రస్తుతం మొండల్ బయోపిక్‌తో పాటు సినిస్తాన్ మూవీలో లీడ్ రోల్లో నటిస్తున్నారు. -
కొన్ని లైకులు... కాస్త వెలుతురు
గత మూడు వారాలుగా ‘బాబా కా ధాబా’ వార్తల్లో ఉంది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్లో చిన్న టిఫిన్ సెంటర్ నడిపే వృద్ధ జంట కరోనా వల్ల బేరాలు లేక కన్నీరు కార్చడం ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అక్కడి నుంచి దేశమంతా ఆ వృద్ధజంట పాపులర్ అయ్యారు. బాలీవుడ్ తారలు ‘బాబా కా ధాబా’ ఫోటోను ట్వీట్ చేశారు. జనం ఆ ధాబా దగ్గరకు పోటెత్తారు. 20 రోజుల తర్వాత ధాబా మళ్లీ పూర్వస్థితికి చేరింది. కాకపోతే రెండు రోజుల క్రితం ఆ జంటకు ఒక కంటి ఆస్పత్రి ఉచితంగా కాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించింది. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న మంచిని ఇటీవలి ఘటనలతో తెలిపే కథనం ఇది. అక్టోబర్ మొదటి వారంలో సోషల్ మీడియా లో ఆ తర్వాత న్యూస్ పేపర్లలో ‘బాబా కా ధాబా’ అనే పేరు మార్మోగిపోయింది. ‘బాబా కా ధాబా’ అనేది దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఫుట్ మీద మీద ఉన్న చిన్న టిఫిన్ సెంటర్. దానిని నడుపుతున్నది 80 ఏళ్ల కాంతా ప్రసాద్, అతని భార్య బాదామి దేవి. గత ముప్పై ఏళ్లుగా వాళ్లు ఆ ధాబా మీదనే జీవిస్తున్నారు. లాక్డౌన్ కాలంలో ధాబా మూత పడింది. అన్‌లాక్ మొదలయ్యాక కూడా కరోనా భయంతో జనం ఆ ధాబాకు రావడం బాగా తగ్గించేశారు. తెల్లవారుజామునే లేచి ఆ వృద్ధ దంపతులు రోజూ రోటీ కూరలు చేసి హోటల్ లో కూచుంటే అరవై డెబ్బై రూపాయలకు కూడా బేరం జరగడం లేదు. ఇది వారికి ఎంతో వేదన కలిగించింది. ఇది గమనించిన గౌరవ్ వాసన్ అనే ఫుడ్ బ్లాగర్ వారితో చిన్నపాటి సంభాషణ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రాను మండల్, బేబి ‘బేరం కాక చాలా ఇబ్బందులు పడుతున్నాం’ అని కన్నీరు కారుస్తున్న వృద్ధుడు కాంతాప్రసాద్ను, అతని నిస్సహాయ భార్యను చూసి జనం కదలిపోయారు. వెంటనే స్పందించారు. బాలీవుడ్ తారలు ఈ ధాబా గురించి ట్వీట్ చేసి ‘వెళ్లండి... వెళ్లి అక్కడ ఏదైనా తినండి’ అని కోరారు. అంతే... రెండు రోజుల్లో జనం అంతా అక్కడ పోటెత్తారు. ఆ జంటను ఉత్సాహపరచడానికి వారు అమ్మే మటర్ పనీర్, రైస్, రోటీ తిని వెళ్లారు. కాంతా ప్రసాద్ పేరున ఇచ్చిన విరాళాలు దాదాపు మూడున్నర లక్షలు ఆ వృద్ధ దంపతులకు చేరాయి. అంతే కాదు రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ‘షార్ప్సైట్ ఐ హాస్పిటల్’ ఆ వృద్ధ దంపతుల కళ్ల పరీక్ష జరిపి, ఇద్దరి కళ్లలోనూ కాటరాక్ట్ ఉన్నాయని నిర్థారించి ఉచితంగా ఆపరేషన్ నిర్వహించారు. ఇద్దరికీ చెరో కంటికి చేసి, వచ్చే వారం రెండో కంటికి చేయనున్నారు. మెరుగుపడిన చూపుతో ఆ జంట సంతోషంగా ఉంది. వేగంగా స్పందన... వేగంగా మరుపు సోషల్ మీడియాలో స్పందన ఎంత వేగంగా ఉంటుందో మరుపూ అంతే వేగంగా ఉంటుంది. ‘బాబా కా ధాబా’ గురించి వచ్చిన రెండు మూడు వారాలు జనం అక్కడకు వచ్చారు నిజమే కాని ఇప్పుడు మళ్లీ బేరాలు అతి మామూలు స్థితికి చేరాయి. రకరకాల సంస్థలు ఆ ముసలివారిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాయి. ఏ బ్లాగర్ అయితే వీడియో పోస్ట్ చేశాడో ఆ బ్లాగర్ వచ్చిన విరాళాలను పూర్తిగా వృద్ధులకు ఇచ్చాడా లేదా అనే సందేహాలు కూడా పుట్టాయి. అయినప్పటికీ ఏ కదలికా లేని చోట సోషల్ మీడియా ఏదో ఒక కదలిక తెచ్చి ఆ వృద్ధులకు ఏదో ఒక మేరకు మేలు చేసిందని అనుకోక తప్పదు. కెమెరా అంచున ప్రతిభ ఒకప్పుడు సామాన్యులు వెలుగులోకి రావాలంటే చాలా పెద్ద తతంగంగా ఉండేది. మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకుంటేనే వారు తెలిసేవారు. కాని ఇప్పుడు సోషల్ మీడియా వల్ల చేతిలో ఉన్న సెల్‌ఫోన్ కెమెరాతో ఎవరి ప్రతిభనైనా లోకానికి తెలిపే వీలు చిక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని రనఘాట్ రైల్వేస్టేషన్లో పాడుకుంటూ బిచ్చమెత్తుకునే రాను మండల్ గొంతులోని ప్రావీణ్యాన్ని గమనించిన ఒక వ్యక్తి ఆమె పాడిన ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’ను రికార్డ్ చేసి ఫేస్బుక్లో పెడితే దేశమంతా ఆమె పేరు మార్మోగిపోయింది. బాలీవుడ్లో అవకాశాలు వచ్చాయి. ఆమె జీవితం పూర్తిగా మెరుగుపడింది. రాజమండ్రికి చెందిన గృహిణి బేబి పాడిన ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ కూడా ఫేస్బుక్ ద్వారానే ప్రచారం పొంది ఆమె జీవితంలో మలుపును తెచ్చాయి. ‘పలాస’లో ఎస్.పి.బాలుతో పాడే స్థాయికి ఆమె గుర్తింపు పొందారు. లాక్డౌన్లో సోషల్ మీడియా సేవ ప్రచారం కోసం కొందరు పని చేయవచ్చు. కాని చాలా సందర్భాలలో సహజమైన మానవత్వంలో సోషల్ మీడియాలో సహాయం అవసరమైన వారి గురించిన విన్నపాలు కనిపించడం వాటికి వెంటనే స్పందన రావడం చూస్తున్నాం. మొన్నటి హైదరాబాద్ భారీ వర్షాలకు సోషల్ మీడియాలో పిలుపును అందుకుని కావలసిన చోట సహాయం అందించడానికి చాలా బృందాలు ముందుకు వచ్చాయి. ఇక లాక్డౌన్ సమయంలో అయితే సోషల్ మీడియా చేసిన సేవ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా హైదరాబాద్ మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతున్న వేలాది మంది వలస కూలీలకు ఉప్పల్ చౌరాస్తాలో, కొంపల్లిలో, ఆర్మూరు దగ్గర దాదాపు నెల రోజుల పాటు క్యాంపులు నడిచాయి. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు చూసి ఎందరో వేల రూపాయల విరాళం ఇచ్చి వలస కూలీల ప్రయాణం సాగడానికి సాయపడ్డారు. లక్షల ఖర్చుతో బస్సులు మాట్లాడి పంపేంతగా ఫేస్బుక్ పోస్ట్‌లు ప్రభావితం చేశాయి. బహుముఖ కార్యక్రమాలు ఈ కరోనా కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు బహుముఖాలుగా ఉపయోగపడుతున్నాయి. అనేక లైవ్‌లు వీటి ద్వారానే నడుస్తున్నాయి. సాహిత్య కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, స్మృతి కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారానే ఇంట్లో కూచుని అందరూ చూస్తున్నారు. పాల్గొంటున్నారు. సామాజిక చైతన్యానికి, భిన్న అభిప్రాయాల ప్రకటనకు సోషల్ మీడియా ఒక వేదికగా మారుతోంది. తమిళనాడులో జరిగిన తండ్రీ కొడుకుల లాకప్ డెత్, ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన హత్రాస్ అత్యాచార ఘటన సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా నిరసనను సంఘటితం చేయగలిగాయి. లైకులు కొన్నే కావచ్చు. జరుగుతున్న పని కొంతే కావచ్చు. కాని సోషల్ మీడియాను అర్థవంతంగా ఉపయోగించుకోవాలనుకునేవారు తెస్తున్న వెలుతురు ఇప్పటికిప్పుడు ఎంతో విలువైనదని చెప్పక తప్పదు. – సాక్షి ఫ్యామిలీ -
మా అమ్మకు అటిట్యూట్ ప్రాబ్లం.. అందుకే..
తన తల్లి సింగర్ మాత్రమే అని, మోడల్ కాదని సోషల్ మీడియా సెన్సేషన్ రణు మొండాల్ కూతురు ఎలిజబెత్ సతీరాయ్ అన్నారు. కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించి.. రణు చేత ర్యాంప్ వాక్ చేయిస్తూ ఆమెను నవ్వులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రణు మొండాల్ తన అద్భుత గాత్రంతో దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పాటలను ఆలపిస్తూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మధురమైన గానానికి ముగ్ధుడైన బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా రణు చేత ఓ పాటను రికార్డు చేయించాడు. ఇక అప్పటి నుంచి రణుకు సెలబ్రిటీ హోదా దక్కింది. ఈ క్రమంలో పలు హిందీ టీవీ చానెళ్లు తమ కార్యాక్రమాలకు రణును ఆహ్వానించడంతో ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఓ బ్యూటీ పార్లర్ నిర్వాహకులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రణును అతిథిగా ఆహ్వానించారు. తమ పార్లర్ ప్రచారం కోసమని రణుకు రిచ్‌గా మేకోవర్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కొంతమంది నెటిజన్లు వాటిని మార్ఫింగ్ చేశారు. ముఖం నిండా ఫౌండేషన్ ఉన్నట్లుగా ఫొటోలు సృష్టించి విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ విషయాలపై స్పందించిన రణు కూతురు ఎలిజబెత్ మాట్లాడుతూ... ఎంతో కష్టపడి ఒక స్థాయికి వచ్చిన తన తల్లిని హేళన చేయడం సరికాదని హితవు పలికారు. ’ట్రోలింగ్ గురించి తెలిసి చాలా బాధ పడ్డాను. మా అమ్మకు నిజంగానే అటిట్యూట్ ప్రాబ్లం ఉంది. అందుకే ఇబ్బందులపాలవుతుంది. అయితే ఎన్నో కష్టనష్టాలకోర్చి ప్రస్తుతం విజయం రుచి చూసింది. అలాంటి వ్యక్తిని కించపరచడం భావ్యంకాదు. అయినా నాకు కొంతమంది చేసే పనులు అస్సలు నచ్చడం లేదు. మా అమ్మ ఓ గాయని మాత్రమే. కానీ కొంతమంది ఆమె చేత ర్యాంప్ వాక్ చేయిస్తూ.. దిగజారి ప్రవర్తిస్తున్నారు. జనాలు తనను చూసి నవ్వుతున్నారు. మా అమ్మ ఉన్నత కుటుంబానికి చెందినది కాదు. అట్టడుగు ఆర్థిక పరిస్థితి నుంచి బాలీవుడ్‌కు వచ్చింది. వీధుల్లో పాటలు పాడుకునే తనకు ఒక్కసారిగా పేరు వచ్చింది. అందుకే ఎలా తయారు కావాలో తనకు తెలియదు. అయితే ఈ ఒక్క విషయానికే నెటిజన్లు మా అమ్మను ట్రోల్ చేయడం లేదు. ఎవరో సెల్ఫీ అడిగితే ఇవ్వకుండా అమ్మ దురుసుగా ప్రవర్తించింది. తనను ఫేమస్ చేసిన సామాన్యుల పట్ల అమ్మ అలా చేయకుండా ఉండాల్సింది. అందుకే మీమ్స్ సృష్టించి తనను ట్రోల్ చేస్తున్నారనుకుంటా’ అని చెప్పుకొచ్చారు. (చదవండి : ‘నా కాళ్లు విరగ్గొడతామని బెదిరించారు’) కాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన రణు రైల్వే స్టేషనులో పాట పాడుతుండగా గమనించిన అతీంద్ర చక్రవర్తి అనే ఓ యువ ఇంజనీర్ ఆమె పాటను రికార్డు చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఆమె వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే రణుకు ఆశ్రయం కల్పించిన రణఘాట్ ఆమ్రా శోభై షోతాన్ క్లబ్ నిర్వాహకులపై ఆమె కూతురు ఎలిజబెత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ అతీంద్ర చక్రవర్తి, తపన్ దాస్(క్లబ్ సభ్యులు) నిజంగా మా అమ్మ సొంత కుమారులు అయి ఉంటే ఆమెను బాగా చూసుకునేవారు. కానీ మా అమ్మ వాళ్ల దగ్గర ఉన్నట్లు నాకు సమాచారం ఇవ్వలేదు. తన గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లాలని ప్రయత్నించగా నా కాళ్లు విరగ్గొట్టి బయటకు విసిరి వేస్తామని బెదిరించారు. నాకు వ్యతిరేకంగా మా అమ్మ మనసు మార్చారు. తన సంపాదనను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. -
రణుమొండాల్ 2.O వచ్చేసింది!
ముంబై: సోషల్ మీడియా సెన్సేషన్, సింగర్ రణు మొండాల్ ‘ఏక్ ప్యార్‌కా నగ్మా హై’ అనే ఎవర్గ్రీన్ పాటతో ఒక్కసారిగా రాత్రికిరాత్రే స్టార్ సింగర్‌గా మారారు. రైల్వే స్టేషల్లో లతా మంగేష్కర్ పాడిన పాటలను రణు పాడుకుంటు ఉండగా ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అది చూసిన బాలీవుడ్ సంగీత దర్శకుడు ‘హిమేశ్ రెష్మియా’ రణుకు తన సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి రణు మొండాల్ ఎన్నో పాటలకు కాంట్రాక్టులను దక్కించుకొవడంతో పాటు పలు షోలకు అతిథిగా కూడా హాజరయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే.. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. ఆ ఏడుగురి మాట అటుంచింతే.. ప్రస్తుతానికి రణు మొండాల్‌ను పోలిన ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గౌహతికి చెందిన ఓ మహిళా.. రణు పాడిన 'తేరి మేరి కహానీ' అనే సూపర్‌హిట్ పాటను ఆమె పాడడంతో వీడియో వైరల్‌గా మారింది. ఆ మహిళా అచ్చం రణుమొండాల్ను పోలి ఉండటంతో పాటు హావభావాలు కూడా ఒకేలా ఉండడంతో నెటిజన్లు ఆమెను ఫన్నీగా రణు మొండాల్ 2 అని అభివర్ణిస్తున్నారు. కాని కొందరు మాత్రం డూప్లికేట్ సింగర్ అని, ఈమెను కూడా స్టార్ చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram #RanuMondal 2.0 in (Maligaon)Guwahati. #Special Thanks to my friend Tanmoy Dey for shooting and Sharing this vdo. Vdo Rights :- Tanmoy dey #ranumondal #himeshreshammiya A post shared by Dipankar Baishya (@chiragdipofficial) on Nov 22, 2019 at 6:23am PST ఇటీవల రణు ముఖానికి మితిమీరిన మేకప్ వేసిన ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో.. రణును విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ఆకతాయిలు నకిలీ ఫోటో సృష్టించారని తెలియడంతో నెటిజన్లు నాలిక కరచుకున్నారు. -
మితిమీరిన మేకప్: అది ఫేక్ ఫొటో..!
సోషల్ మీడియా సెన్సేషన్, సింగర్ రణు మొండాల్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. రణు ముఖానికి మితిమీరిన మేకప్ చేసినట్లుగా ఉన్న ఫొటోను చూసి నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో పాటలు పాడే వారిని అందలం ఎక్కిస్తే ఇలాగే ఉంటుందంటూ సంస్కారహీనంగా మాట్లాడుతూ రణు వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు. మరికొందరు ఓ అభిమాని సెల్ఫీ అడిగితే ఆమెను నెట్టేసిన రణుకు ఈ మాత్రం మేకప్ ఉండాలిలే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే అది నిజమైన ఫొటో కాదని తేలడంతో ప్రస్తుతం నాలుక కరుచుకుంటున్నారు. కోల్‌కతాలోని రైల్వే స్టేషనులో లతా మంగేష్కర్ పాటలను ఆలపిస్తున్న రణు మొండాల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. రణు గాత్రానికి ముగ్ధుడైన బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా ఆమెకు రెండు పాటలు పాడే అవకాశం కల్పించాడు. దీంతో రణు పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ఒక బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవానికి నిర్వాహకులు రణును అతిథిగా ఆహ్వానించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె రిచ్ మేకోవర్‌తో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు రావడంతో కొంతమంది ఆకతాయిలు.. ఫొటోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లేయర్లు లేయర్లుగా మేకప్ ఉన్నట్లుగా కనిపిస్తున్న ఫొటోనే రణు ట్రోల్స్ బారిన పడటానికి కారణమైంది. కాగా రణు గురించిన విమర్శలపై... ఆమెకు మేకప్ చేసిన ఆర్టిస్టు ఇన్స్టాగ్రాం వేదికగా స్పందించారు. ‘ ఇది నిజమైన కళకు, ఫేక్ ఫొటోకు మధ్య ఉన్న తేడా. ఎడిట్ చేసిన ఫొటోను చూసి చాలా మంది జోకులు వేసుకున్నారు. మరికొంత మంది బాగా నవ్వుకున్నారు. ఇదంతా బాగానే ఉంది. అయితే మీ చర్యలు, కామెంట్లు ఎదుటి వారి మనోభావాలను గాయపరుస్తాయి కూడా. అందుకే అసలుకు, నకిలీకి తేడా తెలుసుకోవాలని విఙ్ఞప్తి చేస్తున్నా’ అని రెండు ఫొటోలను షేర్ చేశారు. అయినా సెల్ఫీ అడిగితే దురుసుగా ప్రవర్తించందంటూ రణును నిందించారే తప్ప.. సెలబ్రిటీ లైఫ్నకు ఆమె అలవాటు పడలేదన్న విషయాన్ని గుర్తించని వ్యక్తులు.. ఇప్పుడు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తారని ఆశించడం మూర్ఖత్వమే అవుతుందన్న విషయాన్ని తాజా కామెంట్లు స్పష్టం చేస్తున్నాయి. View this post on Instagram As you can see, this is the difference between the work that we have done and the 'Fake' picture that has been edited to an extent. All the jokes and trolls are fine and they make us laugh too but to hurt someone sentiments, that's not a very good thing to do. We truly hope that you all will understand the truth and realise the difference between the fake one and the one that is genuine. That's all we ask for. A post shared by sandhyasmakeover (@sandhyasmakeover) on Nov 19, 2019 at 1:09am PST -
మితిమీరిన మేకప్: గుర్తుపట్టలేనంతగా రణు..!
దేవుడు ప్రసాదించిన చక్కటి స్వరంతో ఒక్కరోజులో దివ్యగాత్రి అయిపోయిన నిరుపేద మహిళ రణు మొండాల్ కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద స్టార్ సింగర్‌గా వెలిగిపోతున్నారు! ఇటీవలే బాలీవుడ్ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ హిమేశ్ రేష్మియాతో కలిసి ప్రస్తుతమింకా పూర్తి కాని ఒక సినిమా ఆడిషన్ కోసం రణు పాడిన ‘తేరీ మేరీ.. తేరీ మేరీ కహానీ’ పాట.. ఆమె గొంతులోంచి యూట్యూబ్ ద్వారా శ్రోతల చెవుల్లో అమృతాన్ని ఒలికించింది. లతా మంగేష్కర్‌ను తన ఆరాధ్య గాయనిగా కొలిచే రణు నిన్న మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్ రైళ్లలో పాటలు పాడుకుంటూ తిరిగే యాచకురాలని మీరు చదవే ఉంటారు. అక్కడి రాణాఘాట్‌కు చెందిన అహింద్రా చక్రవర్తి అనే ఇంజనీరు.. ట్రైన్లో వెళుతూ రణు మొండాల్ పాటను రికార్డు చేసి, ఆ వీడియోను తన ఫేస్ బుక్‌లో అప్లోడ్ చేశాడు. అలా ఆమె రేష్మియా దృష్టికి వచ్చారు. 59 తొమ్మిదేళ్ల ఈ సింగర్ ఇప్పుడు తన మేకప్‌తో మళ్లీ వైరల్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఒక బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవానికి ఆదివారం అతిథిగా వచ్చిన రణు మితిమీరిన మేకప్‌తో ఉండగా అక్కడివారెవరో తీసిన ఫొటో ట్విట్టర్లో ఇప్పుడు విపరీతంగా తిరుగుతోంది. ఆమె ముఖంపై వేసిన ఫౌండేషన్ బాగా ఎక్కువైంది. మేకప్ లేయర్లు కూడా పైకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై అనేక విధాలుగా ఇప్పుడు ఆమె ట్రోల్ అవుతున్నారు. రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్కరు మాత్రం సరిగ్గా అర్థం చేసుకోగలిగారు. ‘‘ఎందుకు అంతా నవ్వుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. తనకై తను ఆమె అలా ఎందుకు ఓవర్ మేకప్ చేయించుకుని ఉంటారు? కనీసం తనకు మేకప్ ఎక్కువైందన్న సంగతిని కూడా ఆమె గ్రహించి ఉండరు. ఆ గ్రహింపు ఆమెకు మేకప్ చేసినవారికైనా ఉందో లేదో!! ఇలా ట్రోల్ చేయడం చాలా అమానుషం’’ అని ట్విట్టర్ యూజర్ ఒకరు ఆమెను సమర్థించారు. -
అభిమానిని తోసిపారేసిన రణు మొండాల్
ఒకప్పుడు ఆమె ఓ యాచకురాలు.. కానీ ఇప్పుడు ఆమె బాలీవుడ్ సెన్సేషన్. కోల్‌కతాలోని రానాఘట్ రైల్వేస్టేషన్లో లతా మంగేష్కర్ పాటలను ఆలపిస్తున్న రణు మొండాల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. ఆమె గాత్రానికి ఫిదా అయిన హిమేశ్ రష్మియా రణుతో పాటలు పాడించి ఆమెకు పాపులారిటీని తెచ్చిపెట్టాడు. అయితే ఆమెకు ఇప్పుడు ఆమెకు గర్వం తలకెక్కిందని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. దీనికి ఆమె వ్యవహార శైలే కారణమైంది. రణుమొండాల్తో సెల్ఫీ దిగడానికి ఓ మహిళా అభిమాని తహతహలాడింది. ఫొటో కావాలంటూ చేయితో తాకుతూ పిలిచింది. దీంతో రణు ఆమెపై సీరియస్ అయింది. ‘నన్ను చేతితో తాకుతున్నావేంటి, టచ్ చేయకు’ అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఆటిట్యూట్ చూపించుతూ ఆమెను తోసేసింది. అయితే, అభిమాని పట్ల రణు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్కడి నుంచి వచ్చావో మళ్లీ అక్కడికే వెళ్లు అంటూ రణుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాస్త పేరు రాగానే గర్వాన్ని నెత్తికెక్కిచ్చుకుని ఇలా ప్రవర్తించడం ఏమీ బాలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram Social | Don't touch me; I'm celebrity now. #ranumondal #Kolkata #Bollywood #bollywoodfashion #bollywoodnews #bollywoodcelebrity #Mumbai #Filmcity #IndianHistoryLive A post shared by Indian History Pictures (@indianhistorylive) on Nov 3, 2019 at 11:32pm PST -
‘నజర్ కే సామ్నే’ అంటూ అదరగొట్టిన ఉబర్ డ్రైవర్
లక్నో: సాదాసీదా జీవితం గడుపుతున్న ఉబర్ క్యాబ్ డ్రైవర్ తనలోని అద్భుతమైన టాలెంట్‌తో ప్రయాణీకులను అబ్బురపరుస్తూ.. రణు మొండాల్‌ను తలపిస్తున్నారు. నిత్యం తన కారులో ప్రయాణించే వారిని క్యాబ్ డ్రైవర్ వినోద్ తన గానంతో అందరిని అలరిస్తున్నాడు. తాజాగా అతని కారులో ప్రయాణించిన ప్రియాంశు.. తాను అద్భుతంగా పాటలు పాడే ఓ డ్రైవర్‌ను కలిశానని, అతను సొంతంగా యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్నాడని అతన్ని వెలుగులోకి తీసుకురావాలని ఉబర్ ఇండియాను కోరాడు. అంతేకాక 1990లో హిట్టయిన 'ఆషికీ' చిత్రంలోని 'నజర్ కే సామ్నే' అనే పాటను ఆలపిస్తున్న వీడియోను షేర్ చేశారు. ప్రఖ్యాత గాయకుడు కుమార్ సాను పాడిన అలనాటి క్లాసిక్ పాటను తన గళంతో సుతిమెత్తగా ఆలాపిస్తూ.. సంగీత ప్రియుల హృదయాల్ని కొల్లగొడుతున్నాడు. 56 సెకన్లకు పైగా నిడివి ఉన్న ఈ వీడియోలో అతని గానాన్ని, గొంతులోని మాధుర్యాన్ని చూసి నెటిజన్లు తన్మయత్వంతో పులకరిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ వినోద్ తన అద్భుత గాన ప్రతిభతో ప్రయాణికులను మైమరిపిస్తూ.. తమ సంస్థ సామాజిక మాధ్యమాల్లోని పేజీల్లో ప్రతినిత్యం వార్తల్లో ఉంటున్నారని ఉబర్ ఇండియా సంస్థ యాజమాన్యం ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విటర్లో పేర్కొంది. Met an @Uber_India driver Vinod ji in Lucknow. He is an amazing singer and asked to sing a song for me after finishing his ride. Aur kya chaiye. Please watch this video and make him famous. He is also having his own @YouTube @youtubemusic channel. #Lucknow #Uber pic.twitter.com/G4zu8u2531 — #SavePriyanshu (@crowngaurav) September 14, 2019 -
లత విమర్శించినా.. రాణు మాత్రం..!
రాణు మొండాల్.. రైల్వే స్టేషన్లో యాచకురాలి నుంచి ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా దేశవ్యాప్తంగా ప్రసిద్ధురాలైన సింగర్ ఆమె. రైల్వే స్టేషన్లో ఆమె పాడిన పాట ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. ఓవర్‌నైట్ ఆమె స్టార్ సింగర్‌గా మారిపోయారు. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రెష్మియా కూడా ఆమెకు అవకాశమిచ్చారు. ఆమె పాడిన పాటలు సంగీత ప్రియుల మదిని దోచుకుంటున్నాయి. కానీ, ఒక్కసారిగా తెరమీదకు వచ్చి పాపులర్ అయిన రాణు మొండాల్‌ను ఉద్దేశించి ప్రఖ్యాత సింగర్ లతా మంగేష్కర్ స్పందిస్తూ.. పలు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఒకరి పాటను ఇమిటేట్ చేయడం ద్వారా ప్రజాదరణ పొందవచ్చేమో కానీ, అది కళ కాబోదని పేర్కొన్నారు. రాణు ఇమిటేట్ చేయడం మానుకొని.. ఒరిజినల్గాఉండేందుకు ప్రయత్నించాలని సూచించారు. లత పాడిన ‘ఏక్ ప్యార్‌కి నగ్మా హై’ పాటను బెంగాల్‌లోని ఓ రైల్వే స్టేషన్లో రాణు హృద్యంగా ఆలాపించడం ద్వారా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. లత విమర్శలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక లెజెండ్ సింగర్ అయిన లత రాణు విషయంలో కొంత ఉదారంగా ఉండాల్సిందని, ఆమె పెద్ద హృదయాన్ని చాటుకోలేకపోయారని పలువురు ఆవేదన చెందారు. కానీ, రాణు మాత్రం లత విమర్శల పట్ల ఏమాత్రం అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పైగా లత తన కంటే సీనియర్ అని, చిన్నప్పటి నుంచి ఆమె పాటలు వింటూ పెరిగానని, ఎప్పుడూ ఆమెకు జూనియర్‌గానే ఉంటానని ఆమె పట్ల కృతజ్ఞతలు చాటుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో రాణు చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల హృదయాలను హత్తుకుంటున్నాయి. చదవండి: కూతురి పట్ల విమర్శలపై రాణు స్పందన -
విమర్శలపై స్పందించిన రణు మొండాల్
కోల్‌కతా రైల్వే స్టేషన్లో లతా మంగేష్కర్ పాటలను ఆలపిస్తున్న రణు మొండాల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తల్లిని అనాథలా వదిలేసిన రణు కూతురు ఎలిజబెత్ సతీ రాయ్..సెలబ్రిటీ హోదా దక్కిన తర్వాత తిరిగి తల్లి చెంతకు చేరిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై రణు మొండాల్ స్పందించి ‘గతాన్ని ఆలోచించకుండా దేవుడి దయతో మళ్లీ తామంతా కలుస్తామని.. తన కూతురు సతీరాయ్ని ఉద్దేశించి పేర్కొంది. అదే విధంగా తనను చేరదీసిన అతీంద్ర చక్రవర్తి, తపన్ దాస్(క్లబ్ సభ్యులు)ను సతీ.. అపార్థం చేసుకుందని, కేవలం ఇతరుల అభిప్రాయాల వల్ల అలా ప్రవర్తించి ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపింది. కాగా సతీని.. ఎవరు రెచ్చగొట్టుతున్నారో, బెదిరిస్తున్నారో తనకు తెలియదని, అతీంద్ర చక్రవర్తి, తపన్ దాస్ తనను బాగా చూసుకుంటున్నారని రణు స్పష్టం చేసింది. అదేవిధంగా ‘పాడటం మీద ప్రేమ లేకపోతే.. ఈ రోజు ఇలా పాటలు పాడలేకపోవచ్చు. దేవుని మీద ప్రేమ ఉంది. అందుకే పాడగలననే నమ్మకం కలుగుతోంది. రైల్వే స్టేషన్లో పాటలు పాడుకున్నప్పుడు గ్రహించలేదు.. ఇటువంటి ఓ రోజు వస్తుందని. ఇప్పుడు నా గొంతుపై పూర్తి నమ్మకం ఉంది. మొదట్లో లతా మంగేష్కర్ స్వరంతో ప్రేరణ పొందాను. భవిష్యత్తులో కూడా పాడటం కొనసాగిస్తాను. ఎప్పుడూ ఆశను కోల్పోలేదు’ అని రణు మొండాల్ పేర్కొంది. కాగా హిమేష్ రేష్మియా తను పాడటానికి కల్పించిన వేదికను ఊహించలేదన్నారు. గతంలో చిన్న వేదికపై ప్రదర్శన ఇచ్చానని తెలిపింది. కాగా హిమేష్.. రణుకు రెండు పాటలు పాడే అవకాశం కల్పించాడన్న విషయం తెలిసిందే. చదవండి: ఆమె మొదటి భర్త కూతురిని; గర్వపడుతున్నా! -
‘నా కాళ్లు విరగ్గొడతామని బెదిరించారు’
కోల్‌కతా : తమతో పాటు ఉండమని ఎన్నిసార్లు చెప్పినా తన తల్లి వినలేదని సోషల్ మీడియా సెన్సేషన్ రణు మొండాల్ కూతురు ఎలిజబెత్ సతీ రాయ్ అన్నారు. తన జీవితం గురించి పూర్తిగా తెలుసుకోకుండా నెటిజన్లు తనను విమర్శించడం బాధ కలిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషనులో లతా మంగేష్కర్ పాటలను ఆలపిస్తున్న రణు మొండాల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. రణు గాత్రానికి ముగ్ధుడైన బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా ఆమెకు రెండు పాటలు పాడే అవకాశం కల్పించాడు. ఈ క్రమంలో తల్లిని అనాథలా వదిలేసిన రణు కూతురు..సెలబ్రిటీ హోదా దక్కిన తర్వాత తిరిగి తల్లి చెంతకు చేరిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన రణు కూతురు ఎలిజబెత్ సతీ రాయ్ మాట్లాడుతూ..‘ మా అమ్మ రైల్వే స్టేషనులో పాటలు పాడుతోందని నాకు తెలియదు. నేను ఆమె మొదటి భర్త కూతురిని. మేము ముంబైలో ఉండేవాళ్లం. నాకు ఓ అన్నయ్య ఉన్నాడు. మా నాన్న చనిపోయిన తర్వాత అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్త ద్వారా తనకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. అమ్మ ఇప్పుడు కోల్‌కతాలోనే ఉంటుంది. నేను కూడా ఇక్కడే ధర్మటాలలో ఉంటాను. నాకు ఉన్న బాధ్యతల కారణంగా నేను తరచుగా తనను కలిసే వీలు ఉండేది కాదు. నాకు నలుగురు పిల్లలు. భర్త వదిలేశాడు. చిన్న కూరగాయల షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. రెండు నెలల క్రితం బస్టాండులో తనను చూసినపుడు ఇంటికి నాతో పాటు ఇంటికి రమ్మని చెప్పాను. తను ఒప్పుకోలేదు. సరేనని 200 రూపాయలు చేతిలో పెట్టి ఇంటికి వెళ్లిపోయాను. అంతేకాదు నెలనెలా తనకు 5 వందల రూపాయలు పంపేదాన్ని. నా కొడుకు చాలా చిన్నవాడు. పిల్లలను చూసుకోవడంతో పాటు వ్యాపారం చేయడంతో నాకు కనీసం సరిగా తిండి తినే సమయం కూడా దొరకడం లేదు. ఇదంతా తెలియకుండా తల్లిని వదిలేశానంటూ జనాలు నన్ను ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకుంటున్నారు. మిగతా వాళ్లైనా(సోదరులు) అమ్మను పట్టించుకోవచ్చు కదా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి : రైల్వే స్టేషన్లో పాట ఆమెను సెలబ్రిటీ చేసింది..! అదే విధంగా రణు మొండాల్‌కు ఆశ్రయం కల్పించిన రణఘాట్ ఆమ్రా శోభై షోతాన్ క్లబ్ నిర్వాహకులపై ఎలిజబెత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ అతీంద్ర చక్రవర్తి, తపన్ దాస్(క్లబ్ సభ్యులు) నిజంగా మా అమ్మ సొంత కుమారులు అయి ఉంటే ఆమెను బాగా చూసుకునేవారు. కానీ మా అమ్మ వాళ్ల దగ్గర ఉన్నట్లు నాకు సమాచారం ఇవ్వలేదు. తన గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లాలని ప్రయత్నించగా నా కాళ్లు విరగ్గొట్టి బయటకు విసిరి వేస్తామని బెదిరించారు. నాకు వ్యతిరేకంగా మా అమ్మ మనసు మార్చారు. ఆమె దగ్గర నుంచి 10 వేల రూపాయలు తీసుకుని ఓ సూట్‌కేసు, రెండు నైటీలు మాత్రమే కొనిచ్చారు. వాళ్లను నమ్మడానికి వీల్లేదు అని విమర్శించారు. ఏదేమైనప్పటికీ అమ్మకు గుర్తింపు రావడం సంతోషంగా ఉందని... ఆమె కూతురిగా పుట్టినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. -
‘పిచ్చి పట్టిందా..డాక్టర్‌కు చూపించుకో’
నేటి డిజిటల్ యుగంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రస్తుతం అందరూ టిక్‌టాక్ యాప్‌లో మునిగితేలుతున్నారు. ఎంతో మంది తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ సెలబ్రిటీలుగా మారుతుంటే.. కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ఓ ఒడిశా నటుడు మాత్రం తన అత్యుత్సాహం, బిత్తిరితనంతో విమర్శల పాలవుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రణు మొండల్ అనే ఓ సామాన్యురాలు తన అద్భుత గాత్రంతో దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పాటలను ఆలపిస్తూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మధురమైన గానానికి ముగ్ధుడైన బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా రణు చేత ఓ పాటను రికార్డు చేయించాడు. ‘తేరీ మేరీ కహానీ’ అంటూ సాగే పాటను ఆలపిస్తున్న రణు పక్కనే ఉండి ఆమెను ఉత్సాహపరుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒడిశా కమెడియన్, పప్పు పామ్ పామ్‌గా ఫేమస్ అయిన తత్వా ప్రకాశ్ సతపతి ఈ వీడియోపై టిక్‌టాక్‌లో తన ‘సృజనాత్మకత’ ప్రదర్శించాడు. పాట రికార్డింగ్ సమయంలో రణు కట్టుకున్న రంగు చీరను కట్టుకుని, ఆమెలా హావభావాలు పలికిస్తూ మైక్ ముందు నిల్చుని రణును అనుకరించాడు. ఇక అదే సమయంలో మరో వ్యక్తి హిమేశ్ రేష్మియాలా పప్పును ఉత్సాహపరిచాడు. ఈ క్రమంలో రణును కించపరిచేలా ఉన్న ఈ టిక్‌టాక్ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘పప్పూకి పిచ్చెక్కిందేమో. మతిస్థిమితం తప్పినట్లుంది. ఒకసారి ఆయనను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లాలి. తోటి కళాకారిణిని అవమానించే ముందు ఒక్కసారైనా ఆలోచించవచ్చు కదా’ అంటూ ప్రకాశ్ సతపతిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాగా ఈ విషయంపై స్పందించిన ప్రకాశ్ అసిస్టెంట్ ఆయన సరదా కోసం మాత్రమే వీడియో చేశారని చెప్పుకొచ్చాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రణు రైల్వే స్టేషనులో పాట పాడుతుండగా గమనించిన అతీంద్ర చక్రవర్తి అనే ఓ యువ ఇంజనీర్ ఆమె పాటను రికార్డు చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన రణుకు హిందీ చానెల్ అవకాశమిచ్చింది. ఆమె లుక్‌ను పూర్తిగా మార్చివేసి సెలబ్రిటీగా ప్రేక్షకుల ముందు నిలబెట్టింది. ఇక ఆమెకు నేపథ్య గాయనిగా అవకాశం ఇచ్చిన హిమేశ్ మరో పాట కోసం కూడా రణునే ఎంచుకున్నాడు.